Saturday, May 23, 2009

ఓ మేఘమాల

భలే రాముడు లోనిది ఈ పాట .

Monday, May 18, 2009

చెప్పవే చిరుగాలి

పాతపాటల తో దీటుగా ఈ కాలములోనూ చక్కని సాహిత్యముతో వినసొంపైన పాటలు ఈ కాలములోనూ వున్నాయి.అలాటి వాటిలో ఇదొకటి.

Friday, May 15, 2009

మనసున వున్నది

మనుసులో ఎన్నెన్నో భావాలు కదలాడుతుంటాయి.కాని చెప్పా లంటే మాటలు రావు. ఈ పాట లో ఆ భావన చక్కగా వివరించారు.





నీ సన్నిది లో మాటల కి,హావభావాలే అవసరము లేదు,గాలే గాంధర్వము,మౌనమే మంత్రము అని కవి ఎంత మధురముగా వర్ణించాడు .

Sunday, May 10, 2009

అమ్మ

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మా
ఆ జగన్మాత కరుణా అందరిపై ప్రసరించాలని,
అందరికీ జయము కలగాలని కోరుకుంటున్నాను.
సర్వేజనా సుఖినోభవతు.


Wednesday, May 6, 2009

సిరులోలి కించే చిన్ని నవ్వులే

మా చిన్ని రౌవ్డి గౌరవ్ చాలా అల్లరి వాడు.వాడి చూడగానే
చిన్ని కన్నా నిను చూడగా వేయి కనులైన చాలవురా
ఇన్ని కళ్ళు నిను చూస్తుండగా దిష్థి ఎంత తగిలేనురా

అని పాడుకున్నాను.వాడు అప్పుడప్పుడు పాటలు పాడినా డాన్స్ అంటే చాలా ఇష్థంవాడి శరీరం ఎన్ని వంపులు తిరుగుతుందో.ఈ మద్య పాలకొల్లు వెళ్ళాడు. వాళ్ళ అమ్మమ్మ ఇంటి పక్కనే చిరంజీవి అఫ్ఫిస్ వుందట టి.వి నైన్ వాళ్ళ వాన్ వీళ్ళ ఇంటి ముందే ఆగితే ఆ రొజంతా అందులో నే వుండి చిరంజీవి అంకుల్ డాన్స్ చేసాడట.నాకు అరెరె పాట నేర్పించాలని తెగ కష్ఠ పడ్డాడు.

మా బాబులు,పాపలు కూడా మహరాజుల్లా మహరాణిల్లా ఎదగాలి అని ఈ పాట కుడా ఎప్పుడూ పాడుకుంటూ వుంటాను.నాకు ఈపాట చాలాఇష్ఠం.

Monday, May 4, 2009

ముద్దు గారే యశోదా

బ్రహ్మ మురారి అర్చిత లింగం అని ఏమాత్రము తడబడకుండా స్పస్టముగా పాడుతాడు నా ముద్దుల కన్నయ్య విక్రం .బాగా పాడుతున్నాడు కదా అదితి పాడుతుంది వీడు తబలా వాయిస్త్తాడు అని తబలా కొని టీచర్ ని కుడా పెట్టాను అబ్బే ఈ రొజు వున్న శ్రద్ద రేపువుండదు.నా లాగే అన్నిటిలో ముక్కు దూరుస్త్తాడు.
జు జు జూ అని పాడుతుంటే తెగ నావ్వేవాడు.
వద్దురా కన్నయ్యా నను వదలి పొవద్దురా అని పాడగానే ఎలా అమ్ముమ్మా డాడి వస్తే వెళ్ళాలిగా అని దీనంగా మొహం పెట్టేవాడు.

వాడికోసము నేను పాడిన పాటలలో ఒకటి.

లాలి లాలి లాలీ

తెల్లగా బూరె బుగ్గలతో,నల్లగా మెరిసే కళ్ళతో అపరంజి బొమ్మలా వుండేది మేఘ.నేను ఎటుతిరిగితే అటు కళ్ళు తిప్పుతూ చాలా ముద్దుగా వుండేది.దాన్ని చూడగానే
అల్లారు ముద్దు కదే ,అపరంజి ముద్ద కదే,
తీయని విరితోటకదే ,దివి యిచ్చిన వరము కదే
అని పాడుకున్నాను.మేఘాకీ పాటలంటే ఇస్టం ఏ పాట అయినా ఇట్టే పట్టేస్తుంది .రాధామధు సీరియల్ పాట నాకైతె అర్దము కాలేదు కాని దాని కిమటుకు పూర్తిగావచ్చు.మేఘాకి ఇష్టమైన పాట

ఐ యాం ఎ గుడ్ గర్ల్

నేను నా పిల్లల తో కన్నా మనవరాళ్ళు ,మనవల తోనే ఎక్కువగా గడిపాను,బహుషా వాళ్ళు పుట్టినప్పుడు నేను యు యస్ ఏ వెళ్ళి,పూర్తిగా వాళ్ళతోటే గడిపిందువల్ల కావచ్చు.లేదా అప్పుడు ఏ భాద్యతలు లేకపొవటము వల్ల కావచ్చు .ఏదైనా నాకు నా గ్రాండ్ చిల్డ్రెన్స్ తో అనుబంధం ఎక్కువే.మొదటిసారిగా నాకు సీనియర్ సిటిజన్ షిప్ ఇచ్చింది అదితి.పుట్టగానే చక్కగా కళ్ళు తెరిచి చూసింది.నన్నే అంటే నన్నే అని నేను ,మా అమ్మయి ,మా అల్లుడు పోట్లాడుకుంటామూఅళ్ళము..నేనైతె నన్నే అనుకుంటాను.ఇంట్లో ఇద్దరమే వుండేవాళ్ళము. గొంతెత్తి సిగ్గులేకుండా ఎన్ని పాటలు పాడేదాన్నొ!బంగారు తల్లి అన్నీ చక్కగా వినేది.ఇప్పుడు మా అదితి ఇంత బాగా పాడుతుందంటే ఆ అనుభవమే కదా.అదేంటో ఎవ్వరూ నన్ను మెచ్చుకోరు.మల్లాది వెంకటక్రిష్ణమూర్తి పుస్తకము లోని పాట తో మేము పాడుకోవటము మొదలు పెట్టాము.ఆ పాట
లో లో లో హాయమ్మ హాయి,ఆపదలు కాయి
చిన్ని తండ్రి (తల్లి)ని కాయి శ్రీరంగ సాయి,
అచ్చట్లు ముచ్చట్లు అవ్వలకి ముద్దు,
తప్పట్లు తట్టితే తాతలకు ముద్దు,
జోలల్లు పాడితే పాపలకు ముద్దు,
మా చిన్ని పాప మాకు ముద్దు.-లో
పాప దగ్గర అదితి అని ,ఆతరువాత ఎవరి కోసము పాడితే వారి పేరు అని పాడేదాన్ని. అదితి కి ప్రత్యేకముగా పాడింది ఈ కింది పాట.ఈ పాట పాడటము వలననే అదితి చాలా అల్లరిపిల్ల అయ్యిందట .విడ్డూరము కాకపొతే పాటకే అల్లరి వస్తుందా అయినా పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దవాళ్ళు చేస్త్తారా! ఇప్పుడు ఏమైనా అంటే మేము అస్సలు వొప్పుకొం .టీనేజెర్ అంటే మజాకా.