Wednesday, June 29, 2011

మాంగల్య బలం



1958 లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు నిర్మించిన కుటుంబ కథా చిత్రం " మాంగల్య బలం " . ఈ సినిమా నిర్మాత డి. మధుసూధనరావు . దర్శకత్వం వహించింది ఆదూర్తి . సుబ్బారావు . ఇందులో నాయిక నాయకులు గా ఏ. నాగేశ్వరరావు . సావిత్రి నటించారు . ఇంకా యస్. వి రంగారావు , సూర్యకాంతం , కన్నాంబ , రేలంగి , రాజసులోచన , రమణా రెడ్డి మొదలైన వారు నటించారు .

పాపారావు కు ఒక కొడుకు సూర్యం , కూతురు సరోజ . భార్య కాంతం మహా గయ్యాళిది . ఎప్పుడూ అత్తగారిని ఝాడించటమే పని . ఆమె నోటికి అంతా భయపడతారు . ఆడపడుచు సీత ఏమీ లేని పేదవాడిని ప్రేమించిపెళ్ళి చేసుకున్నదని ఆమె అంటే చులకన . ఏమైనా అంటే మీరూ మీరూ ఒకటి నేనేగా పరాయిదానిని అంటూవుంటుంది .

వూరి నుంచి పంతులు శిస్తు వసూలుచేసుకొని వస్తాడు . అతని ద్వారా సీతకు గుండెజబ్బు వచ్చిందని తెలుస్తుంది . ఆమె ను చూసేందుకు పార్వతమ్మ , సూర్య , సరోజలను వెంటపెట్టు కొని వూరు వెళుతుంది . అక్కడ చావు బతుకుల మద్య వున్న సీత కడసారి కోరిక తీర్చేందుకు సరోజకు , సీత కొడుకు చంద్రాని కి పెళ్ళి జరిపిస్తుంది . పెళ్ళి జరిగిన తరువాత వచ్చిన పాపారావు విషయము తెలుసుకొని తల్లిపై మండిపడి పిల్లలను తీసుకెళ్ళి పోతాడు . కాంతం జరిగిన సంగతి తెలుసుకొని సరోజ మెడలో నుంచి మాంగల్యం తెంపేస్తుంది . సూర్యం అది తీసి దాచిపెడతాడు . కాంతం కోర్టులో కేసువేసి వివాహ బంధం తెపేస్తుంది . జరిగింది తెలుసుకున్న పార్వతమ్మ పల్లెటూరిలోనే వుండిపోయి భరణం కోసం కొడుకు మీదా దావా వేసి , 10 ఎకరాలు పొందుతుంది .
చంద్రం కు పెళ్ళి సంబంధాలు చూడాలని తండ్రి అనుకున్నప్పుడు ,అమ్మమ్మ పార్వతమ్మ చిన్న తనములో సరోజ తో పెళ్ళైన సంగతి చెప్పి ఎలాగైనా సరోజ మనసు గెలుచుకొని మాంగల్య బంధాన్ని నిలపమని చెపుతుంది . చంద్రం తిరుపతి లో సరోజ ను కలుస్తాడు .ఆమె ప్రేమ నుపొందుతాడు . సరోజకు , తనకు చిన్న వయసులో పెళ్ళైన సంగతి అన్నయ్య ద్వారా తెలుస్తుంది . మాంగల్యాన్ని కాదనలేక , ప్రేమించిన వాడిని వదులుకోలేక విచారిస్తున్న సరోజకు పార్వతమ్మ ద్వారా ప్రేమించి శేఖరే తన భర్త చంద్రం అని తెలుస్తుంది . కొన్ని మలుపుల తరువాత సినిమా సుఖామంతమవుతుంది . అన్నీ సినిమాల్లో లాగే ఇందులోనూ యస్. వి . రంగారావు చివరలో సూర్యకాంతానికి గన్ చూపించి , మనమూ మనమూ ఒకటే అనిపిస్తాడు :)
పాటలన్నీ చాలా బాగున్నాయి . చిన్న పిల్లలు బొమ్మలపెళ్ళిలో పాడిన పాట " హాయిగా హాయిగా ఆలూమగలై కాలం గడపాలి " పాట , యాభై ఏళ్ళ క్రితమే కాదు ఈ కాలం లో నూ భార్యా భర్తలు ఇలాగా వుండాలి అని అనిపిస్తుంది .
" ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి ,
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి ,
శరీరాలు వేరే కాని మనసొకటై మసలాలి ,
సుఖ మైనా కష్టమైనా సగపాలుగా మెలగాలి . " ఇవి ఎంత నిజం .
" తెలియని ఆనందం నాలో విరిసినదీ వుదయం " పాటలో తిరుపతి అందాలు కనువిందు చేసాయి . నిజం తిరుపతి లో తెల్లవారుఝామున సుప్రభాత సేవకు వెళ్ళేటప్పుడు ఆ ప్రకృతి అలాగే వుంటుంది .
" ఆకాశ వీధిలో అందాల జాబిలి " పాటలో విజయావారి చందమామ తో పోటీపడ్డాడు . ఆ మేడ , ఆ జాబిల్లి ఎంత బాగున్నాయో !
" పెనుచీకటాయే లోకం " పాటలో మాంగల్యాన్ని కాదనలేక , ప్రేమించినవాడిని మరిచిపోలేక నలిగిపోయిన అమ్మాయిగా సావిత్రి హావభావాలు వర్ణిచలేనివి . అందుకే సావిత్రి ని "మహానటి" అన్నారు .
సినిమా పెళ్ళి విందు తో ముగుస్తుంది .
మనకు సినిమా విందు :-


































పాటల విందు :-




Friday, June 17, 2011

చండీప్రియ




పోల్కంపల్లి శాంతాదేవి వ్రాసిన నవల " చండీ ప్రియ " ఆధారముగా " చండీప్రియ " సినిమాను అంజలీ పిక్చర్స్ వారు 1980 లో నిర్మించారు . పూర్తి రివ్యూ ను చిత్రమాలిక లో చదవండి .

సినిమాను ఇక్కడ చూడండి .

ఇంక కొన్ని పాటలిదిగోండి .











Monday, June 13, 2011

భలే రాముడు



నారాయణ మూర్తి కి కళలంటే మహా ప్రీతి . అందుకని తన కూతుళ్ళిద్దరు , రూప , తార కు భరతనాట్యము నేర్పిస్తుంటాడు . లలిత కళలను పోషించేందుకోసం థియేటర్ కూడా నిర్మించి , అందులో రూప , తార ల తో నృత్య ప్రదర్షన ఇప్పిస్తాడు . నారాయణ మూర్తి దగ్గర మేనేజర్ గా పని చేసే నాగభూషణానికి రాము , గోపి ఇద్దరు కొడుకులు .రాము కొంచము దుడుకు వాడు . రూప నాట్యప్రదర్షన రోజున చెరువు లోనుంచి తామర పూవులు తెచ్చి రూపకు ఇచ్చి , తండ్రి తో చివాట్లు తింటాడు . ఇంకోరోజు తన చేతిమీద " రాము " అని పచ్చ బొట్టు పొడిపించుకొని , అటుగా వస్తున్న రూపను కూడా పచ్చబొట్టు పొడిపించుకోమని చెపుతాడు . అందుకు రూప కోపగించి , ఇంటికి వెళ్ళి , నాగభూషణానికి రాము మీద కంప్లేయింట్ చేస్తుంది . నాగభూషణము రామూ ను కొడతాడు . అది చూసి రూప రామూ ను వెక్కిరిస్తే రాము , రూపను తోసేస్తాడు . రూప మెట్లమీద నుంచి పడిపోతుంది . రూప కాలు విరుగుతుంది . డాక్టర్ రూపకు కాలు రావటము కష్టము అని చెపుతాడు . దానితో నారాయణమూర్తి రామూ పై కోపము తెచ్చుకొని పిస్టోల్ తో కాలుస్తానని వెంట పడగా రామూ పరిగెత్తుతాడు . రామూను ఆగమని అర్స్తుండగా నారాయణ మూర్తి చేతిలోని పిస్తోలు పొరపాటున పేలుతుంది . రాము వంతెన మీది నుంచి నది లో పడిపోతాడు . నా కొడుకును చంపేసావు , నిన్ను పోలీసులకు పట్టిస్తాను అని నాగభూషణము కోపముగా వెళుతాడు .
నారాయణ మూర్తి ని పోలీసులు పట్టుకొని వెళ్ళారా ?
నది లో పడిపోయిన రాము ఏమైనాడు ?
రూప , తార ఏమయ్యారు ?
ఈ ప్రశ్నలన్నింటి కి జవాబు . . . .

ఆ ((((( భలే ఆశే !!!!! నేను చెప్పను . ఆ కథ వెండితెరపై చూడుడు :)))))
ఆవెండితెర పేరు " భలేరాముడు " .
దానిని నిర్మించినది ; వి. యల్ . నరసు .
దర్షకత్వము : వేదాంతము రాఘవయ్య .
కథా రచయిత ; వెంపటి సదాశివ బ్రహ్మం .
సంగీత దర్షకత్వం ; సాళూరి రాజేశ్వరరావు .
విడుదల తేదీ ; ఏప్రిల్ 6, 1956 .
నటీనటులు , గాయనీ గాయకులు ఎవరంటారా ???
అబ్బా * * * ఇంక నాకు చెప్పే వోపిక లేదు మీరే సినిమా చూసి తెలుసుకోండి . . .

స్చప్ . . . అదేమిటో ఈ రోజు చూసే సరికి యుట్యూబ్ వాడి విడిఓలు తీసెసాడు . ఈ మద్య వాళ్ళ టైం ఐపెయింది అని తీసెస్తున్నారు :) ఈ స్నిప్స్ వాడు కూడా తీసేసాడు . మళ్ళీ అన్నీ మార్చుకోవాలి .

ఈ సినిమా లోని ఈ పాట వక్కటే దొరికింది . అది " ఓహో మేఘమాలా "




Tuesday, June 7, 2011

తోడికోడళ్ళు



నా ముందు తరం తెలుగింటి ఆడపడుచులు శరత్ నవలల ను బాగా ఆదరించారు . ఆ రోజులలో శరట్ నవలలు చదవటము , ఆ బెంగాలీ పేర్లను పిల్లలకు పెట్టుకోవటము ఫాషన్ గా వుండేది . అందుకు కారణం , బహుషా శరత్ నాయికలందరూ మధ్యతరగతి వారే . స్త్రీని అన్ని కోణాలనుంచీ చిత్రిస్తూ , శక్తిస్వరూపిణి గానూ , దయార్ద హృదయిని గానూ , సేవాతత్పరురాలుగానూ , ప్రేమామృతవర్షిణిగానూ , ఉద్యమశీలిగా నిలిపిన ఘనత శరత్ ది . 19వ శతాబ్ధం మద్య నుండి 20 శతాబ్ధం మద్య వరకూ శరత్ వర్ణించిన స్త్రీ జీవించిన సాంసారిక , సామాజిక పరిస్తితులే కొంచం అటూ ఇటూగా తెలుగునాట కూడా వున్నాయి . స్త్రీలోని బహుముఖీన స్వభావాలు తెలుగు పాఠకులనూ , ప్రధానం గా స్త్రీలనూ ఆకర్షించాయి . అందుకే తెలుగు పాఠకులకు శరత్ అత్యంత ఆదరణీయ రచయత కాగలిగాడు .
ఆ రోజులలో శరత్ నవల ల ఆధారము గా సినిమాలు కూడా చాలా వచ్చాయి . అవి జనాదరణ కూడా పొందాయి . 1957 లో అన్నపూర్ణ వారు శరత్ నవల " నిష్కృతి " ఆధారము గా " తోడికోడళ్ళు " నిర్మించారు . అన్నపూర్ణ వారి ఆణిముత్యములలో తోడికోడళ్ళు కూడా ఒకటి . ఇందులోని పాటలు కూడా ప్రజాదరణ పొందాయి .
ఇది చక్కటి ఉమ్మడి కుటుంబ కథా చిత్రము .
ఇదిగో ఆ సినిమా :-



సినిమా తరువాత చూస్తారా ? ఇప్పుడు పాటలు చూస్తారా వాకే
గాలిపటం గాలిపటం


కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ దానా



ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ . . .
ఇది బాగా హిట్టైన పాట . నాకూ ఇష్టమైన పాట :)



టౌన్ పక్కకెళ్ళొద్దూరా డింగిరీ . . .



పొద్దైనా తిరగక ముందే చుక్కైనా పొడవక ముందే . . .



ఎన్నతెన్నత దూరం కోసెడు దూరం . . .