పాట రచయత్రి ; శ్రీమతి సీతా లక్ష్మి
సంగీతం ; శ్రీ . భరద్వాజ
గానం ; బేబీ అనఘ
Friday, August 27, 2010
Sunday, August 15, 2010
Wednesday, August 11, 2010
శృతిలయలు

1987 లో కె. విశ్వనాథ్ డైరక్షన్ లో , కరుణాకర సుధాకర్ నిర్మించిన చిత్రం శృతిలయలు . ఇందులో నాయుడు గా కె. సత్యనారాయణ నటించారు . నాయుడు కు కళలపైన అమితమైన ఆసక్తి . మంచి నాట్య కారుడైన , నాయుడికుమారుడు ప్రమాదవసాత్తు మరణిస్తాడు . కళల పై ఆసక్తి తో , ముగ్గురు అనాధ బాలురను చేరదీసి , వారికి సంగీతం లోశిక్షణ ఇప్పించి , తీర్చిది ద్దుతాడు . ఆయన నిర్మించదలిచిన కళా క్షేత్రము కోసం , నిధులను సంపాదించేందుకు పట్ణంవెళుతారు ఆ అబ్బాయిలు ముగ్గురు . ఆ తరువాత రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి .
ఇందులోని పాటలన్నీ నాకు చాలా నచ్చుతాయి . కె. వి మహదేవన్ సంగీతం సమకూర్చగా , వాణీ జయరాం , యస్. జానకి , యస్ .పి . బాల సుబ్రమణ్యం , పి .సుశీల , కె. జె . జేసు దాస్ పాడారు .
శ్రీ గణ నాథం బజామ్యహం
ఆలోకయే శ్రీ బాలాకృష్ణం
తెలవారదేమో స్వామీ
జానకీ కాంత స్మరణం
శ్రీ శారదాంబా నమోస్తుతే
సామజ వర గమనా
తందనా అరి తందనా నా భళా
తక ధిమి
చెలువము నేలగ
ఇన్ని రాశులయుని కి ఇంతి చెలుని కి
|
Sunday, August 1, 2010
బంగారుపంజరం

శోభన్ బాబు నాయకుడు , వేణు గా , వాణిశ్రీ , నాయిక నీల గా 1969 లో ' బంగారు పంజరం ' చిత్రం రిలీజ్ ఐయింది . నారాయణగూడా లోని , దీపక్ మహల్ లో ఈ సినిమా చూసాను . ఈ సినిమా , ఇందులోని పాటలు , ప్రకృతి అందాలు నాకెంత గానో నచ్చాయి . అందుకే మావారు శెలవలో వచ్చినఫ్ఫుడు , ఆయన తో కలిసి మళ్ళీ చూసాను . అప్పటి వరకు నేను సినిమాలు చూడటమే తక్కువ . అందులోనూ రెండో సారి చూసానంటే ఎంతగా నచ్చిందో మరి .
నల్లమల అడువులలో మేకలను కాసుకుంటూ తిరిగే అమాయకురాలు , పల్లెటూరి అమ్మాయి నీల . శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఇంజనీర్ గా వస్తాడు వేణు . నీల అమాయకత్వం , అందం అతనిని ఆకర్షిస్తాయి . పెళ్ళిచేసుకొని తన వూరికి తీసుకెళుతాడు . అక్కడ వారిద్దరి దాంపత్యం , నీల అక్కడ ఇమిడేందుకు పడే ఇబ్బందులతో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి .చిత్రం ఆద్యంతమూ చాలా చక్కగా చిత్రీకరించారు . పాటలు కూడా చాలా చాలా వినసొంపుగా వున్నాయి . కథ నాకంత గా గుర్తులేదు కాని , పాటలు మాత్రం తరుచుగా వింటూ వుంటాను.
సినిమా డైరెక్టర్ ; బి . యన్ . రెడ్డి ,
పాటల రచయత ; దేవులపల్లి కృష్ణ శాస్త్రి ,
సంగీతం సమకూర్చినది ; సాళ్ళూరి రాజేశ్వర రావు ,
గాయకులు ;
ఘంటశాల ,
యస్. జానకి ,
బహుషా ఒక పాట కోమల పాడినట్లు గుర్తు .
పగలైతే దొరవేరా , రాతిరి నా రాజువు రా
కొండల కోనల సూరీడు కురిసే బంగారు నీరు
గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో
మనిషే మారే రా రాజా , మనసే మారే రా
ఇంకా రెండు పాటలున్నాయి కాని వాటి లింక్ దొరకలేదు . ముఖ్యం గా పాపను జోకొడుతూ నీల , తన బాధ తెలియచేసే పాట ,' జో కొడుతూ కథ చెపుతా ఊ కొడుతూ వింటావా ' పాట లింక్ కోసం వెతికాను కాని దొరకలేదు .
Subscribe to:
Posts (Atom)