Thursday, March 14, 2013

మీరజాల గలాడా

మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి .

Wednesday, March 13, 2013

దేవుళ్ళు






కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఓ మంచి సినిమా "దేవుళ్ళు" .భార్యా భర్తల మధ్య సత్సంబందాలు లేకపోతే పిల్లలు ఎంత తల్లడిల్లుతారో చెప్పేదే ఈ దేవుళ్ళు . సింగర్ ప్రశాంత్ అభిమాని నిర్మల . అభిమానిగా పరిచయమైన నిర్మలను వివాహమాడుతాడు ప్రశాంత్ . అతని కి మ్యూజిక్ ప్రోగ్రాములలో సాయపడి , అతనికన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంటుంది నిర్మల . ప్రశాంత్ అసూయ తో రగిలిపోతాడు . ఇద్దరి మధ్యా గొడవలు మొదలవుతాయి .విడాకులు తీసుకుందామనుకుంటారు . వారి పిల్లలు భవాని , చింటూ ఈ గొడవలకు తల్లడిల్లిపోతారు .అప్పుడు వారి బామ్మ అసలు ఈ గొడవలన్నిటికీ కారణం తను మొక్కుకున్న ముడుపులు చెల్లించకపోవటమేనని పిల్లల తో చెప్పి బాధపడుతుంది . బామ్మ ఈ గొడవలు ఆపేందుకు , తన తమ్ముడి ని తీసుకొని వచ్చేందుకు వూరి కి వెళ్ళగా , ఇంట్లో ఎవరి కీ తెలియ కుండా బామ్మ కట్టిన ముడుపులన్నీ తీసుకొని ఆయా దేవుళ్ళకు చెల్లించేందుకు , వారి కిడ్డీబాంక్ లో వున్న డబ్బులను తీసుకొని తీర్ధయాత్రలకు బయిలుదేరుతారు పిల్లలు.అందరి ముడుపులు పిల్లలు ఎలా చెల్లిస్తారు , అందులో వారి కి ఎదురైనా ఇబ్బందులు , చివరకు అమ్మానాన్న కలుస్తారా అన్నదే "దేవుళ్ళు" సినిమా.

సినిమా ఆద్ద్యంతమూ చక్కగా తీసారు కోడిరామకృష్ణ . ఎక్కడా విసుగనిపించదు . చక్కటి చిత్రీకరణ , చక్కటి పాటలు . పిల్లలకు ఆయా క్షేత్రాలలోని దేవుళ్ళు మానవరూపం లో వచ్చి సాయపడటం చాలా బాగుంది.పిల్లలు భవానీ , చింటుగా బేబీ నిత్య, మాస్టర్ నందన్ బాగాచేశారు .అయ్యప్పగా మాస్టర్ శుభాకర్ ముద్దుగా వున్నాడు .

నిర్మాతలు ,చేగొండి హరిబాబు ,
            కరాటం రాంబాబు
డైరెక్టర్ . కోడిరామకృష్ణ,
మాటలు, పి.రాజేంద్రకుమార్
పాటలు, జిన్నవిత్తుల రాంలింగేశ్వర్ రావు ,
గాయనీ గాయకులు , యస్.పి. బాలసుబ్రమణ్యం ,
                      రాజేష్,
                      యస్. జానకి,
                      చిత్ర,
                      స్వర్ణలత ,
                      సుజాత
గ్రాఫిక్స్, ఒలిస్ట్ర్ గ్రాఫిక్స్,
            వెంకట్,
కెమెరామెన్,మోహన్ ,
           ప్రకాశ్,
           జయ
ఆర్ట్ డైరెక్టర్,కెవి .వి రమణ,
ఫొటోగ్రఫీ, కోడి లక్ష్మణ్
సంగీతం వందేమాతరం శ్రీనివాస్ ,
ఇహ పాటలు చూద్దాం  .

























కథా విశేషాలు చదివారు , పాటలు చూశారు . ఇక సినిమా చూడండి .





Sunday, February 24, 2013

చోరీ చోరీ





ఈ రోజు బోర్ కొడుతుంటే "చోరి చోరి" సినిమా చూస్తూ కూర్చున్నాను . అదేమిటో ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా విసుగనిపించదు . పాటలు కూడా మళ్ళీ మళ్ళి వినేలా వుంటాయి .

కోటీశ్వరుడు గిరిధర్ లాల్ గారాల పట్టి, కమ్ము ( నర్గిస్) . సుమన్ కుమార్ (ప్రేం ) ను ప్రేమిస్తుంది . కాని తండ్రి వారి ప్రేమను అంగీకరించడు . తండ్రి మీద కోపం తో సుమన్ కుమార్ దగ్గర కు వెళ్ళేందుకు ఇంట్లో నుంచి పారిపోతుంది .గిరిధర్ లాల్ కమ్మును వెతికి తెచ్చిన వారికి 1.25 లక్షల రూపాయలు బహుమతి ప్రకటిస్తాడు . ఇంట్లో నుంచి పారిపోయిన కమ్ము విచిత్ర పరిస్థితులలో సాగర్ (రాజ్ కపూర్ ) ను కలుస్తుంది . నాలుగు రోజులు రకరకాల పరిస్తితులలో చిక్కుకొని , ఇంటి కి తిరిగి వస్తుంది . ఆ నాలుగు రోజులలో జరిగిన విశేషాలను , చివరి కి ఏమి జరిగింది అన్నది సినిమా చూస్తేనే బాగుంటుంది కదా :)

నిర్మాత :యల్. బి లక్ష్మణ్ ,
డైరెక్టర్ ; అనంత్ ఠాకుర్ ,
రచయత ; ఆగా జాని ,
సంగీతం; శంకర్ ఝై కిషన్ ,
గాయనీ గాయకులు ;మన్నాడే , మహ్మద్ రఫీ ,లతా మంగేష్కర్, ఆశాబోస్లే .




















Sunday, February 10, 2013

ఖభి ఖుషీ ఖభి గం



యసవర్ధన్ రాయ్చంద్ , నందిని దంపతులకు ఇద్దరు కొడుకులు రాహుల్, రోహన్ . అందులో రాహుల్ వారి పెంపుడు కొడుకైనను సొంత కొడుకులాగానే పెంచుకుంటారు . రాహుల్ కు పెళ్ళి చేద్దామని ఓ అమ్మాయిని ఎంచుకుంటాడు యసువర్ధన్ . కాని అప్పటికే అంజలి అనే అమ్మాయిని ప్రేమిచటం తో ఆ సంగతి తండ్రి కి చెప్తాడు రాహుల్ . తండ్రి కి ఇష్టం లేకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోయి అంజలిని పెళ్ళిచేసుకొని లండన్ వెళ్ళిపోతాడు రాహుల్.హాస్టల్ లో వున్న రోహన్ ఇంటి కి వచ్చి అన్న లేకపోవటం , తల్లి అన్న కోసం బాధపడటం చూస్తాడు . ఎలాగైనా అన్నని కుటుంబంతో కలపాలని , అంజలి చెల్లెలు పూజా ను కలుసుకొని సంగతి చెప్పి , వాళ్ళింట్లో పేయింగ్  గెస్ట్  గా చేరుతాడు . ప్రయత్నం చేసి అందరినీ కలుపుతాడు .

ఇందులో అందరూ బాగున్నారు . యసువర్ధన్ గా అమితాబ్ , నందిని గా జయాబాధురి, రాహుల్ గా షారూక్ ఖాన్ , అంజలిగా కాజోల్ , రోషన్ గా హృతిక్ రోషన్ , పూజ గా కరీనా చాలా బాగా చేసారు . కుటుంబాన్ని కలిపేందుకు తాపత్రయపడ్డ యువకుడిగా హృతిక్ రోష మంచి నటనని చూపాడు .లండన్ లో వున్నా భారత్ మీద మమకారం చూపిన అంజలి గా కాజోల్ బాగా చేసింది .అసలు ఒకరని కాదు అందరూ హేమా హేమీలే . బాగా చేసారు . కాకపోతే సినిమానే కొంచం పెద్దగా వుంది .

నిర్మాత ;యాష్ జోహార్ ,
డైరెక్టర్ ;కరణ్ జోహార్ .


ఇక పాటలు చూద్దామా :)