Monday, May 4, 2009

ఐ యాం ఎ గుడ్ గర్ల్

నేను నా పిల్లల తో కన్నా మనవరాళ్ళు ,మనవల తోనే ఎక్కువగా గడిపాను,బహుషా వాళ్ళు పుట్టినప్పుడు నేను యు యస్ ఏ వెళ్ళి,పూర్తిగా వాళ్ళతోటే గడిపిందువల్ల కావచ్చు.లేదా అప్పుడు ఏ భాద్యతలు లేకపొవటము వల్ల కావచ్చు .ఏదైనా నాకు నా గ్రాండ్ చిల్డ్రెన్స్ తో అనుబంధం ఎక్కువే.మొదటిసారిగా నాకు సీనియర్ సిటిజన్ షిప్ ఇచ్చింది అదితి.పుట్టగానే చక్కగా కళ్ళు తెరిచి చూసింది.నన్నే అంటే నన్నే అని నేను ,మా అమ్మయి ,మా అల్లుడు పోట్లాడుకుంటామూఅళ్ళము..నేనైతె నన్నే అనుకుంటాను.ఇంట్లో ఇద్దరమే వుండేవాళ్ళము. గొంతెత్తి సిగ్గులేకుండా ఎన్ని పాటలు పాడేదాన్నొ!బంగారు తల్లి అన్నీ చక్కగా వినేది.ఇప్పుడు మా అదితి ఇంత బాగా పాడుతుందంటే ఆ అనుభవమే కదా.అదేంటో ఎవ్వరూ నన్ను మెచ్చుకోరు.మల్లాది వెంకటక్రిష్ణమూర్తి పుస్తకము లోని పాట తో మేము పాడుకోవటము మొదలు పెట్టాము.ఆ పాట
లో లో లో హాయమ్మ హాయి,ఆపదలు కాయి
చిన్ని తండ్రి (తల్లి)ని కాయి శ్రీరంగ సాయి,
అచ్చట్లు ముచ్చట్లు అవ్వలకి ముద్దు,
తప్పట్లు తట్టితే తాతలకు ముద్దు,
జోలల్లు పాడితే పాపలకు ముద్దు,
మా చిన్ని పాప మాకు ముద్దు.-లో
పాప దగ్గర అదితి అని ,ఆతరువాత ఎవరి కోసము పాడితే వారి పేరు అని పాడేదాన్ని. అదితి కి ప్రత్యేకముగా పాడింది ఈ కింది పాట.ఈ పాట పాడటము వలననే అదితి చాలా అల్లరిపిల్ల అయ్యిందట .విడ్డూరము కాకపొతే పాటకే అల్లరి వస్తుందా అయినా పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దవాళ్ళు చేస్త్తారా! ఇప్పుడు ఏమైనా అంటే మేము అస్సలు వొప్పుకొం .టీనేజెర్ అంటే మజాకా.

No comments: