Friday, April 8, 2011

సప్తపది

1981 లో కె. విశ్వనాథ్ దర్షకత్వం లో వచ్చిన చిత్రము " సప్తపది ".
ఈ చిత్రానికి కథ వ్రాసింది కూడా కె. విశ్వనాథ్ నే .
మాటలు : జంధ్యాల ,
నిర్మాత : భీమవరపు బుచ్చిరెడ్డి .
" ఆచార వ్యవహారాలన్నవి మనసును సక్రమమైన మార్గం లో పెట్టటానికి తప్ప కులమన్న పేరు తో మనుషులను విడదీయటానికి కాదు ." అన్న సూక్తి మీద తీసినదీ చిత్రము .
ఇందులో సోమయాజులు , అల్లు రామలింగయ్య , రమణారావు , కొత్త నటీ నటులు , సబిత , రవికాంత్ , గిరీష్ మొదలైనవారు నటించారు . శంకారభరణం నుంచి సోమయాజులు , అల్లు రామలింగయ్య ల కు ఒకే రకమైన పాత్రలు ఇచ్చినట్లున్నారు కె. విశ్వనాథ్ :)
గోదావరిని అందముగా విశ్వనాథ్ చూపించినట్లుగా ఇంకెవరూ చూపించలేరేమో అన్నంత అందం గా వున్నాయి దృష్యాలన్నీనూ . కథ బాగుంది . అన్నీ బాగున్నాయి కాని చిత్రీకరణ నే నాకు అంతగా నచ్చలేదు !
పాటలైతే చాలా చాలా బాగున్నాయి . మరి ఆ పాటలను చూద్దామా :)
సంగీతం : కె.వి . మహదేవన్
పాడిన గాయనీ గాయకులు ,
పి. సుశీల
యస్. జానకి ,
యస్.పి బాలసుబ్రమణ్యం .

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి . . .




అయిగిరి నందిని . . .



ఓం జాతవేద . . .

గోవులు

నెమలికి నేర్పిన నడకలివి . . .



గోవులు తెల్లన. . .


యే కులము నీదంటే . . .



రేపల్లెయ యద ఝల్లున . . .



మరుగేలరా ఓ రాఘవా . . .



భామనే సత్యభామనే . . .



2 comments:

Unknown said...

చిత్రీకరణ నే నాకు అంతగా నచ్చలేదు !
కొంచం వివరించగలరా మాలా కుమార్ గారు...

మాలా కుమార్ said...

శైలబాలగారు ,
శంకరాభరణం లో ఇచ్చినటువంటి పాత్రే , ఇంచు మించు అలాగే వుంది సోమయాజులు గారి పాత్ర.
కళ్ళతో భావాలు పలికించటము , నిశ్బ్ధం అన్ని సార్లూ బాగా అనిపించలేదు . కొన్ని చోట్లైనా మాటలు వుండాలి కదండి . ఎంతసేపూ సోమయాజులు కి అంతా భయపడటమే సరిపోయింది . చీకటి సినిమా గా అనిపించింది . ఏమో నాకు అంతగా నచ్చలేదు . పాటలు మటుకు బ్రహ్మాండం గా వున్నాయి .