Tuesday, May 3, 2011

కన్యాశుల్కం



ఒక శతాబ్ధం కిందట సమాజం లో , ముఖ్యం గా బ్రాహ్మణ కుటుంబాలలో వున్న , 'కన్యాశుల్కం' అనే దురాచారం గురించి రాసిన నాటకం కన్యాశుల్కం . ఇది గురజాడ అప్పారావు గారు 1892 వ ప్రాంతం లో రచించారు . ఆనాటి స్తితిగతులను ఇందులో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు . ఆడపిల్లలను పసితనం లోనే డబ్బు కక్కుర్తికి ముసలివారికి ఇచ్చి వివాహం జరిపించేవారు . ఆ ముసలి వారికి చాకిరీ చేసేందుకోసం వీరు నియమించబడేవారు . ఆ అమ్మాయికి వూహతెలిసే సమయానికే విధవైపోయేది పాపం . అప్పటి నుంచి ఓపిక వున్నన్ని సంవత్సరాలు అత్తింటనో , పుట్టింటనో చాకిరీ చేయటమే సరిపోయేది . వారి జీవితం ధుర్భరం గా గడి చేది .
కన్యాశుల్కం రూపుమాసిపోయినా , ఆడపిల్లలకు చిన్నతనములోనే వివాహం జరిపించటము మటుకు తగ్గలేదు . ఆ తరువాతి కాలం లో తురష్కులు గ్రామాల మీద పడి దోచుకునేటప్పుడు , ఆడపిల్లలని కూడా ఎత్తుకుపోయే వారట . కాకపోతే పెళ్ళైన అమ్మాయిలను ఎత్తుకెళ్ళేవారు కారుట . అందుకని అమ్మాయిలకు 8 సంవత్సరములు నిండ కుండానే వివాహం చేసేవారట .( ఈ సంగతి నాకు మా తాతగారు చెప్పారు .) అప్పుడూ యుక్తవయస్సు వచ్చేసరికే విధవలై పోవటము తప్పలేదు ! కాల క్రమేణ ' శారదా ఆక్ట్ ' అంటే వ్యక్తురాలు కాని అమ్మాయి కి పెళ్ళి చేయకూడదు అనే రూల్ వచ్చినా అలాగే దొంగతనం గా చేసేవారు . ప్రస్తుతమైతే 18 సంవత్సరాలు నిడకుండా అమ్మాయి పెళ్ళి చేయకూడదు అని రూల్ వుందనుకోండి . ఐతే వరకట్న బాధ వచ్చిందిగా ! ఏరాయైతేనేమి పళ్ళూడ గొట్టు కోవటానికి ? అప్పుడూ , ఇప్పుడూ , ఎప్పుడూ అమ్మాయికి ఏదోవిధం గా కష్టాలు తప్పటం లేదు !!!

కన్యాశుల్కం నాటకం ఆధారం గా 1955 లో డి.యల్ గారు పి. పుల్లయ్య దర్శకత్వం లో సినిమా తీసారు ఆ విశేషాలని చిత్రమాలిక లో చదవండి . అది నేనే రాశాను లెండి . ఆ చిత్రం పాటలు కమ్మటి కలలు లో వినండి :)

అన్నట్లు ఈ కింద చిత్రం లో వున్న ఫొటోలు , కన్యాశుల్కం లో గురజాడ వారు వర్ణించిన , అప్పటి విజయనగర వీధులు :_




ఇంక పాటలలో యంటి ఆర్ నూ , సావిత్రి నీ , జానకీ వగైరాలను చూడండి .


















2 comments:

తృష్ణ said...

చాలా బాగా రాసారు మాల గారు. Thanks for the photos.

కన్యాశుల్కం గురించి ఒక చిన్న ఊసు..నేణు 9థ్ క్లాస్ లో ఉన్నప్పుడు మా స్కూల్ ఫంక్షన్లో ఈ నాటకంలోని ఒక భాగాన్ని వేసాము స్టేజ్ మీద.అందులో నేను బుచ్చెమ్మ వేషం వేసాను."చల్దివణ్ణం తింఛారా" అనే డైలాగు నాకిప్పటికీ గుర్తు. నేను వేషం వెయ్యటం అదే మొదలు అదే ఆఖరు.మీ ఆర్టికల్ చదవగానే అది గుర్తు వచ్చింది.

మాలా కుమార్ said...

తృష్ణ గారు ,
ఐతే మీరు బుచ్చెమ్మగా నటించారన్నమాట .
మీకు నా ఆర్టికల్ నచ్చినందుకు థాంక్స్ అండి .