Tuesday, October 4, 2011

ప్రేమలేఖలు



కొంతమంది ఆడపిల్లలు ఏవో అందలాలు ఎక్కుదామని వూహలల్లుకుంటారు . తమ అందం మీద నమ్మకం తో , గర్వం తో జీవితాన్ని ఆటగా భావిస్తారు .స్వేచ్చ పేరిట సంకెళ్ళు తెంచుకున్నాం అనుకుంటారే తప్ప జీవించటానికి విలువైన ఆధారం వదిలేసుకుంటున్నాం అనుకోరు .చివరికి వీళ్ళు కోరుకున్న సుఖమూ దక్కదు , ఎవరి సానుభూతీ వుండదు . అలా తన జీవితాన్ని తెగినగాలిపటం లా చేసుకొని , నాశనం చేసుకున్న అమ్మాయి ప్రేమలత. తండ్రి గారాబము తో , ఇచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేసుకుంది . మదన్ చేతి లో కీలుబొమ్మగా మారింది . మదన్ సుజాత మీద మోజు పడుతున్నాడని అతని కి , తన ప్రాణ మిత్రురాలైన సుజాతను పరిచయం చేస్తుంది . అతని మాయ మాటలకు మోసపోయి , అతనిని ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకుంటుంది సుజాత . పెళ్ళి కి రెండురోజులు ముందుగా మదన్ అసలు స్వరూపం తెలుసుకొని , పెళ్ళిని వద్దనుకొని ధైర్యంగా అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది . అక్క సహాయం తో రవి ని పెళ్ళి చేసుకొని , తన జీవితాన్ని చక్కదిద్దుకుంటుంది సుజాత . ఈ ఇద్దరు అమ్మాయిల కథే యద్దనపూడి సులోచనా రాణి వ్రాసిన నవల కథ " ప్రేమలేఖలు ."
ఈ నవల ఆధారం గా అన్నపూర్ణా పిక్చర్స్ వారు 1977 అదేపేరు తో సినిమా తీసారు . ఇందులో సుజాత గా జయసుధ , ప్రేమలతగా దీప నటించారు . 'విచిత్రబంధం' . ' బంగారు కలలు ' సినిమాలని రంగులలో తీసినా ప్రేమలేఖలు బ్లాక్ అండ్ వైట్ లోనే తీసారు. నవల కథను , సంఘటనలను ఎక్కువగా మార్చలేదు . సెకండ్ ఆఫ్ లో కొద్దిగా మార్చారు . ఆ మార్చింది కూడా బాగుంది . ఇప్పటి వరకూ అన్నపూర్ణావారి సినిమాలలో హీరో గా నాగేశ్వరరావు వున్నా , ఇందులో మురళీమోహన్ హీరొ . హీరో , హీరోయిన్ గా మురళీమోహన్ , జయసుధ చక్కగా వున్నారు .అదికాదు విశేషం , మదన్ గా అనంతనాగ్ , ప్రేమలత గా దీప బాగా అమిరిపోయారు .సినిమా కూడా అన్నపూర్ణావారి స్టాండర్డ్ కు తగ్గట్లు నీట్ గా వుంది . ఈ సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు . ఈ సినిమా టైం కు హీరోయిన్ బొడ్డును చూపించటం ఇంకా మొదలుపెట్టనట్లున్నారు , అలాంటి సీనులేవీ లేవు :)
ఈ సినిమా పాటలు కూడా బాగున్నాయి . గీత రచయితలు , శ్రీశ్రీ , కొసరాజు , ఆరుద్ర , దాశరధి , గోపి .
సంగీతం - సత్యం ,
సహాయకులు శ్యాం .
గాయనీ గాయకులు ; పి. సుశీల ,
వాణీజయరాం ,
యస్. పి బాలసుబ్రమణ్యం
వి. రామకృష్ణ .
ఇది తీయని వెన్నెలరేయి , మది వెన్నెలకన్నా హాయి
నా వూహలు జాబిలి కురిపించెను ప్రేమలేఖలు .




విన్నానులే పొంచి విన్నానులే ,
ఏమని ?
ఒక అమ్మాయి అమ్మ అవుతుందని ఈ అబ్బాయి నాన్న అవుతాడని .



ఈ రోజు మంచి రోజు , మరుపురానిది , మధురమైనది
మంచి తనం వుదయించిన రోజు
ఈ రోజు మంచి రోజు , మరుపురానిది , మధురమైనది ,
ప్రేమ సుమం వికసించిన రోజు .


ఈ అందం , ఈ పరువం ,
నాలో దాచుకో , కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో .


ఆ కాలపు బొమ్మను కాను , ఈ కాలపు పిల్లను నేను ,
అన్యాయాన్ని ఎదిరిస్తాను . అనుకున్నది సాదిస్తాను .

ఈ నాటి విడరాని బంధం ,మనకేనాడో వేసాడు దైవం
ఈ నాటి విడరాని బంధం నేనాడో చేసిన పుణ్యం .

5 comments:

Manasa Chamarthi said...

ప్రేమలేఖలు నవల చదివాన్నేను. సినిమా ఉందని మాత్రం మీ ద్వారానే తెలుసుకున్నాను. కృతజ్ఞతలు.
ఇందులోని "ఇది తీయని వెన్నెల రేయి.." పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. అన్ని వివరాలు ఒక చోట పొందుపరిచిన మీ కృషికి అభినందనలు.

Maitri said...

మాలగారూ నేను దీన్ని చూసిన గుర్తే. రెవ్యూ చాలా బాగుంది.

రుక్మిణిదేవి said...

nice... aa movie theme excellent.. kada..

మాలా కుమార్ said...

మానస చామర్తి గారు ,
థాంక్స్ అండి .
కృష్ణవేణి గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

రుక్మిణీ దేవిగారు ,
అవునండి . ఈ స్టోరీ థీం బాగుంటుంది . సినిమా , నవల కూడా బాగున్నాయి .