Thursday, December 1, 2011

అమెరికా అబ్బాయి




అన్నపూర్ణా వారి సినిమాల లిస్ట్ లో చివరగా వుంది "అమెరికా అబ్బాయి ." దీని నిర్మాత డి . మధుసూధన రావు . డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు . రాధిక , అశ్విని , రాజశేఖర్ , చరణదాస్ మాస్టర్.శ్రావణ్ శంకర్ మొదలైన వారు నటీ నటులు . కథ. జీడిగుంట రామచంద్ర మూర్తి .
ఇహ కథేమిటంటే జ్యోత్స్న ( అశ్విని ) అమెరికా లో డాక్టర్ . ప్రాణ స్నేహితురాలు శారద ( రాధిక ) కొడుకును పెంచుకుంటూ వుంటుంది . శారద పెళ్ళి కాగానే భర్త మరణిస్తాడు . కొడుకును అశ్విని కి ఇచ్చి , చరణదాస్ ను మళ్ళీ పెళ్ళాడుతుంది . శారద తండ్రి రాజారావు ( గుమ్మడి ) ఆస్తంతా మనవడు రాజా పేరు మీద రాస్తాడు . రాజారావు ట్రీట్మెంట్ కొరకు అమెరికా వస్తారు . ఆ తరువాత కథేమిటంటే నాకు తెలియదు . ఎందుకంటే నా సి . డి ఆ తరువాత ఇహ పనిచేయనని మొరాయించింది !
ఈ చిత్రము లోని పాటలు పి. సుశీల . యస్.పి బాలసుబ్రమణ్యం పాడారు .
సంగీతం రాజేశ్వర రావు .
ఇందులోని పాటలు కూడా నెట్ లో ఎక్కడా దొరకలేదు :)
ఇదో ఈ పాట వక్కటే దొరికింది . విని , చూసి ఆనందించండి .

4 comments:

సుభ/subha said...

అయ్యో ఎంత పని జరిగిందండీ.. ఐనా ఇది తొండి.. పూర్తిగా రాయాలి కాని ఇలా సగంలో వదిలేస్తారా? ఒప్పుకోం అంతే.

మాలా కుమార్ said...

సుభ గారు ,
నిజమే షాపువాడు తొండి చేసి పిచ్చి కాసెట్ ఇచ్చాడు . ఆ కాసెట్ వాడి మొహాన కొట్టి వస్తానంటే , ఇక్కడి నుంచి కోటీ దాకా వెళ్ళ్ళి రావటానికే పెట్రోల్ ఖర్చు ఎక్కవవుతుంది , కాసెట్ ధర కంటే అని మావారు ఆపేసారు :) నాకూ మహా ఆతృతగా వుంది తరువాతి కథ ఏమిటా అని :)

వనజ తాతినేని/VanajaTatineni said...

మాలా కుమార్ గారు.. మీకు హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు .

వనజ తాతినేని/VanajaTatineni said...

http://www.cinemelody.com/Labels/Rajashekar/americaabbai.htm

ఈ లింక్లో పాటలు డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు..