జీవనతరంగాలు-12
"ఏమిటీ జానకీ?పొద్దూనే ఎవరిమీదో గొణుగుతున్నావు పనిమనిషి రానన్నదా ఏమీటీ?" పిల్లల ఫోటోలను తుడుస్తూ తనలో తాను గొణుక్కుంటున్న జానకిని అడిగాడు రామయ్య.
"పనిమనిషి వస్తే ఎంతా రాకపోతే ఎంత ?ఒక్కపూట పని చేసుకోలేనా ఏమిటి?ఐనా ఎప్పుడూ పనిమనిషి గోలేనా ?"అంది విసురుగా జానకి.
"ఐతే ఎవరిని?నన్నైతే కాదుకదా?" కాస్త భయపడుతున్నట్లు నటిస్తూ జోక్ గా అన్నాడు రామయ్య.
"హుం నన్ను చూస్తే మీకు జోక్ గానే ఉంటుంది.కాలం చూడండి అంత కొంపలు మునిగిపోతున్నట్లు హడావిడిగా పరిగెత్తటం ఎందుకుట? నిదానంగా వెళితే ఏమవుతుంది? ఈ బుజ్జిగాడు చూడండి అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో!వాడి కొడుకు కాలేజ్ లో చేరాలిట.ఇందాక ఫొన్ చేసినప్పుడు వాషింగ్ టన్ వెళ్ళి కాలేజ్ చూసొచ్చామమ్మా అన్నాడు"అంది కొడుకు చిన్నప్పటి ఫొటోని చూస్తూ.
"బాగుంది నీ బుజ్జిగాడెప్పటికీ బుజ్జిగాడుగానే, నా బంగారం ఎప్పటికీ గుడియాగానే ఉండిపోతారా? కాలం పరిగెత్తక నీకోసం ఎట్లా ఆగుతుంది?ఆగుతే నీ మునిమాణిక్యాలు ఎట్లా వచ్చేవారు?"నవ్వాడు రామయ్య.
"ఏమో నండి పిల్లలంతా ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు.ఇల్లంతా ఎంత శూన్యం గా ఉంది చూడండి.ఇలా ఉంటే అమెరికావాళ్ళు"ఎంప్టీ నెస్ట్"అంటారుట."
"బాగుంది వ్యవహారం.రెక్కలు వచ్చిన పిట్టలు ఎగిరిపోకుండా ఉంటాయా?ఎంప్టీ నెస్ట్ అని ఎందుకనుకుంటావు? నీకు నేను నాకు నువ్వు మలివయసులో ఒకరికొకరం.ఇన్ని రోజులూ బాద్యతల్లో ఉన్నాము.ఇప్పుడు భాద్యతలు తీరి, నేను రిటైర్ అయ్యి ఫ్రీగా ఉన్నాము.పద హాయిగా ఏ గోవానో సింగపూర్ నో తిరిగొద్దాము.చాయిస్ ఈజ్ యువర్స్ .చీరప్ బేబీ."ఉషారు గా అన్నాడు.
"అంతొద్దులెండి.నా కోరిక ఒకటి ఉంది తీర్చండి చాలు."అంది జానకి.
"అడుగు మేడం. ఇంతవరకు ఎప్పుడూ ఏది అడగని నువ్వు అడుగుతున్నావు.నీ ఇష్టం ఏదైనా ఇచేస్తాను. ఐ ఆం ఆల్ వేస్ ఎట్ యువర్ సర్వీస్ "అభయమిచ్చాడు.
https://www.youtube.com/watch?v=BCzplttGVEU

4 comments:
అరవయ్యేళ్ళ పెళ్ళి సంబరాల్లో ఉండే ఆనందం వేరు. ఈ జ్ఞాపకాలు పిల్లలతో పెనవేసుకొని పోతాయి. విడదీయరాని బంధాన్ని ఇంకా పటిష్టం చేస్తూ పోతాయి. అరవయ్యేళ్ళ వయసులో కావలసిన బంధాలను స్థిరం చేస్తుంది. చాలా బాగుంది.
yes. I feel so regretted that could not convince father for this event. Nice songs.
జయ ,
అవును పెద్దలు పెళ్ళిచేసినప్పుడు చిన్నతనము వలన భయము , టెన్షన్ .
అరవైలలో పెళ్ళి భయము ,టెన్షన్ లేని పెళ్ళి . : ))
ఉషా,
మావారు కూడా ఒప్పుకోలేదండి . అందుకే మా అమ్మాయి ఆయనకు తెలీకుండా చిన్న ఫామిలీ గెట్ టుగేదర్ చేసి, సర్ ప్రైస్ పార్టీ ఇచ్చింది ! అప్పుడు మా అబ్బాయి యు.యస్ లో వున్నాడు .
Post a Comment