Monday, March 1, 2010
హోళి రే హోళి - - - హోళీ శుభాకాంక్షలు
ఒకానొక కాలం లో అమితాబ్ , రేఖ లు హిందీ సినీ ఫీల్డ్ ను ఏలిన రోజులవి . ఈ పాట " సిల్ సిలా " సినిమా లోనిది .ఈ సినిమా , అమితాబ్ , జయాభాధురి , రేఖ ల నిజజీవిత కథే నని అందరూ తెగ చెప్పుకున్నారు .
ఈ పాట హోళీ ఫంక్షన్ ల లో తప్పక చోటు చేసుకుంటుంది . ఎవర్ గ్రీన్ పాట . ఆ రోజుల లో అమ్మాయిలు రేఖ లాగా , చుడీదార్ కుర్తా , జడకుప్పెల తో పెద్ద జడ వేసుకొని , పాపిటిలో సిధూరం ధరించటము ఫాషన్ .
హోళీ రోజున భంగ్ తాగటము , ఉత్తర దేశీయుల సాంప్రదాయము .
ఈ పాట " ఆప్ కీ కసం " , నాకు నచ్చిన , చూసాక , చాలా రోజులు నేను మరిచిపోలేక పోయిన సినిమా లోనిది . ఇందులో రాజేష్ ఖన్నా , ముంతాజ్ ల నటన , సినిమా కథ చాలా బాగుంటాయి . ఈ సినిమాను నేను 1975 లో చూసాను . ఐనా ఇప్పటికీ చాలా గుర్తే . సి.డి దొరుకుతే మళ్ళీ చూడాలని వుంది .
ఈ పాట కూడా హోళీ ఫంక్షన్స్ ల లో చోటుచేసుకుంటుంది .
ఇంకొన్ని హోళీ పాటలు
అందరికి హోళీ శుభాకాంక్షలు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment