కాసులమాటెత్తుతే చాలు , కళ్ళు పత్తి విత్తుల్లా విచ్చుకుంటాయి ! మిల మిలా చుక్కల లా మెరిసి పోతాయ్ కదూ . కాసుల కున్న పవర్ అంతా , ఇంతాకాదు . ధనమేరా అన్నిటికీ మూలం . కాని , ఆ ధనలక్ష్మి మాయలో చిక్కు కోకుండా , అదుపులోన పెట్టిన వాడే , గుణవంతుడు , ధీమంతుడు , అదృష్టవంతుడు .
పిల్లికి బిచ్చం పెట్టని వాడైనా సరే , వాడి దగ్గర డబ్బుందంటే చాలు , లోకం దాసోహం అంటుంది . ఎందుకో మరి ?
కుర్రకారుకైనా , పెద్ద వారికైనా , మనీ అనగానే ఉషారొచ్చేస్తుంది .
|
రైలు బండిని నడిపేది పచ్చ జండాలే , కానీ జీవితాని నడిపేది పచ్చనోట్లు .డబ్బు వుంటే సుబ్బిగాడు కూడా , సుబ్బారావు గారు అవుతారట .
పొరుగింటి మీనాక్షమ్మ గారిని , వాళ్ళాయన అవీ , ఇవీ కొనిచ్చి ,ఎంత గారాబం చేస్తాడో !!! అదేమంటే ఆయనకు జీతం కంటే గీతం ఎక్కువ అని ఈయన గారి ఆక్రోశం .
poruginTi
పాతకాలం ఆవిడే కాదు , ఈ కాలం ఆవిడదీ అదే ఘోష ! జుత్తు పీక్కుంటే ఏమొస్తుంది సారూ , సంపాదించాలి మరి .
పెద్దవాళ్ళు , కుర్రకారూ , ఆవిడలూ అలా ,ఇలా నిట్టూరుస్తుంటే , మరి , ఈయన గారి గోలేందో ?
గల్లా పెట్టి గలగలలు ఇక్కడ , కాసులు చెప్పే కమ్మని కబుర్లు అక్కడ .
6 comments:
మాలాగారు ! ధనమూల మిదం జగత్ అన్నారు అందుకేనేమో ....భలే పాటలు ..ముఖ్యంగా ధనమేరా అన్నిటికీ మూలం పాట ...పాటలో ఎస్ వి రంగారావుగారు నాకు చాలా ఇష్టమండీ .
పరిమళం గారు ,
ఈ సామెత నేను మర్చిపోయాను సుమండీ .
థాంక్ యు .
మాలగారు బాగున్నాయి గలగలలు..గలగలలు అ౦టూ పాటలు స౦దడి..నాది పరిమళ౦ గారి మాటే దనమే రా పాట నాకు ఇష్ట౦..
మీ ఇద్దరికీ ఆ పాట నచ్చిందా ? నా కైతే " పక్కింటి మీనాక్షమ్మని చూసారా ? వాళ్ళ ఆయన చేసే ముద్దూ ముచ్చట విన్నారా , ఏమండోయ్ " పాట నచ్చుతుంది .
అమ్మో అమ్మో.......ఎన్ని విధ్యలు నేర్చేసుకున్నారో!
ఈ పాటలవీ ఎక్కడ పట్టేరూ?????? ఎలా పెట్టేరూ????
గల్లా పెట్టిలో పట్టాను .
Post a Comment