Monday, June 13, 2011

భలే రాముడు



నారాయణ మూర్తి కి కళలంటే మహా ప్రీతి . అందుకని తన కూతుళ్ళిద్దరు , రూప , తార కు భరతనాట్యము నేర్పిస్తుంటాడు . లలిత కళలను పోషించేందుకోసం థియేటర్ కూడా నిర్మించి , అందులో రూప , తార ల తో నృత్య ప్రదర్షన ఇప్పిస్తాడు . నారాయణ మూర్తి దగ్గర మేనేజర్ గా పని చేసే నాగభూషణానికి రాము , గోపి ఇద్దరు కొడుకులు .రాము కొంచము దుడుకు వాడు . రూప నాట్యప్రదర్షన రోజున చెరువు లోనుంచి తామర పూవులు తెచ్చి రూపకు ఇచ్చి , తండ్రి తో చివాట్లు తింటాడు . ఇంకోరోజు తన చేతిమీద " రాము " అని పచ్చ బొట్టు పొడిపించుకొని , అటుగా వస్తున్న రూపను కూడా పచ్చబొట్టు పొడిపించుకోమని చెపుతాడు . అందుకు రూప కోపగించి , ఇంటికి వెళ్ళి , నాగభూషణానికి రాము మీద కంప్లేయింట్ చేస్తుంది . నాగభూషణము రామూ ను కొడతాడు . అది చూసి రూప రామూ ను వెక్కిరిస్తే రాము , రూపను తోసేస్తాడు . రూప మెట్లమీద నుంచి పడిపోతుంది . రూప కాలు విరుగుతుంది . డాక్టర్ రూపకు కాలు రావటము కష్టము అని చెపుతాడు . దానితో నారాయణమూర్తి రామూ పై కోపము తెచ్చుకొని పిస్టోల్ తో కాలుస్తానని వెంట పడగా రామూ పరిగెత్తుతాడు . రామూను ఆగమని అర్స్తుండగా నారాయణ మూర్తి చేతిలోని పిస్తోలు పొరపాటున పేలుతుంది . రాము వంతెన మీది నుంచి నది లో పడిపోతాడు . నా కొడుకును చంపేసావు , నిన్ను పోలీసులకు పట్టిస్తాను అని నాగభూషణము కోపముగా వెళుతాడు .
నారాయణ మూర్తి ని పోలీసులు పట్టుకొని వెళ్ళారా ?
నది లో పడిపోయిన రాము ఏమైనాడు ?
రూప , తార ఏమయ్యారు ?
ఈ ప్రశ్నలన్నింటి కి జవాబు . . . .

ఆ ((((( భలే ఆశే !!!!! నేను చెప్పను . ఆ కథ వెండితెరపై చూడుడు :)))))
ఆవెండితెర పేరు " భలేరాముడు " .
దానిని నిర్మించినది ; వి. యల్ . నరసు .
దర్షకత్వము : వేదాంతము రాఘవయ్య .
కథా రచయిత ; వెంపటి సదాశివ బ్రహ్మం .
సంగీత దర్షకత్వం ; సాళూరి రాజేశ్వరరావు .
విడుదల తేదీ ; ఏప్రిల్ 6, 1956 .
నటీనటులు , గాయనీ గాయకులు ఎవరంటారా ???
అబ్బా * * * ఇంక నాకు చెప్పే వోపిక లేదు మీరే సినిమా చూసి తెలుసుకోండి . . .

స్చప్ . . . అదేమిటో ఈ రోజు చూసే సరికి యుట్యూబ్ వాడి విడిఓలు తీసెసాడు . ఈ మద్య వాళ్ళ టైం ఐపెయింది అని తీసెస్తున్నారు :) ఈ స్నిప్స్ వాడు కూడా తీసేసాడు . మళ్ళీ అన్నీ మార్చుకోవాలి .

ఈ సినిమా లోని ఈ పాట వక్కటే దొరికింది . అది " ఓహో మేఘమాలా "




No comments: