Wednesday, July 18, 2012

ఆరాధన




ఆరాధన సినిమా రిలీజ్ ఐనప్పుడు మేము పూనా లో వున్నాము . అప్పుడు నేను పీణె లో వాడియా కాలేజ్ లో బి. ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను . నేను కాలేజ్ నుంచి వచ్చేసరికే మా ఫ్రెండ్ మౌళీ ఆరాధన సినిమా ప్రోగ్రాం పెట్టింది . సినిమా మొదటి వారం , రెష్ లో చూడటం మావారి కి ఇష్టం వుండదు . రెష్ లేని , మంచి హాల్ లోనే సినిమా చూడాలి . నిద్ర వస్తే డిస్త్రబెన్స్ లేకుండా నిద్రపోగలగాలి . ఇవీ మావారి డిమాండ్స్ . మేము అలాగే వెళుతాము . ఆయన సినిమా మొదలైన కాసేపటికే నిద్రపోతారు . నేను సినిమా చూస్తాను . సినిమా అయ్యాక ఆయనను నిద్రలేపి , ఇంటి కొచ్చేస్తాము . ఇప్పటికీ అదే మా పద్దతి :) అలాంటిది వచ్చిన మొదటివారమే చూడాలి అంటే ఫ్రెండ్ ను కాదనలేక బయిలుదేరారు . ఖన్నా , మౌళి ఖన్నా , మేమిద్దరమూ ఆరాధన చూడటాని కి వెళ్ళాము . అబ్బ ఎంత రెషో . హాలా ఆవరణలోకి అడుగు పెట్టేట్లుగా లేదు . ఏమి చేస్తాము . వెనుదిరిగాము . మావారు చాలా హాపీ :) స్కూటర్ వెనుకకి తిప్పుతున్నారని , రెష్ లో నుంచి నేను , మౌళీ బయట నిలబడ్డాము . మావారు స్కూటర్ తిప్పటమేమిటి , రయ్యన వెళ్ళిపోవటమేమిటి . నేనూ , మౌళీ బిత్తరపోయి చూస్తున్నాము .పైగా అటు పక్కగా వున్న మా క్లాస్ అబ్బాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు .ఖన్నా వెంటనే మావారి వెనక తన స్కూటర్ పరిగెత్తించి , చివరకు ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పట్టుకున్నాడు . ఆయనని మాలా ఏది అంటే వెనుక వుంది ఆనారట . హుం . . . అంటూ వెన్నక్కి చూస్తే ఎక్కడ మాల అని బోలెడు హాచర్యపోయి , వెనక్కి తిరిగి వచ్చారు :) ఆరాధ సినిమా ఎప్పుడు గుర్తొచ్చినా ఈ సంగతి కూడా గుర్తొస్తుంది :)


ఆరాధన సినిమా పాటలన్నీ చాలా బాగుంటాయి .



















1 comment:

శ్రీ said...

అన్నీ నాకు ఇష్టమైన పాటలు...
ఆ సినిమా చూసి డార్జిలింగ్ చూడాలని అనుకునేవాడిని..
1997 లో వెళ్లి టాయ్ ట్రైన్ క్రాస్ చేసిన పాయింట్ చూసి గొప్ప త్రిల్లయ్యానండీ!
మంచి చిత్రం కూడా..
మీకు అభినందనలు మంచి పోస్ట్ కి
@శ్రీ