Friday, May 27, 2011

రహస్యం



తిరుమల గిరి వాసా



రహస్యం సినిమాలో ఘంటశాల తన బృందం తో గానం చేసిన ఈ గిరిజాకళ్యాణం చాలా బాగుంటుంది . కూచిపూడి నృత్యం ఇంకా బాగుంటుంది .



ఈశ్రీలలితా శివజ్యోతి పాట ఇప్పటికీ మంగళ హారతి సమ్యము లో వినిపిస్తూనేవుంటుంది .
నితలలోచన నయనతారా తారా భువనేశ్వరి .




లలిత భావ నిలయ , నవరసా నంద హృదయ


ఇదియే దేవ రహస్యం , హృదయాంతరంగ చిర లాస్యం





సాధించనో నా జగానా



గగనమంత మనసు తో కలుసుకుంటి నిన్ను

Tuesday, May 24, 2011

గుండమ్మ కథ



విజయా వారి చిత్ర్తాల గురించి వ్రాయాలని ఓ సంవత్సరం గా ప్రయత్నం . ఎక్కడా మహా బద్దకం :) అనుకోవటము లోనే అలా అలా గడిచిపోయింది :) ఇదో ఇన్నాళ్ళకు చిత్రమాలిక కోసం "గుండమ్మ కథ " రాశాను . ఇంకేం కథ అక్కడ చదవండి . సినిమా ఇక్కడ చూడండి . హాయిగా నవ్వుకోండి . అక్కడక్కడ కనువిందు చేసే విజయావారి చంద్రుని చూసి ఆనందించండి . అన్నట్లు కమ్మటి పాటలు , వాటి చిత్రీకరణ చూసి ఆనందించిండి . పదండి మరి . . . . .

































Wednesday, May 11, 2011

శ్రీవారికి ప్రేమలేఖ



శ్రీవారికి ప్రేమలేఖ పొత్తూరి విజలక్ష్మి రాసిన " ప్రేమలేఖ " ఆధారం గా తీసారు . ఈ నవల గురించి సాహితి లో చదవండి . సినిమా గురించి నేను చెప్పటమెందుకు మీరే చూడండి :)































Wednesday, May 4, 2011

దొంగరాముడు



"దొంగరాముడు " సినిమాను 1955 లో "అన్నపూర్ణ పిక్చర్స్ " బానర్ లో డి . మధుసూధనరావు నిర్మించారు . అన్నపూర్ణా పిక్చర్స్ వారి మొదటి సినిమా ఇది . దీని తరువాత వారు చాలా మంచి సినిమాలు తీసారు . ఈ సినిమా డైరెక్టర్ కదిరి వెంకట రెడ్డి . నాగేశ్వర రావు , జగ్గయ్య , సావిత్రి , జమున , రేలంగి , సూర్యకాంతం మొదలైన వారు నటించారు .
కథా రచయతలు ; డి. వి నరసరాజు , డి మధుసూధన రావు .
సంగీతం ;పెండ్యాల నాగేశ్వర రావు ,
సినిమటొగ్రఫీ ; అడి .. యం ఇరానీ .
గాయనీ గాయకులు ; ఘంటశాల , మల్లాది రామకృష్ణ శాస్త్రి , జిక్కి & పి. సుశీల .
రాము చాలా అల్లరి పిల్లవాడు . స్కూల్ కు వెళ్ళ కుండా అల్లరి చేస్తూ వుంటాడు . తల్లి కి జబ్బు చేస్తే మందు తెచ్చేందుకు టౌన్ కు వెళుతాడు . రాము తీసుకెళ్ళిన డబ్బులు మందుకు సరిపోవు . ఎవరిని బతిమిలాడినా తక్కువైన రెండురూపాయలు ఇవ్వరు . తల్లిని బతికించుకునేందుకు ఆ మందు సీసా దుకాణం నుంచి దొంగతనము చేసి పారిపోతుండగా పోలీసులు పట్టుకొని బాలనేరస్తుల స్కూల్ లో చేరుస్తారు . ఆ సంగతి తెలిసి తల్లి చనిపోతుంది . చెల్లెలు లక్ష్మిని మాస్టర్ గారు అనాధాశ్రమంలో చేరుస్తారు .
రాము పెద్దవాడైనాక జైల్ నుంచి విడుదలై చెల్లెలిని కలుసుకుంటాడా ?
లక్ష్మి అనాధాశ్రమం లో ఎలా పెరుగుతుంది ?
చివరకు ఏమవుతుంది ? వీటన్నిటి కీ సమాధానం గా ఇదో "దొంగరాముడు " సినిమా చూడండి . పాత సినిమా అని ముక్కు విరవకండి . చాలా బాగుంటుంది . ఎంచక్కా కొన్ని స్నాక్స్ , టీ తెచ్చుకొని ఆరాముగా కూర్చొని చూడండి . తప్పక నచ్చుతుంది .
ఊ ఇంకెందుకు ఆలీసం ? కానివ్వండి .
Donga Ramudu - Full Length Telugu Movie ; దొంగరాముడు , పూర్తి సినిమా ఇది . అక్కడక్కడ తప్ప అంతా క్లియర్ గా వుంది . హాయిగా చుడవచ్చు .



సినిమా చూసారా ? ఇక పాటలు అన్ని ఓసారి చూడండి .

చిగురాకులలో చిలకమ్మా



అనురాగమే విరిసేనా


అందచందాలా సొగసరివాడు



రావోయి మా ఇంటికి



బాల గోపాలా



తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబూ



భలే తాత మన బాపూజీ



లేవోయి చినవాడా

Tuesday, May 3, 2011

కన్యాశుల్కం



ఒక శతాబ్ధం కిందట సమాజం లో , ముఖ్యం గా బ్రాహ్మణ కుటుంబాలలో వున్న , 'కన్యాశుల్కం' అనే దురాచారం గురించి రాసిన నాటకం కన్యాశుల్కం . ఇది గురజాడ అప్పారావు గారు 1892 వ ప్రాంతం లో రచించారు . ఆనాటి స్తితిగతులను ఇందులో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు . ఆడపిల్లలను పసితనం లోనే డబ్బు కక్కుర్తికి ముసలివారికి ఇచ్చి వివాహం జరిపించేవారు . ఆ ముసలి వారికి చాకిరీ చేసేందుకోసం వీరు నియమించబడేవారు . ఆ అమ్మాయికి వూహతెలిసే సమయానికే విధవైపోయేది పాపం . అప్పటి నుంచి ఓపిక వున్నన్ని సంవత్సరాలు అత్తింటనో , పుట్టింటనో చాకిరీ చేయటమే సరిపోయేది . వారి జీవితం ధుర్భరం గా గడి చేది .
కన్యాశుల్కం రూపుమాసిపోయినా , ఆడపిల్లలకు చిన్నతనములోనే వివాహం జరిపించటము మటుకు తగ్గలేదు . ఆ తరువాతి కాలం లో తురష్కులు గ్రామాల మీద పడి దోచుకునేటప్పుడు , ఆడపిల్లలని కూడా ఎత్తుకుపోయే వారట . కాకపోతే పెళ్ళైన అమ్మాయిలను ఎత్తుకెళ్ళేవారు కారుట . అందుకని అమ్మాయిలకు 8 సంవత్సరములు నిండ కుండానే వివాహం చేసేవారట .( ఈ సంగతి నాకు మా తాతగారు చెప్పారు .) అప్పుడూ యుక్తవయస్సు వచ్చేసరికే విధవలై పోవటము తప్పలేదు ! కాల క్రమేణ ' శారదా ఆక్ట్ ' అంటే వ్యక్తురాలు కాని అమ్మాయి కి పెళ్ళి చేయకూడదు అనే రూల్ వచ్చినా అలాగే దొంగతనం గా చేసేవారు . ప్రస్తుతమైతే 18 సంవత్సరాలు నిడకుండా అమ్మాయి పెళ్ళి చేయకూడదు అని రూల్ వుందనుకోండి . ఐతే వరకట్న బాధ వచ్చిందిగా ! ఏరాయైతేనేమి పళ్ళూడ గొట్టు కోవటానికి ? అప్పుడూ , ఇప్పుడూ , ఎప్పుడూ అమ్మాయికి ఏదోవిధం గా కష్టాలు తప్పటం లేదు !!!

కన్యాశుల్కం నాటకం ఆధారం గా 1955 లో డి.యల్ గారు పి. పుల్లయ్య దర్శకత్వం లో సినిమా తీసారు ఆ విశేషాలని చిత్రమాలిక లో చదవండి . అది నేనే రాశాను లెండి . ఆ చిత్రం పాటలు కమ్మటి కలలు లో వినండి :)

అన్నట్లు ఈ కింద చిత్రం లో వున్న ఫొటోలు , కన్యాశుల్కం లో గురజాడ వారు వర్ణించిన , అప్పటి విజయనగర వీధులు :_




ఇంక పాటలలో యంటి ఆర్ నూ , సావిత్రి నీ , జానకీ వగైరాలను చూడండి .