Showing posts with label old is gold. Show all posts
Showing posts with label old is gold. Show all posts

Sunday, February 24, 2013

చోరీ చోరీ





ఈ రోజు బోర్ కొడుతుంటే "చోరి చోరి" సినిమా చూస్తూ కూర్చున్నాను . అదేమిటో ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా విసుగనిపించదు . పాటలు కూడా మళ్ళీ మళ్ళి వినేలా వుంటాయి .

కోటీశ్వరుడు గిరిధర్ లాల్ గారాల పట్టి, కమ్ము ( నర్గిస్) . సుమన్ కుమార్ (ప్రేం ) ను ప్రేమిస్తుంది . కాని తండ్రి వారి ప్రేమను అంగీకరించడు . తండ్రి మీద కోపం తో సుమన్ కుమార్ దగ్గర కు వెళ్ళేందుకు ఇంట్లో నుంచి పారిపోతుంది .గిరిధర్ లాల్ కమ్మును వెతికి తెచ్చిన వారికి 1.25 లక్షల రూపాయలు బహుమతి ప్రకటిస్తాడు . ఇంట్లో నుంచి పారిపోయిన కమ్ము విచిత్ర పరిస్థితులలో సాగర్ (రాజ్ కపూర్ ) ను కలుస్తుంది . నాలుగు రోజులు రకరకాల పరిస్తితులలో చిక్కుకొని , ఇంటి కి తిరిగి వస్తుంది . ఆ నాలుగు రోజులలో జరిగిన విశేషాలను , చివరి కి ఏమి జరిగింది అన్నది సినిమా చూస్తేనే బాగుంటుంది కదా :)

నిర్మాత :యల్. బి లక్ష్మణ్ ,
డైరెక్టర్ ; అనంత్ ఠాకుర్ ,
రచయత ; ఆగా జాని ,
సంగీతం; శంకర్ ఝై కిషన్ ,
గాయనీ గాయకులు ;మన్నాడే , మహ్మద్ రఫీ ,లతా మంగేష్కర్, ఆశాబోస్లే .




















Sunday, July 29, 2012

ఆప్ కీ కసం



ఆప్ కీ కసం మేము సిలిగురి లో వున్నప్పుడు , ఓపెనేయిర్ థియేటర్ లో చూసాను .సినిమా సినిమా లో పాటలూ చాలా నచ్చాయి .కాని ఎండింగే నచ్చలేదు . చాలా దిగులనిపించింది . చాలా రోజుల వరకు మర్చిపోలేకపోయాను . సునీత (ముంతాజ్ ) , కమల్ ( రాజేష్ ఖన్నా ) ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు .సంతోషం గా గడుపుతున్న వారి జీవితాలలోకి సంజీవ్కుమార్ మూలంగా కలతలు ఏర్పడతాయి . కమల్ అపోహలను సునీత తొలిగించలేకపోతుంది . ఇద్దరూ విడిపోతారు . కమల్ ఇల్లూ వాకిలీ లేనివాడవుతాడు . సునీత కు తండ్రి మళ్ళీపెళ్ళిచేస్తాడు . ఈ సినిమా చూడా లంటే ఇక్కడ చూడవచ్చు .

పాటలు ఇక్కడ చూసి ఆనందించండి :)
ఈ పాటల సంగీతం ఆర్. డి. బర్మన్.

గీత రచన ఆనంద్ భక్షి .



కరవటీ చల్తే రహే సారీ రాత హం .




సునో , కహో , కహా , సునా



జై జై శివ శంకర్



పాస్ నహీ ఆనా భూల్నహీ జానా




చోరీ చోరీ చుప్కే ఫుప్కే





జిందగీకే సఫర్మే

Wednesday, July 18, 2012

ఆరాధన




ఆరాధన సినిమా రిలీజ్ ఐనప్పుడు మేము పూనా లో వున్నాము . అప్పుడు నేను పీణె లో వాడియా కాలేజ్ లో బి. ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను . నేను కాలేజ్ నుంచి వచ్చేసరికే మా ఫ్రెండ్ మౌళీ ఆరాధన సినిమా ప్రోగ్రాం పెట్టింది . సినిమా మొదటి వారం , రెష్ లో చూడటం మావారి కి ఇష్టం వుండదు . రెష్ లేని , మంచి హాల్ లోనే సినిమా చూడాలి . నిద్ర వస్తే డిస్త్రబెన్స్ లేకుండా నిద్రపోగలగాలి . ఇవీ మావారి డిమాండ్స్ . మేము అలాగే వెళుతాము . ఆయన సినిమా మొదలైన కాసేపటికే నిద్రపోతారు . నేను సినిమా చూస్తాను . సినిమా అయ్యాక ఆయనను నిద్రలేపి , ఇంటి కొచ్చేస్తాము . ఇప్పటికీ అదే మా పద్దతి :) అలాంటిది వచ్చిన మొదటివారమే చూడాలి అంటే ఫ్రెండ్ ను కాదనలేక బయిలుదేరారు . ఖన్నా , మౌళి ఖన్నా , మేమిద్దరమూ ఆరాధన చూడటాని కి వెళ్ళాము . అబ్బ ఎంత రెషో . హాలా ఆవరణలోకి అడుగు పెట్టేట్లుగా లేదు . ఏమి చేస్తాము . వెనుదిరిగాము . మావారు చాలా హాపీ :) స్కూటర్ వెనుకకి తిప్పుతున్నారని , రెష్ లో నుంచి నేను , మౌళీ బయట నిలబడ్డాము . మావారు స్కూటర్ తిప్పటమేమిటి , రయ్యన వెళ్ళిపోవటమేమిటి . నేనూ , మౌళీ బిత్తరపోయి చూస్తున్నాము .పైగా అటు పక్కగా వున్న మా క్లాస్ అబ్బాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు .ఖన్నా వెంటనే మావారి వెనక తన స్కూటర్ పరిగెత్తించి , చివరకు ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పట్టుకున్నాడు . ఆయనని మాలా ఏది అంటే వెనుక వుంది ఆనారట . హుం . . . అంటూ వెన్నక్కి చూస్తే ఎక్కడ మాల అని బోలెడు హాచర్యపోయి , వెనక్కి తిరిగి వచ్చారు :) ఆరాధ సినిమా ఎప్పుడు గుర్తొచ్చినా ఈ సంగతి కూడా గుర్తొస్తుంది :)


ఆరాధన సినిమా పాటలన్నీ చాలా బాగుంటాయి .



















Tuesday, May 1, 2012

chitchor



1976 లో "రాజశ్రీ ప్రొడక్షన్" వారు నిర్మించిన చక్కని కుటుంబ కథా చిత్రము "చిట్చోర్" . "సుభోధ్ గోష్ " రచించిన "చిత్తచకోర్" బెంగాలీ నవల ఆధారంగా ఈ సినిమాను "తారాచంద్ భర్జాత్య" నిర్మించారు .

మధుపూర్ లో స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు ,పీతాంబర్ చౌదరి . ఆయనకు ఇద్దరు కూతుర్లు , ఒక కొడుకు . పెద్దకూతురు మీర , చెల్లెలు గీతకు వాళ్ళ ఇంజనీర్ సంబంధం చెపుతుంది .అదే సమయం లో వచ్చిన వినోద్ ను ఇంజనీర్ పొరబడి ఆదరిస్తారు పీతాంబర్ చౌదరి కుటుంబం . గీత వినోద్ ల మధ్య సానిహిత్యం పెరుగుతుంది . ఇంతలో అసలు ఇంజనీర్ సునిల్ వస్తాడు . అప్పుడు జరిగిన పొరపాటును తెలుసుకొని సునీల్ ను ఆదరించి , వినోద్ ను నిర్లక్షం చేస్తారు . సునిల్ , గీత ల వివాహాం నిశ్చయిస్తారు . కాని గీత వినోద్ నే ఇష్టపడుతుంది . క్లుప్తంగా ఇదీ ఈ సినిమా కథ .

దైరెక్టర్ ; బాసు చటర్జీ

మ్యుజిక్ ; రవీంద్ర జైన్

నటీ నటులు , అమోల్ పార్లేకర్ , జరీనా వహాబ్ , విజయేందర్ గట్కే , ఏ.కే హంగల్ మొదలైనవారు .

గాయనీ గాయకులు ; యేసుదాస్ , హేమలత .

ఈ సినిమా , ఇందులోని పాటలూ నాకు చాలా నచ్చాయి . అందుకే మా యూనిట్ లో చూపించిన నాలుగురోజులూ చూసాను :)

గౌరి తేరా గావ్ బడా ప్యారా



జబ్ దీప్ జలే ఆనా , ష్యాం జలే ఆనా



ఆజ్ సే పహేలే ఆజ్ సే జాదా కుషీ ఆజ్తక్ నహీ మిలీ



తుజో మేరే సుర్ మేన్ , సుర్ మిలాలే

Monday, March 26, 2012

Ankhiyon Ke Jharokhon Se




అలా అలా అలా యుట్యుబ్ లో పాత పాటలు వెతుకుతూ వుంటే ఈ పాట కనిపించింది .సచిన్ , రంజిత నటించిన " అఖియోకె ఝరోకొన్సే " సినిమాలోనిది ఈ పాట . ఈ సినిమా వచ్చిన కొత్తల్లో ఈ పాటంటే పిచ్చి ఇష్టముండేది .ఇప్పటికీ ఇష్టమే . హీరోయిన్ తన ప్రేమ , భయాలు అన్నీ సున్నితంగా చెపుతుంది ఈ పాటలో . చాలా ప్రేమగా మృదువుగా వుంటుందీపాట .

ఈ పాట ఇష్టమే కాని సినిమా ఎండింగ్ ఇష్టం లేదు . ఎందుకంటే విషాదాంతం కాబట్టి .

ఈ పాట రవీంద్రజేన్ సంగీతం సంకూర్చగా హేమాలత పాడింది .