Showing posts with label వలపు భావాలు. Show all posts
Showing posts with label వలపు భావాలు. Show all posts

Friday, April 20, 2012

సంక్రాంతి


ఈ మద్య వచ్చిన సినిమాలల్లో నాకు నచ్చింది "సంక్రాంతి". పాతకాలం సినిమాలలాంటి చక్కని కుటుంబ కథా చిత్రం సంక్రాంతి . నలుగురు అన్నదమ్ములు , తల్లీ తండ్రి కలిసి వున్న కుటుంబం మధ్య లో వుండే ఆప్యాయతలు , చిన్న చిన్న అపార్ధాలు , వాటిని తొలిగించుకొని , అర్ధం చేసుకున్న విధానము అన్నీ చక్కగా చూపించారు .
రాఘవేంద్ర ( వెంకటేష్), విష్ణు ( శ్రీకాంత్), చిన్న (శివబాలాజి), వంశి ( శర్వానంద్) నలుగురు అన్నదమ్ములు . వారి తల్లి ( శారద) , తండ్రి ( చంద్రమోహన్) అందరూ కలిసి వుంటారు . రాఘవేంద్ర పద్మ ( ఆర్తీ అగర్వాల్ ) ను ప్రేమిస్తాడు . పద్మ మేనమామ కూతురే కావటం తో పెద్దల అభీష్టం తో పెళ్ళి నిశ్చయం అవుతుంది . ఇంతలో రోడ్ వైడెనింగ్ లో రాఘవేంద్ర వాళ్ళ షాప్ పోయి ,నష్టపోతారు . అందరినీ వదిలి వస్తే ఈ పెళ్ళి చేస్తామని పద్మ తల్లి తండ్రులంటారు . కాని రాఘవేద్ర ఒప్పుకోడు . కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని ఒక దారికి తెస్తారు రాఘవేంద్ర , విష్ణు .అంజలి అనే మంచి మనసున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు . పద్మ తన తప్పు తెలుసుకొని బాధపడి , తన చెల్లెలిని విష్ణు కిచ్చి వివాహం జరిపిస్తుంది . విష్ణు భార్య (సంగీత) అసూయ వలన కుటుంబంలో కొన్ని కలతలు వచ్చి సద్దుకుంటాయి . చిన్న ప్రేమించిన అమ్మాయి తో పెళ్ళి చేసేందుకు ఆమె తండ్రి ( ప్రకాశ్ రాజు ) ముందు ఒప్పుకోకపోయినా ఆ తరువాత ఆ కుటుంబ లో వున్న ఆప్యాయతలను , కట్టుబాటు ను నచ్చి పెళ్ళికి వొప్పుకుంటాడు . సంక్షిప్తంగా కథ ఇది .
ఈ సినిమా నిర్మాత ; ఆర్. బి చౌదరి

డైరక్టర్;ముప్పలనేని శివ

రచయతలు ; లింగశ్వామి
పరచూరి బ్రదర్స్

సంగీతం; యస్.ఏ రాజకుమార్

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట . ..


మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ


చిలకా చిలకపట్టుల చీరే కట్టిందోయ్


ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన

Friday, November 19, 2010

కార్తీక పౌర్ణమి





ఆకాశవీధిలో అందాలాచందామామా ,



రావోయి చందమామా

Wednesday, January 6, 2010

మంచు కురిసే వేళలో

మంచు కురిసే వేళలో
ఈ పాట అభినందన సినిమాలోనిది . పాట , దానికి తగ్గ పిక్చరైజేషన్ , శోభన , కార్తీక్ ల డాన్స్ , సీనరీలు అన్ని చాలా చక్కగా వుంటాయి .

Friday, July 10, 2009

పాండవులు పాండవులు తుమ్మెదా

పల్లెటూరి అమాయక పడుచు తనలోని ఆనందాన్ని తెలిపిన పాట ఇది.

జోరుమీదున్నావు తుమ్మెదా

కొన్ని సార్లు మనకు తెలియని సినిమాల లో మంచి పాటలుంటాయి. అసలు ఈపాట ఏ సినిమా లోదో కూడా తెలీదు.ఒకసారి ఏదో హొటల్ లో విన్నాను. తరువాత చాలాసార్లు రేడియిలోవిన్నాను కాని సినిమా పేరు తెలీలేదు. ఈ పాట కోసం వెతుకుతుంటే దొరికింది .

Friday, June 5, 2009

తోటలో నా రాజు

తోటలో ఆమె రాజు తొంగి చూసాడట , నీటిలో ఈ రోజు నీడ నవ్విందట ! అవి నవ్వులుకావట మరి ? ఏమో ???



వస్తాడా రాడా అనుకున్న రాజు వస్తే ఆ ఆనదమే వేరు.ఇక గడియైనా విడిచి పొకూడదని ఎంత ఆర్దముగా తెలుపుకుంటుందో!





ఉష్.. మెల్లిగా అలిసి పోయిన రాజు ఎక్కడ నిదుర లేస్తాదో అని గాలి నే సడి చేయద్ద్దు అని మందలిస్తొంది ఆ అమ్మాయి .మనలనైతే కొట్టేసుందేమో జాగ్రత్త.