1981 లో కె. విశ్వనాథ్ దర్షకత్వం లో వచ్చిన చిత్రము " సప్తపది ".
ఈ చిత్రానికి కథ వ్రాసింది కూడా కె. విశ్వనాథ్ నే .
మాటలు : జంధ్యాల ,
నిర్మాత : భీమవరపు బుచ్చిరెడ్డి .
" ఆచార వ్యవహారాలన్నవి మనసును సక్రమమైన మార్గం లో పెట్టటానికి తప్ప కులమన్న పేరు తో మనుషులను విడదీయటానికి కాదు ." అన్న సూక్తి మీద తీసినదీ చిత్రము .
ఇందులో సోమయాజులు , అల్లు రామలింగయ్య , రమణారావు , కొత్త నటీ నటులు , సబిత , రవికాంత్ , గిరీష్ మొదలైనవారు నటించారు . శంకారభరణం నుంచి సోమయాజులు , అల్లు రామలింగయ్య ల కు ఒకే రకమైన పాత్రలు ఇచ్చినట్లున్నారు కె. విశ్వనాథ్ :)
గోదావరిని అందముగా విశ్వనాథ్ చూపించినట్లుగా ఇంకెవరూ చూపించలేరేమో అన్నంత అందం గా వున్నాయి దృష్యాలన్నీనూ . కథ బాగుంది . అన్నీ బాగున్నాయి కాని చిత్రీకరణ నే నాకు అంతగా నచ్చలేదు !
పాటలైతే చాలా చాలా బాగున్నాయి . మరి ఆ పాటలను చూద్దామా :)
సంగీతం : కె.వి . మహదేవన్
పాడిన గాయనీ గాయకులు ,
పి. సుశీల
యస్. జానకి ,
యస్.పి బాలసుబ్రమణ్యం .
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి . . .
అయిగిరి నందిని . . .
ఓం జాతవేద . . .
గోవులు
నెమలికి నేర్పిన నడకలివి . . .
గోవులు తెల్లన. . .
యే కులము నీదంటే . . .
రేపల్లెయ యద ఝల్లున . . .
మరుగేలరా ఓ రాఘవా . . .
భామనే సత్యభామనే . . .
Showing posts with label విశ్వనాథుని స్వర మాలిక. Show all posts
Showing posts with label విశ్వనాథుని స్వర మాలిక. Show all posts
Friday, April 8, 2011
Tuesday, October 12, 2010
శుభలేఖ

వరకట్నం సమస్య మీద కె. విశ్వనాథ్ తీసిన సినిమా శుభలేఖ .
చిరంజీవి ఫైటింగులూ గట్రా చేయకుండా ఎంచక్కా నీట్ గా చేసిన సినిమా ఇది .
ఈ సినిమా లో నటించిన సుధాకర్ , ' శుభలేఖ సుధాకర్ ' గా పేరు తెచ్చుకున్నాడు !
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ ప్రివ్యూ చూసి డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు .
విన్నపాలు వినవలే
రాగాల పల్లకి లో
ఐతే అది నిజమైతే
నెయ్యములల్లో నేరేళ్ళో ఈ పాట ఓపెన్ చేయగానే ఏదో ప్రకటన వస్తుంది . చిరాకు పడి మూసేయకుండా కాస్త ఓపిక పడితే చక్కని పాట వినవచ్చు !
నీ జడ కుచ్చులు
Wednesday, August 11, 2010
శృతిలయలు

1987 లో కె. విశ్వనాథ్ డైరక్షన్ లో , కరుణాకర సుధాకర్ నిర్మించిన చిత్రం శృతిలయలు . ఇందులో నాయుడు గా కె. సత్యనారాయణ నటించారు . నాయుడు కు కళలపైన అమితమైన ఆసక్తి . మంచి నాట్య కారుడైన , నాయుడికుమారుడు ప్రమాదవసాత్తు మరణిస్తాడు . కళల పై ఆసక్తి తో , ముగ్గురు అనాధ బాలురను చేరదీసి , వారికి సంగీతం లోశిక్షణ ఇప్పించి , తీర్చిది ద్దుతాడు . ఆయన నిర్మించదలిచిన కళా క్షేత్రము కోసం , నిధులను సంపాదించేందుకు పట్ణంవెళుతారు ఆ అబ్బాయిలు ముగ్గురు . ఆ తరువాత రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి .
ఇందులోని పాటలన్నీ నాకు చాలా నచ్చుతాయి . కె. వి మహదేవన్ సంగీతం సమకూర్చగా , వాణీ జయరాం , యస్. జానకి , యస్ .పి . బాల సుబ్రమణ్యం , పి .సుశీల , కె. జె . జేసు దాస్ పాడారు .
శ్రీ గణ నాథం బజామ్యహం
ఆలోకయే శ్రీ బాలాకృష్ణం
తెలవారదేమో స్వామీ
జానకీ కాంత స్మరణం
శ్రీ శారదాంబా నమోస్తుతే
సామజ వర గమనా
తందనా అరి తందనా నా భళా
తక ధిమి
చెలువము నేలగ
ఇన్ని రాశులయుని కి ఇంతి చెలుని కి
|
Subscribe to:
Posts (Atom)