Wednesday, December 30, 2009

ఒకానొక వూరి లో



చిత్రం : ఆకాశమంత
గాయకుడు ; కైలాష్ ఖేర్
రచన ; వేటూరి
సంగీతం ;విద్యాసాగర్

Monday, December 28, 2009

అన్నమయ్య కీర్తనలు



వైకుంఠ ఏకాదశి సందర్భముగా , ఈ అన్నమయ్య కీర్తనలు .




తెలవారదేమో స్వామీ
చిత్రం ; శ్రుతిలయలు ,
గాయకుడు ; జేసుదాసు .

( ఇది అన్నమయ్య కీర్తన కాదు అని ఎక్కడో చదివాను )



శ్రీనివాసుని కటాక్ష సిద్దిరస్తు .

Thursday, December 10, 2009

శబరి

సంపూర్ణ రామాయణము సినిమా లోని ఈ శబరి పాట అంటే నాకు చాలా ఇష్టము .

శబరి 

Tuesday, December 1, 2009

మనసే అందాల బృందావనం



చిత్రం ; మంచికుటుంబం
గాయని ; పి . సుశీల

పిల్లలూ దేవుడూ చల్లనివారే



ఈ పాట లేతమనసులు సినిమా లోనిది .
ఈ సినిమా వచ్చినప్పుడు , చిన్న పిల్లలు ముదురు మాటలు మాట్లాడుతున్నారని తెగ చెప్పుకున్నారు !
మా సావిత్రి మా పిల్లల కోసం ఎప్పుడూ పాడుతుంటుంది . వాళ్ళూ అడిగి పాడించుకుంటారు .

విన్నావటే యశోదమ్మ



ఈ పాట మాయాబజార్ లోనిది . . ఇదీ నా చిన్నప్పుడు స్కూల్ డే కి వేసినదే ! ఇందులో గోపిక గా వేసాను .

అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే



ఈ పాట ఏ సినిమా లోదో ఎవరుపాడారో తెలీదు . నా చిన్నప్పుడు స్కూల్ డే కి వేసాము . ఇందులో నేను అమ్మ గా వేసాను .

చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి



ఆపత్భాంధవుడు

బాబూ నిద్దుర పోరా



చిత్రం ; మా బాబు
గాయని ; పి. సుశీల ( అనుకుంటున్నాను )

ఉయ్యాల జంపాల ఊగరావయా



చిత్రం ; చక్రపాణి ,
గాయని ; భానుమతి .

పిలచినా బిగువటరా

Tuesday, November 24, 2009

ఏదో ఒకరాగం వినిపించే

జ్ఞాపకాలే . . . . జ్ఞాపకాలే . . . . . ఆ తరువాత గుర్తుకు రాదు . ఎందరినో అడిగాను , కాస్త చెప్పండి అని . అందరూ ఒకటే మాట ఆ ఒక్క పదముతో ఎలా చెప్తాము ? అని .మొత్తానికి మా జయ , తన ఫ్రెండ్ సంధ్య కలిసి మెలిసి పట్టారు . ఇద్దరికీ బోలెడు థాంకూలు .

చిత్రం ; రాజా
గాయని ; చిత్ర

Monday, October 5, 2009

మంగళ హారతి గొను రామా

నీలవర్ణ శ్రీరామ నిను వర్ణించతరమా
నిత్య మంగళ హారతి గొను రామా శ్రీ రామా
1. ముని యాగమును గాచి రాతిని నాతిగ చేసి -2
జానకీని పెళ్ళాడి జయముగొను రామ జయము గొను - నీల -
2. వైకుంఠమందు నీవు వటపత్రసాయివై -2
వరలక్ష్మి తో గూడి జయము గొను రామా జయము గొను -నీల -
3.బాలికలందరము గూడి పచ్చాల హారతి -2
మురళి కృష్ణ గొను ముత్యాల హారతి
ఇదే రామ హారతి ఇదే

జీవితం ఏమిటి ?????

జీవితం ఏమిటి ?????
జీవనతరంగాలు-13

పాపాయి గా అమ్మ నాన్నల ముద్దుమురిపాలనందుకొని, చదువుల తల్లిగా తీర్చిద్దిదుకొని , పదవారువన్నెల ప్రాయాన్ని సంతరించుకొని , పుత్తడి బొమ్మగా రూపు దిద్దుకొని , కళ్యాణ జానకిగా పూలరధం లో అత్తవారింట అడుగిడి, కొత్తబంగారు లోకం లో విహరించి, గాజులందుకొని, పచ్చని సంసారం గా వర్ధిల్లుతూ,కదిలేకాలమా కాసేపు ఆగవమ్మా అని వేడుకుంటూ అబ్బా. . .   జీవితం ఎన్ని మలుపులు తిరిగింది! ఎన్నెన్ని అనుభవాలు అనుభవాలు,ఎన్నెన్ని అనుభూతులు,ఎన్ని బంధాలూ,ఎన్నెన్ని అనుబంధాలు !నిద్రపట్టని జానకి అనుభూతులను కలబోసుకుంటూ,వివాహబంధంతో తనతో పెనవేసుకొని,భర్తగానే కాకుండా,తండ్రిలా,సోదరుడిలా,హితుడిలా,స్నేహితుడిలా అన్నివిధాల తనకు తోడూనీడై నిలిచిన,గాడ నిద్రలో ఉన్న విభుడిని మురిపెంగా చూసుకుంది.
ఉపచారాలే చేసానో ? అపచారాలే చేసానో ?
ప్రభూ ! ఇక అలసి పోయాను , మీ చల్లని వొడిలో సేద తీరనీయండి అనుకుంటూ రామయ్య మీద చేయి వేసింది జానకి.చల్లగా తగిలిన రామయ్య ను చూసి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది.ఇదేమిటీ అనుకుంటూ ఏమండీ ఏమండీ అని గాభరగా పిలిచింది.చలనం లేని రామయ్యను చూస్తూ నిస్తేజంగా కూర్చుండిపోయింది.
ఎవరొచ్చారో ,ఎవరెళ్ళారో,ఏమి జరుగుతోందో ,పిల్లలతో కలిసి అమెరికా ఎట్లా వెళ్ళిందో ఏమీ తెలియటం లేదు.ఎక్కడ ఎన్నిరోజులున్నా తన గూటికి చేరుకోవాలిగా!చిన్నగా మెట్లెక్కి వచ్చి,నీళ్ళు నిండిన కళ్ళతో
రెక్కలు తెగిపోయి, చెదిరిపోయిన గూడు,
వానలకు వాలిపోయిన రాధామాధవం,
తడిసి ముడుచుకున్న మామిడి,
ఆకులు నల్లబడ్డ నాగిని
ముందే ఎండలకు మోడైన తెల్ల సంపెంగి
వచ్చావా అని దీనంగా చూసాయి.
హడావిడిగా కరెంట్ తీగ మీద వంటరిగా
పరుగులు పెడుతున్న ఉడత ఒక్క నిమిషం ఆగి
నువ్వూ నాలాగే తోడు కోల్పోయావా అని విచారంగా అంది.
ఎంతసేపు బయట నిలబడతావు
లోపలికి రా అని జాలిగా స్వాగతించింది
శూన్యమైన గూడు.
ఇదేనా జీవితం? ఈ జీవనతరంగాలలో ఈ బంధాలూ ,అనుబంధాలూ ఎంతవరకు ?

https://www.youtube.com/watch?v=PCyj0NmU9hA

Wednesday, September 23, 2009

కదిలేకాలమా!

జీవనతరంగాలు-12

"ఏమిటీ జానకీ?పొద్దూనే ఎవరిమీదో గొణుగుతున్నావు పనిమనిషి రానన్నదా ఏమీటీ?" పిల్లల ఫోటోలను తుడుస్తూ తనలో తాను గొణుక్కుంటున్న జానకిని అడిగాడు రామయ్య.
"పనిమనిషి వస్తే ఎంతా రాకపోతే ఎంత ?ఒక్కపూట పని చేసుకోలేనా ఏమిటి?ఐనా ఎప్పుడూ పనిమనిషి గోలేనా ?"అంది విసురుగా జానకి.
"ఐతే ఎవరిని?నన్నైతే కాదుకదా?" కాస్త భయపడుతున్నట్లు నటిస్తూ జోక్ గా అన్నాడు రామయ్య.
"హుం నన్ను చూస్తే మీకు జోక్ గానే ఉంటుంది.కాలం చూడండి అంత కొంపలు మునిగిపోతున్నట్లు హడావిడిగా పరిగెత్తటం ఎందుకుట? నిదానంగా వెళితే ఏమవుతుంది? ఈ బుజ్జిగాడు చూడండి అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో!వాడి కొడుకు కాలేజ్ లో చేరాలిట.ఇందాక  ఫొన్ చేసినప్పుడు వాషింగ్ టన్ వెళ్ళి కాలేజ్ చూసొచ్చామమ్మా అన్నాడు"అంది కొడుకు చిన్నప్పటి ఫొటోని చూస్తూ.
"బాగుంది నీ బుజ్జిగాడెప్పటికీ బుజ్జిగాడుగానే, నా బంగారం ఎప్పటికీ గుడియాగానే ఉండిపోతారా? కాలం పరిగెత్తక నీకోసం ఎట్లా ఆగుతుంది?ఆగుతే నీ మునిమాణిక్యాలు ఎట్లా వచ్చేవారు?"నవ్వాడు రామయ్య.
"ఏమో నండి పిల్లలంతా ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు.ఇల్లంతా ఎంత శూన్యం గా ఉంది చూడండి.ఇలా ఉంటే అమెరికావాళ్ళు"ఎంప్టీ నెస్ట్"అంటారుట."
"బాగుంది వ్యవహారం.రెక్కలు వచ్చిన పిట్టలు ఎగిరిపోకుండా ఉంటాయా?ఎంప్టీ నెస్ట్ అని ఎందుకనుకుంటావు? నీకు నేను నాకు నువ్వు మలివయసులో ఒకరికొకరం.ఇన్ని రోజులూ బాద్యతల్లో ఉన్నాము.ఇప్పుడు భాద్యతలు తీరి, నేను రిటైర్ అయ్యి ఫ్రీగా ఉన్నాము.పద హాయిగా ఏ గోవానో సింగపూర్ నో తిరిగొద్దాము.చాయిస్ ఈజ్ యువర్స్ .చీరప్ బేబీ."ఉషారు గా అన్నాడు.
"అంతొద్దులెండి.నా కోరిక ఒకటి ఉంది తీర్చండి చాలు."అంది జానకి.
"అడుగు మేడం. ఇంతవరకు ఎప్పుడూ ఏది అడగని నువ్వు అడుగుతున్నావు.నీ ఇష్టం ఏదైనా ఇచేస్తాను. ఐ ఆం ఆల్ వేస్ ఎట్ యువర్ సర్వీస్ "అభయమిచ్చాడు.

https://www.youtube.com/watch?v=BCzplttGVEU

Friday, September 11, 2009

పచ్చని సంసారం



జీవనతరంగాలు -11

కొమ్మ కొమ్మ కో సన్నాయి ,కోటిరాగాలు పలికాయి . పచ్చని చెట్టు విరగ కాసి ,పండిన పచ్చ పచ్చని పనసతొనల్లా , మాణిక్యాలాంటి ,ముచ్చటైన పాప ,బాబు .రామయ్య కు గారాలపట్టి స్వాతైతే, జానకమ్మ ముద్దుల కొడుకు నేతాజీ. ప్రేమానురాగాలతో అల్లుకున్న చక్కని పొదరిల్లు.
కాలం కమ్మగా కరిగిపోతోంది.

జీవన తరంగాల పై ఆహ్లాదముగా సాగిపోతున్న జానకి బంగరు నావలోకి రామయ్య పాదము మోపటము తో మొదలయ్యి ఒకరొకరుగా కూతురు ,కొడుకు , అల్లుడు , కోడలు , మనవళ్ళు , మనవరాళ్ళూ వచ్చి చేరారు. చిన్న మనవడి రాక తో తన మెడ లో నవరతనాల మాల వేసుకున్నంతగా సంతోష పడింది జానకి. మనవరాళ్ళకి , ఆషాడ మాసములో చుట్టుపక్కల పిల్లలని పిలిచి గోరంటాకు పండగలు చేస్తూ , మనవళ్ళ తో గాలిపటాలెగరేస్తూ, కథలు చెపుతూ వాళ్ళేమి చెప్పినా తనకేమీ తెలీదు అన్నట్లుగా వింటూ సంబరపడి పోతున్న జానకి తో
"జానకీ ,పిల్లలతో అంతలా అనుబంధం పెంచుకోకు."అని హెచ్చరించాడు రామయ్య .
"అయ్యో అదేమిటండి ? వాళ్ళు నా పిల్లలు."విలవిల్లాడింది జానకి.
"కాని వాళ్ళు నీ పిల్లల పిల్లలు. వీళ్ళమీద అంత ఆశలు పెంచుకోవటము మంచిదికాదు."అన్నాడు.
"మరి మీరూ ,ఇంటి కి ఎవరైనా రావటము ఆలశ్యం మీ మనవడి తో లాప్ టాప్ తెప్పించి వాడి ప్రావీణ్యం చూపించి ,బోర్ కొట్టిస్తారు. మనవరాలి గొప్పలు చెపుతారు ."మూతి ముడిచింది జానకి.
"నిజమే ! కాని నేను వాళ్ళే లొకముగా లేను. మన హద్దుల్లో మనం వుండాలి."
అలవోకగా చిరునవ్వు నవ్వేసి,తనకిష్టమైన రాధామాధవం,మధుమాలతి,పారిజాతం, గులాబీ, మల్లెల తీగలతో, పిల్లల ఆటపాటలు , ముద్దుమురిపాలతో పచ్చగా అల్లుకున్న తన గూటిని మురిపెంగా చూసుకుంది జానకి.

https://www.youtube.com/watch?v=IYx3V3REHbY


Monday, September 7, 2009

సీమంతం

సీమంతం

జీవనతరంగాలు - 10
హాయిహాయిగా సాగిపోతున్న కొత్తబంగారులోకం లోకి కొత్త మెంబర్ నేనున్నానంటూ వచ్చేస్తొంది .కొత్తన్ మెంబర్ రాకకు సంతోష్పడిపోతూ , ఆనందంగా ఆహ్వానిస్తూనే ,ఏడవ నెలలోనే నిండుగా ,భారంగా , నడుస్తున్న జానకి ని చూస్తే రాముడి మనసు రెప రెప లాడి పోతోంది.జానకి ని జాలిగా చూస్తున్నాడు. అందుకే అంటారు అపురూపమైనది ఆడజన్మ ,ఇంకో ప్రాణిని సృష్టించటానికి తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ మాతృదేవత గా మారుతుంది అని.ఆమెకు ఏ కష్టం కలుగకుండా ఉల్లాసంగా ఉంచుతూ ,తన శాయశక్తులా సంతోష పెడుతున్నాడు. చిన్నిపాపాయిలా లా కాలు కదపనీకుండా గారాబం చేస్తున్నాడు.
అమ్మ నాన్నా ,అన్నా, వదినా వచ్చి సీమంతం చేసి ,తీసుకెళుతామనగానే బిక్క మొహం వేసిన భర్తనుచూసి పక్కుమంది జానకి.అమ్మను ఒప్పించి,అమ్మనే తన దగ్గర వుంచుకుంది.

జో లాలీ లాలీ

https://www.youtube.com/watch?v=wElquKDDCWg&feature=emb_title

https://kammatikala.blogspot.com/2009/09/seemantam.html


Saturday, September 5, 2009

కొత్తబంగారులోకం

కొత్తబంగారులోకం 

జీవనతరంగాలు-9

అడుగులో అడుగులేస్తూ తనవెంట వచ్చిన జానకి మోములోని అమాయకత్వము , ముగ్ధత్వమూ , జానకి సౌశీల్యమూ చూసి మురిపోయాడు రామయ్య. జానకి చేతిని అందుకొని కొత్తబంగారులోకం లోకి నడిపించాడు.తన జీవితం లోకి వివాహబంధం తో ప్రవేశించి,భర్తగా,హితుడిగా,సోదరుడిగా,తండ్రిగా తనను అన్నివిధాల చూసుకుంటున్న రామ్మయ్య అంటే జానకికి ఎనలేని ప్రేమ ,గౌరవం.ఆఫీస్ నుంచి రావటం ఒక్క క్షణం ఆలశ్యమైనా గాభరా పడిపోతూ ఎదురుచూస్తూవుంటుంది.మురిపాలూ ముచ్చట్లూ ,చిరుచిరు అలకలూ ,వచ్చిరాని వంటల ప్రయోగాలూ ,ఆనందాల తో కొత్త కాపురం ముద్దు ముద్దుగా సాగిపోతోంది.

https://kammatikala.blogspot.com/2009/09/blog-post_05.html
https://www.youtube.com/watch?v=ZXt-a_kK1qI











Wednesday, September 2, 2009

అత్తవారిల్లు


అత్తవారిల్లు

జీవనతరంగాలు - 8

రాముడి అడుగులో అడుగేస్తూ వస్తున్న జానకిని, ఆగు వదినా అంటూ ఆడపడుచులు ఆపారు. ఏమిటి అన్నట్లుగా కళ్ళెత్తి చూసింది జానకి.
"అలా వెళ్ళిపోదామనే అన్నయ్య పేరు చెప్పు"అన్నారు.సిగ్గులమొగ్గ ఐంది జానకి. చిన్నగా "రామారావు" అంది .
"ఏమిటీ వినపడలే "
"పోనీ నేను చెప్పనా ?"
"అబ్బో అప్పుడే పెళ్ళాన్ని వెవకేసుకొస్తున్నాడు .ఆగరా అబ్బాయ్ నీ పని తరువాత "పెద్ద మేనత్త ఆర్డర్.
సిగ్గు సిగ్గు గా "నేనూ ,మావారు రామారావు గారూ వచ్చాము తలుపు తీయండి "అంది జానకి.
"అప్పుడేనా ? ఆడపడుచు కట్నం ఏదీ ?"
అక్క చూడకుండా నాన్న ఇచ్చ్చిన 116 రూపాయలూ మంగళ హారతి పళ్ళెం లో వేసాడు రామారావు.
"నాలుగు తరాల ఆడపడుచులం వున్నాము అంతేనా ?"
"చాలులే అత్తయ్యా" అక్క మాట.
"ఎలా ? పసుపు దంపుడు పాటనుంచీ పాడుతున్నాను, అప్పగింతల పాటా పాడాను ,రేపు సత్యనారాయణ వ్రతం పాటా పాడాలి ,మరి నాకు పట్టుచీర లేదా ?"
ఇంకో 116 రుపాయలు అత్తయ్య పట్టు చీర కోసం ఇచ్చాడు.పుట్టింటి నుంచి పసుపుకుంకుమే చాలు ఆడపడుచులకు.పావలాకాసైనా పదివేలు.ఐనా తమ్ముడిని దబాయించటం అదో సరదా!
ఇక చాలు లెండర్రా అంటూ అత్తగారు జానకి బుజం చుట్టూ చేతులు వేసి ఆప్యాయం గా ఇంట్లో కి తీసుకెళ్ళారు.
అత్తగారి ఏడుగజాల పట్టుచీర కాస పోసి కట్టుకొని ,భర్తతో కలిసి వ్రతం చేసుకొని కాళ్ళకు దండం పెడుతున్న జానకి ని కళ్ళ నిండుగా తృప్తి గా చూసుకున్నారు అమ్మ ,నాన్న .
సీతమ్మా వచ్చింది అత్తింటికి
https://www.youtube.com/watch?v=33GNkLt3x1M&list=RD33GNkLt3x1M&start_radio=1&t=0

(https://kammatikala.blogspot.com/2009/09/blog-post.html)


Saturday, August 29, 2009

పూలరధం

పూలరధం

జీవనతరంగాలు - 7

కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అమ్మ దొంగా నిను చూడకుంటే, నాకు బెంగా అనుకుంటూ జానకి చిన్నప్పటి ముచ్చటలు తలుచుకుంటూ జానకి కి వడిబియ్యం కడుతోంది అమ్మ.బామ్మ , అమ్మమ్మ,అత్త, పిన్ని అందరూ "జానకి కి అత్తవారింట్లో ఎలా మెలగాలో చెబుతున్నారు.ఇంతలో బాబాయ్ వడి వడి గా వచ్చేసి ,అమ్మాయ్ జానకి అత్తవారింట్లో జాగ్రత్తగా వుండమ్మా ,ఎవరేమన్ననూ ఎదురాడబోకు,మగడేమన్ననూ మారాడబోకూ" అని చెప్పటము మొదలు పెట్టగానే అందరూ పక్కున నవ్వి మీకూ తెలుసా ఇవన్నీ అంటూ వేళాకోళాలు మొదలు పెట్టారు. భారం గా వున్న వతావరణం కొంచం తేలికైంది.
వధూవరులను ఎదురెదుగా కూర్చోబెట్టి దంపత తాంబూలాలు ఇప్పించారు.ఆడపడుచు అన్న కండువాలో వసంతం వేసి,ఓ చెక్కబొమ్మను పెట్టి, అన్నవాదినల వడిలో వసంతం పడేట్టుగా కాసేపు ఉయ్యాలలా ఊపి సందడి చేసింది.ఆ తరువత అసలైన ఘట్టం మనసు భారంగా మొదలైంది.
పాలలో చేతులు ముంచి అల్లుడికి అత్త మామలకు ,ఆడపడుచులకూ పేరు పేరు నా అందరికీ అప్పగించారు అమ్మా నాన్న.
అమ్మ పెట్టిన పెరుగన్నం తిని బయిలుదేరుతున్న జానకి కి చాటుగా అమ్మమ్మ 10 రుపాయలిచ్చింది.ఎందుకమ్ముమ్మా అంటే "పిచ్చి తల్లీ వుండనీయమ్మా ,అమ్మ కి కార్డ్ ముక్క రాయాలన్న ,నువ్వు చటాకు పూలు కొనాలన్నా వుంటాయి"అంది ఆప్యాయం గా .అమ్మ్ముమ్మ సరదా అని తీసుకొని అమ్మకు అందరు పెద్దల కాళ్ళకు దండం పెట్టి,సెలవు తీసుకొని,భారమైన మనసుతో కళ్ళనీళ్ళ ను కనిపించనీయకుండా అమ్మా ,నాన్నా ,పుట్టింటి ఆత్మీయులను వదిలి పతి చేయి అందుకొని పూల రధం లా అలంకరించిన పడవంత కారు లో అత్తింటికి బయిలుదేరింది జానకి.

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_29.html

https://www.youtube.com/watch?time_continue=2&v=qGRjGvW0AdM&feature=emb_title









Friday, August 28, 2009

కళ్యాణం కమనీయం

కళ్యాణం కమనీయం
జీవన తరంగాలు -6
వివాహ నిర్ణయం కాగానే ఇల్లంతా సందడి సందడి.బామ్మ ఆధ్వర్యం లో అప్పడాలు వత్తించటం,వడియాలు పెట్టించటం,పిండివంటలు చేయటం చకచకా జరిగిపోతుంటే,ఇంకో పక్క షాపింగ్ పనులు.అత్తయ్య వారం ముందు నుంచే మేనకోడలు నలుగుపెట్టి స్నానం చేయిస్తోంది.అవును మరి పెళ్ళికూతురు కళకళలాడాలిగా.అత్త స్నానం చేయించేలోపల పిన్ని అన్నం కంచంలో కలుపుకొచ్చి ముద్దలు చేసి తినిపిస్తోంది పెళ్ళికూతురు..ఆ పైన హాయిగా పాటలు వింటూ నేస్తాలతో కబుర్లు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది.మస్తాను కోసుకొచ్చి కాచువేసి రుబ్బిన గోరంటాకు చక్కని డిజైన్లతో చేతికి, కాళ్ళకు పారాణిలా పెట్టారు.అరచేతులు గోరంటాకు సువాసనతో ఎర్రగా పండి ఎంత ముద్దొస్తున్నాయో.
పెళ్ళిరోజు రానే వచ్చింది.ఆజాంబాహుడు అందాల రామయ్య బంధు మితృలతో తరలి వచ్చాడు.
ఆకాశమంత పందిరి వేసి ,భూదేవంత పీఠం వేసి రంగ రంగ వైభోగంగా జానకీ ,రామారావుల కళ్యాణం జరిపించారు నాన్న.
విందు భోజనం లో అప్పడాలు లేవు ఇదిఏమి విందు భొజనం అని పాటెత్తుకుంది, వరుడి మేనత్త.అయ్యో వేయటము మర్చిపోయినట్లున్నాము అంటూ హడావిడిగా అప్పడాలేసింది వధువు పిన్ని.అప్పడాలే మరిచారు, అమ్మాయినంపటమూ మరుస్తారేమో మరో పాట వచ్చేసింది.వధూవరులు బంతిభోజనం చేస్తుంటే తాతయ్య వచ్చి మురిపెంగా చూసుకున్నారు.పాటల సరదాల మధ్య విందు తరువాత, సిగ్గూ పూబంతీ విసిరే సీతా మాలక్ష్మీ అని పాటలు పాడుతూ బంతులాటలాడించారు.ఆటపాటల తో నునుసిగ్గుల జానకి కళ్యాణము కమనీయం గా జరిగింది.
సీతారాముల కళ్యాణము చూతము రారండీ.

https://www.youtube.com/watch?v=EO3JWdSL1mk

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_28.html

Thursday, August 27, 2009

పుత్తడి బొమ్మ

పుత్తడి బొమ్మ

జీవనతరంగాలు -5

"అత్తయ్యా !"

"ఏమిటమ్మాయ్ ?"

"ఈ రోజు జానకిని చూసుకోవటానికి పెళ్ళివారొస్తామని కబురు చేసారు.ఎట్లా జరుగుతుందో  ఏమిటో అత్తయ్యా ! నాకు గాభరాగా వుంది."

"గాభరా ఎందుకే ?  నీకు గాభరా అయితే ,పెద్దవాళ్ళం నేనూ మీ మామగారు ఏర్పాట్లు చూసుకుంటాములే .పెళ్ళిచూపులు ప్రతి అమ్మాయికీ తప్పవు.పెళ్ళివారు రావటం,వారికి ఏర్పాట్లు చూడటం అమ్మానాన్నల కు తప్పవు.అదీ ఒక వేడుకలా మలుచుకోవాలి. అమ్మాయికి ఒక అపురూపంగా నిలిచిపోవాలి.పరవాలేదు అంతా సవ్యంగా నే జరుగుతుందిలే భయపడకు.మన పుత్తడిబొమ్మను కాదనేదెవరు? ఫొటో చూసాముగా కోదండరామయ్య లా ఉన్నాడు."
కోదండరాముడంట అమ్మలారా బామ్మ కూనిరాగాలు విన్న జానకి బుగ్గల్లో గులాబీలు పూసాయి.మనసు ఎటో వెళ్ళిపోయింది.

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_27.html

https://www.youtube.com/watch?v=90wq0bfhIzg&list=RD90wq0bfhIzg&start_radio=1&t=108

Wednesday, August 26, 2009

ప్రాయం



జీవన తరంగాలు 3

జానకీ

ఈ రాధామాధవ పూల సువాసన ఎంత బాగుందో కదా !
అవును ,దానికి తగ్గట్టే ఈ కవిత చూడు ,
ఆకులో ఆకునై పూవులో పూవు నై
ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే నిలిచి పోనా
జీవితమంటే నెచ్చలి తో చక్కని కవితల కబురులు, రాధా మాధవపూవుల సువాసన, లోకమంతా మంచివారితో నే నిండివుందనే అమాయకత్వం , కన్నెప్రాయపు కళ్ళ లో కమ్మటి కలలు , మదిలో మధురభావాలూ అలా . . . అలా . . .

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ



ఏ దివిలో విరిసిన పారిజాతమో









అల్లి బిల్లి అమ్మాయికి

చదువుల తల్లి

చదువుల తల్లి

జీవనతరంగాలు -3

"వొరేయ్ అబ్బాయ్"
"ఏంటమ్మా ?"
"ఇంకా జానకి పెళ్ళి ఎప్పుడు చేస్తావురా ?:
"అప్పుడే తొందరేమిటమ్మా ? చదువు కానీ ."
"అదేమైనా ఉద్యోగాలు చేయా లా ? ఊళ్ళేలా ? గుండెల మీద కుంపటి లా ఎన్ని రోజులుంచుతావు ?"
"అమ్మా ! ఆడపిల్లంటే గుండెలమీద కుంపటి అనే రోజులు మారుతున్నాయి. అమ్మాయి ఇంట్లో నే వుండే పరిస్తుతులు లేవు. అవసరమైతే ఉద్యొగము చేసి భర్త కు చేదోడు వాదోడుగా ఉండాలి. తనపిల్లలకు చదువు లో సాయం చేసి ఉన్నతులుగా తీర్చిదిద్దాలి.చదువు తో విజ్ఞానము పెరుగుతుంది. బయట ప్రపంచము ఎలా వుందో తెలుస్తుంది . మనము ఇచ్చే ఆస్తి పాస్తులు ఎవరైనా దోచుకు పోవచ్చు కాని మనము చదివించటము వలన కలిగే జ్ఞాన సంపదను ఎవరూ దోచుకోలేరు. డిగ్రీ అయ్యేవరకూ పెళ్ళి ప్రతిపాదన లేదు."
బామ్మ తో ఖరాఖండీ గా నాన్న చెప్పటం విని ఎంత మంచి నాన్న అని గౌరవంగా నాన్నను చూసుకుంది జానకి.నాన్న మాటను నిలబెట్టాలని జానకి శ్ర్ద్దగా చదివి కాలేజ్ టాపర్ గా నిలిచింది.చదువుతో పాటు కాలేజీ జీవితము లో ఎన్నెన్ని సరదాలూ,సంతోషాలు.

"తియ తీయని తేనేల మాటల తో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు.
తెలియని చీకటి తొలిగించి వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు.
దొంగల చేతికి దొరకనిదీ ,దానము చేసిన తరగనిది
పదుగురి లోనా పేరును నిలిపే పెన్నిదది."


https://www.youtube.com/watch?v=pmeiyk3OfPQ&feature=emb_title




Saturday, August 22, 2009

ముద్దు మురిపాలు



# జీవన తరంగాలు - 2 #


పాపాయి అందరికీ గారమే ! అత్త ,తాత, అమ్మమ్మ,బామ్మ అందరికీ ముద్దే . ముచ్చటైన పాపాయికి, సీతాదేవి అంత సౌజన్య మూర్తి ,వినయశీలి కావాలని నాన్న జానకి అని పిలుచుకున్నారు.

సన్నజాజీ పూవులూ చందమామ కాంతులు అందాలపాపా నవ్వులూ,
మా యింటి వెలుగు ,మా కంటి వెలుగు మా చిన్ని పాపా నవ్వులే !
తాతయ్య మీసాల ఉయ్యాల లూగేనూ,అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను.
అని అమ్మమ్మా ,తాతయ్య సంబరాలు పోతే,


బంగారు ప్రాయమిది పవళించవె తల్లి,
ఈ రోజు దాటితే నిదురేది మళ్ళీ అని పిన్ని సుద్దులు చెప్పింది.

అత్తవడి పూవువలే మెత్తనమ్మా అంటూ అత్త ముద్దు చేసింది.

పాపాయి కి అత్తమీద అంత ప్రేమే .ఈ బంధాలు అనుభంధాలే కదా మధురమైనవి

https://www.youtube.com/watch?v=GBwm8qEAZrs&list=RDGBwm8qEAZrs&start_radio=1&t=0



Friday, August 21, 2009

పాపాయి



ఉయ్యాలలో కళ్ళు ముసుకొని, రెండు చేతులు గుప్పిట్లు ముసుకొని ,గడ్డం కిందకు చేర్చి , ముద్దు ముద్దు గా నిద్దరోతున్న >పాపాయిని తదేకంగా ముచ్చట గా చూసుకుంటూ మురిసిపోతున్న నాన్న ని చూసి ,అమ్మ అంతగా చూడకండి పాపాయికి దిష్టి తగులుతుంది అంది.
నాన్న పట్టుబడ్డ దొంగలా సిగ్గును కప్పి పుచ్చుకుంటూ నాతల్లి కి నాదిష్టేమీ తగలదులే అయినా నువ్వు చూడకుండా నేను చూసేస్తున్నానని కుళ్ళుకుంటున్నావు కదూ ! మురిపంగా మూతి తిప్పింది అమ్మ .మరి మీరొక్కరే చూడక పోతే నాకూ చూపించొచ్చుగా !
పొత్తిళ్ళలో పాపాయిని చూసి అరే ఈ బుజ్జి కన్న నేనా ఇన్నిరోజులు నాబొజ్జలో వుంది ఆశ్చర్యపోయింది అమ్మ.

Thursday, August 20, 2009

రాధా ప్రేమ

ముద్దు ముద్దుగా కన్నయ్య మీద యశోదకు అభియోగం చేస్తూనే తన ప్రేమని ఎంత అందముగా వ్యక్తీకరిస్తోందో రాధ .



కృష్ణుని మీద ఇంకెవరైనా ప్రేమచూపిస్తే రాధ ఎందుకు కోపం తెచ్చుకోకూడదు ? రాధ నే క్యో న జలీ ?


బృందావనము అందరిదీ ఐతే కావచ్చు కాని గోవిందుడు మటుకు తన వాడే !

Tuesday, August 18, 2009

వెన్న దొంగ

వెన్న దొంగ తో అమ్మ కి ఎంత కష్టమో ! ఎవేవో ఉపాయాలు పన్ని వింత వింత దొంగతనాలు చెస్తునే వుంటాడు కన్నయ్య .



ఎంత అల్లరి చేసినా క్రిష్ణయ్య అంటే అమ్మ కి ముద్దేకదా !

Sunday, August 16, 2009

చూడుమదే చెలియా

నా బ్లాగ్లొకపు చిన్ని స్నేహితురాలు , కృష్ణ ప్రేమికురాలూ అయిన సృజన కు అభిమానము తొ,








Saturday, August 15, 2009

ఉందిలే మంచికాలం



స్వాతంత్రదినొత్సవ శుభాకాంక్షలు

Wednesday, July 15, 2009

రాయినైనా కాకపోతిని



ఈ పాట విన్నప్పుడల్లా ఆ బోయ, ఆ రాయి, ఆ ఉడత , ఆ పక్షి ఎంత పుణ్యము చేసుకున్నారో కదా ! అనిపిస్తుంది.

Friday, July 10, 2009

పాండవులు పాండవులు తుమ్మెదా

పల్లెటూరి అమాయక పడుచు తనలోని ఆనందాన్ని తెలిపిన పాట ఇది.

జోరుమీదున్నావు తుమ్మెదా

కొన్ని సార్లు మనకు తెలియని సినిమాల లో మంచి పాటలుంటాయి. అసలు ఈపాట ఏ సినిమా లోదో కూడా తెలీదు.ఒకసారి ఏదో హొటల్ లో విన్నాను. తరువాత చాలాసార్లు రేడియిలోవిన్నాను కాని సినిమా పేరు తెలీలేదు. ఈ పాట కోసం వెతుకుతుంటే దొరికింది .

Thursday, July 9, 2009

ఎంతటి రసికుడవో తెలిసెరా

బాపు సినిమాలో క్లబ్ డాన్సర్ హలం కూడా నిండుగా డాన్స్ చెస్తుంది కదా !

mutyaalamuggu

జాణవులే నెరజాణవులే

మాములుగా సిల్క్ స్మిత పాటలు డాన్స్ లంటే నాకు నచ్చవు.కాని ఆదిత్య 369 లోని ఈపాట ఎందుకొ చాలా నచ్చింది.
జిక్కి స్వరం పాటకి సొగసులద్దింది.

Get this widget | Track details | eSnips Social DNA

Wednesday, July 8, 2009

యసోమతి మైయా



రాధ ఇంత తెల్లగా వుంటుంది,నేనెందుకు నల్లగా వున్నాను అని గోపాలుడు యశోదను అడిగాడట.
అమ్మ ఎంత చక్కగా జవాబు చెప్పిందో చూడండి.


బంగారు పాపాయి

నేను పుట్టిన్నప్పుడు ఈ పాట మా అత్తయ్య ననెత్తుకొని పాడేదట !
ఈ పాట అంటే అంత ఇష్టం చిన్నప్పటి నుంచే వుందన్నమాట.
ఇంత మంచి పాట లింక్ ని ఇచ్చిన తృష్ణ గారు ఎంత మంచి వారో బంగారు తల్లి.
Get this widget | Track details | eSnips Social DNA

Sunday, July 5, 2009

రామచక్కని సీతకు

యమునా తీరము న

యమునా తీరము లొ రాధ వేయి కనుల తో వేచి వుంటే కొంటె మాధవుడు వెంటనె వచ్చాడా ఊహు
అంత సేపు వేచి రాధిక కు మాధవుడు రాగానే అనుమాnam

చందన చర్చిత

మా ఫ్రెండ్ లలిత ఈ పాట చాలా బాగా పాడేది.సమయం దొరికిన ప్పుడల్లా తనతో పాడించు కునేదాని.
చిన్నప్పుడు ఏమిటి కళేబరం మీద కూడా పాట వుంటుందా అను కున్నాను.పెద్ద గయ్యక కాని ఆ పాట అందం ,భావం తెలీలేదు.

Saturday, July 4, 2009

ఔరా అమ్మక చెల్లా

చిరంజీవి డాన్స్ పాటల లో ఈపాట నాకు చాలా ఇష్టము.
చిరంజీవి ,మీనాక్షి శేషాద్రి ఇందులో డాన్స్ బాగాచేశారు.
మీనాక్షి పట్టులంగాలు చూస్తుంటే ఇప్పుడాఏ పట్టు లంగా వేసుకోవాలి అన్నంత ముద్దుగా వుంది.

పల్లె కన్నీరు




చిత్రం;కుబుసం
రచన;గోరటి వెంకన్న
వారి బ్లాగ్ ద్వారా ఈ పాటని పరిచయం చేసిన

విశ్వమిత్ర గారికి,
ఏకలింగం గారికి దన్యవాదములు.

Tuesday, June 30, 2009

ఆజా సనం -చోరి -చోరి

నేను రాజ్ కపూర్ సినిమా చూడలేదంటే కల్పనా దీదీ బరోడా లో ఈ చోరీ చోరీ సినిమా చూపించింది.అప్పటికే ఈసినిమా వచ్చి చాలా సంవత్సరాలయింది.
నాకు సినిమా, సినిమా లో పాటలన్ని చాలా నచ్చాయి.అందులో ముఖ్యం గా ఈ పాట,పంచిబను ఉడతే చలూ .ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చుడాలని పించేంత నచ్చేసాయ్

తోలి సంధ్య వేళలో

తొలి సంద్య వేళ లో తెలవారే పొద్దు లో ప్రకృతిని చూస్తుంటే జీవితం తో పోలిక ఎలా వుంటుందో !

సీతమ్మ వచ్చింది అత్తింటికి,

సీతమ్మ http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=13012

సీతమ్మ లంటి భార్య,శ్రీరాముడు లాంటి భర్త కావాలని కోరుకోని అమ్మాయి కాని ,అబ్బాయి కాని వుంటారా?

శ్రీ రాముడే భర్త గా లభించాక సీతమ్మ పుట్టింటికి ఎందుకు వెళుతుంది.

ఆ స్వామి సేవ లో నే వుంటుందిట గాని పుట్టింటికి మాత్రం పోదట.

Sunday, June 21, 2009

Wednesday, June 10, 2009

సిగ్గు పూబంతి, సీతమ్మ అందాలు

సిగ్గు పూబంతి


సున్నితమైన శృంగారభావన తో ఆహ్లాదం కలిగించే సిగ్గు పూబంతివిసిరే సీతామాలక్ష్మీ.
ఒకప్పుడు పెళ్ళిళ్ళలో ఇలాటి పాటలు వినిపించేవి.సంధర్భాని కో పాట తో సరదగా వుండేది.



సీతమ్మ అందాలు రామయ్యా గోత్రాలు కలిసిన ఎంతా అందమైన జంట.

Friday, June 5, 2009

తోటలో నా రాజు

తోటలో ఆమె రాజు తొంగి చూసాడట , నీటిలో ఈ రోజు నీడ నవ్విందట ! అవి నవ్వులుకావట మరి ? ఏమో ???



వస్తాడా రాడా అనుకున్న రాజు వస్తే ఆ ఆనదమే వేరు.ఇక గడియైనా విడిచి పొకూడదని ఎంత ఆర్దముగా తెలుపుకుంటుందో!





ఉష్.. మెల్లిగా అలిసి పోయిన రాజు ఎక్కడ నిదుర లేస్తాదో అని గాలి నే సడి చేయద్ద్దు అని మందలిస్తొంది ఆ అమ్మాయి .మనలనైతే కొట్టేసుందేమో జాగ్రత్త.

Saturday, May 23, 2009

ఓ మేఘమాల

భలే రాముడు లోనిది ఈ పాట .

Monday, May 18, 2009

చెప్పవే చిరుగాలి

పాతపాటల తో దీటుగా ఈ కాలములోనూ చక్కని సాహిత్యముతో వినసొంపైన పాటలు ఈ కాలములోనూ వున్నాయి.అలాటి వాటిలో ఇదొకటి.

Friday, May 15, 2009

మనసున వున్నది

మనుసులో ఎన్నెన్నో భావాలు కదలాడుతుంటాయి.కాని చెప్పా లంటే మాటలు రావు. ఈ పాట లో ఆ భావన చక్కగా వివరించారు.





నీ సన్నిది లో మాటల కి,హావభావాలే అవసరము లేదు,గాలే గాంధర్వము,మౌనమే మంత్రము అని కవి ఎంత మధురముగా వర్ణించాడు .

Sunday, May 10, 2009

అమ్మ

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మా
ఆ జగన్మాత కరుణా అందరిపై ప్రసరించాలని,
అందరికీ జయము కలగాలని కోరుకుంటున్నాను.
సర్వేజనా సుఖినోభవతు.


Wednesday, May 6, 2009

సిరులోలి కించే చిన్ని నవ్వులే

మా చిన్ని రౌవ్డి గౌరవ్ చాలా అల్లరి వాడు.వాడి చూడగానే
చిన్ని కన్నా నిను చూడగా వేయి కనులైన చాలవురా
ఇన్ని కళ్ళు నిను చూస్తుండగా దిష్థి ఎంత తగిలేనురా

అని పాడుకున్నాను.వాడు అప్పుడప్పుడు పాటలు పాడినా డాన్స్ అంటే చాలా ఇష్థంవాడి శరీరం ఎన్ని వంపులు తిరుగుతుందో.ఈ మద్య పాలకొల్లు వెళ్ళాడు. వాళ్ళ అమ్మమ్మ ఇంటి పక్కనే చిరంజీవి అఫ్ఫిస్ వుందట టి.వి నైన్ వాళ్ళ వాన్ వీళ్ళ ఇంటి ముందే ఆగితే ఆ రొజంతా అందులో నే వుండి చిరంజీవి అంకుల్ డాన్స్ చేసాడట.నాకు అరెరె పాట నేర్పించాలని తెగ కష్ఠ పడ్డాడు.

మా బాబులు,పాపలు కూడా మహరాజుల్లా మహరాణిల్లా ఎదగాలి అని ఈ పాట కుడా ఎప్పుడూ పాడుకుంటూ వుంటాను.నాకు ఈపాట చాలాఇష్ఠం.

Monday, May 4, 2009

ముద్దు గారే యశోదా

బ్రహ్మ మురారి అర్చిత లింగం అని ఏమాత్రము తడబడకుండా స్పస్టముగా పాడుతాడు నా ముద్దుల కన్నయ్య విక్రం .బాగా పాడుతున్నాడు కదా అదితి పాడుతుంది వీడు తబలా వాయిస్త్తాడు అని తబలా కొని టీచర్ ని కుడా పెట్టాను అబ్బే ఈ రొజు వున్న శ్రద్ద రేపువుండదు.నా లాగే అన్నిటిలో ముక్కు దూరుస్త్తాడు.
జు జు జూ అని పాడుతుంటే తెగ నావ్వేవాడు.
వద్దురా కన్నయ్యా నను వదలి పొవద్దురా అని పాడగానే ఎలా అమ్ముమ్మా డాడి వస్తే వెళ్ళాలిగా అని దీనంగా మొహం పెట్టేవాడు.

వాడికోసము నేను పాడిన పాటలలో ఒకటి.

లాలి లాలి లాలీ

తెల్లగా బూరె బుగ్గలతో,నల్లగా మెరిసే కళ్ళతో అపరంజి బొమ్మలా వుండేది మేఘ.నేను ఎటుతిరిగితే అటు కళ్ళు తిప్పుతూ చాలా ముద్దుగా వుండేది.దాన్ని చూడగానే
అల్లారు ముద్దు కదే ,అపరంజి ముద్ద కదే,
తీయని విరితోటకదే ,దివి యిచ్చిన వరము కదే
అని పాడుకున్నాను.మేఘాకీ పాటలంటే ఇస్టం ఏ పాట అయినా ఇట్టే పట్టేస్తుంది .రాధామధు సీరియల్ పాట నాకైతె అర్దము కాలేదు కాని దాని కిమటుకు పూర్తిగావచ్చు.మేఘాకి ఇష్టమైన పాట

ఐ యాం ఎ గుడ్ గర్ల్

నేను నా పిల్లల తో కన్నా మనవరాళ్ళు ,మనవల తోనే ఎక్కువగా గడిపాను,బహుషా వాళ్ళు పుట్టినప్పుడు నేను యు యస్ ఏ వెళ్ళి,పూర్తిగా వాళ్ళతోటే గడిపిందువల్ల కావచ్చు.లేదా అప్పుడు ఏ భాద్యతలు లేకపొవటము వల్ల కావచ్చు .ఏదైనా నాకు నా గ్రాండ్ చిల్డ్రెన్స్ తో అనుబంధం ఎక్కువే.మొదటిసారిగా నాకు సీనియర్ సిటిజన్ షిప్ ఇచ్చింది అదితి.పుట్టగానే చక్కగా కళ్ళు తెరిచి చూసింది.నన్నే అంటే నన్నే అని నేను ,మా అమ్మయి ,మా అల్లుడు పోట్లాడుకుంటామూఅళ్ళము..నేనైతె నన్నే అనుకుంటాను.ఇంట్లో ఇద్దరమే వుండేవాళ్ళము. గొంతెత్తి సిగ్గులేకుండా ఎన్ని పాటలు పాడేదాన్నొ!బంగారు తల్లి అన్నీ చక్కగా వినేది.ఇప్పుడు మా అదితి ఇంత బాగా పాడుతుందంటే ఆ అనుభవమే కదా.అదేంటో ఎవ్వరూ నన్ను మెచ్చుకోరు.మల్లాది వెంకటక్రిష్ణమూర్తి పుస్తకము లోని పాట తో మేము పాడుకోవటము మొదలు పెట్టాము.ఆ పాట
లో లో లో హాయమ్మ హాయి,ఆపదలు కాయి
చిన్ని తండ్రి (తల్లి)ని కాయి శ్రీరంగ సాయి,
అచ్చట్లు ముచ్చట్లు అవ్వలకి ముద్దు,
తప్పట్లు తట్టితే తాతలకు ముద్దు,
జోలల్లు పాడితే పాపలకు ముద్దు,
మా చిన్ని పాప మాకు ముద్దు.-లో
పాప దగ్గర అదితి అని ,ఆతరువాత ఎవరి కోసము పాడితే వారి పేరు అని పాడేదాన్ని. అదితి కి ప్రత్యేకముగా పాడింది ఈ కింది పాట.ఈ పాట పాడటము వలననే అదితి చాలా అల్లరిపిల్ల అయ్యిందట .విడ్డూరము కాకపొతే పాటకే అల్లరి వస్తుందా అయినా పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దవాళ్ళు చేస్త్తారా! ఇప్పుడు ఏమైనా అంటే మేము అస్సలు వొప్పుకొం .టీనేజెర్ అంటే మజాకా.

Monday, April 27, 2009

చందమామ



ఝాము రాతిరి జాబిలమ్మా -క్షణ క్షణం

Monday, April 20, 2009

చందమామ







చిత్రం;మిస్సమ్మ రావోయి చదమామా



చందమామ కోసము

పారిజాతాలు పరిమళాలు వెదజల్లుతుందగా బాల్కనీ లో చిన్న మంచము మీద పడుకొని,కొబ్బరాకుల్లోనుంచి చదమామను చూస్తూ చల్లని వెన్నెల ల ను ఆస్వాదిస్తూ,వెన్నెల పాటలు వింటూ వుంటే అంతకు మించిన స్వర్గము ఎదైనా వుంటుందా?ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యము.వాటిని వర్ణింప నా తరమా!విని ఆనందించాల్సిందే.

కమ్మటి కల

ఈ పాట ముత్యాల ముగ్గు సినిమా లోనిది.ఇందులో కథానాయిక సంగీత మీద ఈ పాట ని చిత్రీకరించారు.నాయిక హావభావాలు,పరిసరాలు చాలా హ్రుద్యముగా వున్నాయి.కనులతో భావాలని పలికించటము బాపు బొమ్మలకే సాద్యమేమొ.
నా కిష్టమైన పాటల లో ఇది ఒకటి.నా ఈ బ్లాగ్ మకుటము ఈ పాట లోనుంచే తీసుకున్నాను.ఒక విధము గా ఇది నా టైటిల్ సాంగ్.
Get this widget | Track details | eSnips Social DNA

Thursday, April 9, 2009

శుక్లాంభర ధరం విష్ణుం.......

నాకు పాటలంటే చాలా ఇష్టం. పిచ్చివాళ్లు పాడుకునే అర్ధం కాని నేటి పాటలు కావు. అలనాటి మధురగీతాలు, అప్పుడప్పుడు వచ్చే ఈనాటి గీతాలు .. కాని ఎప్పుడంటే అప్పుడు అవి వినలేను, ఆస్వాదించలేనుగా..  రేడియొ ,టేప్ రికార్డర్ లేక పోతే పాటలు విన్లేనా!  ఎలా మరి ???

రింగులు తిప్పటము ఆపి సర్దుకు పొవాలి కదా!

ఐ పాడ్ పెట్టుకో అమ్మమ్మ అంటుంది అదితి. దానితో  పాట వినడమేమో కాని నాకైతే  చెవిలో రొద, గింగురులు , ఇంకా చెప్పాలంటే దురద కూడా... మరి ఎట్లా అనుకుంటూ వుంటే  జ్యోతి గారి గీతలహరి, మధురవాణి గారి బ్లాగ్ లోని పాటలు మార్గము చూపించాయి. జ్యోతి గారిలా ఒపిక గా లిరిక్స్ రాసి చెప్పలేను, మధురవాణిగారి లా మధురము గా పరిచయము చెయలేను. కాని వినగలను. అందుకే  ఈ బ్లాగ్. ... కమ్మటి కలలు.... కమ్మటి అనగానే వేడి అన్నము ,ముద్ద పప్పు, ఆవకాయ, నెయ్యి అంటుంది మా అమ్మాయి. అంత కమ్మటి కలలు కనాలి అంటే  మంచి పాటలు ఉండాలిగా ...


నాతో పాటు కావాలంటే  మీరూ  వినవచ్చు. షేరింగ్ ఈస్ ఏ గుడ్ రాబిట్ (సారీ మాకు హ పలకదు.)కదా

ఓం ప్రధమంగా వినాయక స్థుతితో  మొదలు పెడుదాము.

తరువాత బోలెడు పాటలు,  జానపదాలు. ఉషారైన పాటలు, వెన్నెల పాటలు, మల్లెల పాటలు ... అంతే కలల్లోకి వెళ్లిపోండి ...    

Tuesday, April 7, 2009

కమ్మటి కల

నా కు ఇష్టము ఐన పాటల పందిరి ఇది.