Showing posts with label ఆ పాత మధురాలు. Show all posts
Showing posts with label ఆ పాత మధురాలు. Show all posts

Monday, March 30, 2015

నవ్వుల నజరానా "చక్రపాణి."

ఈ రోజు తెలుగుఒన్.కాం లో పబ్లిష్ ఐన నా సమీక్ష.
నవ్వుల నజరానా "చక్రపాణి."
http://www.teluguone.com/tmdb/news/old-telugu-movie-chakrapani-tl-44642c1.html

"చక్రపాణి " పూర్తి సినిమా



ఉయ్యాల జంపాల ఊగరావయ్యా




మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా






Wednesday, May 23, 2012

చిరంజీవులు


వేదాంతం రాఘవయ్య దర్షకత్వం వహించిన " చిరంజీవులు " నేను కాలేజీ లో వుండగా మార్నింగ్ షో చూసాను . ఇది ట్రాజిడీ ఎండింగనీ , ఏడుస్తూ ఇంటికి వళ్ళామని మాత్రమే గుర్తు :) అందుకే సి.డి కోసం ప్రయత్నం చేయలేదు . దీనిలో యన్ టి ఆర్ , జమున గుమ్మడి నటించారు . ఈ సినిమా గురించి నేను ఇంతే చెప్పగలను :)

ఇందులో కొన్ని పాటలు చాలా బాగున్నాయి . అందులో ఈ పాట హైలైట్ .

చికిలింత చిగురు సంపెంగి గుబురు  చినదాని మీద మనసు




కనుపాప కరువైన కనులెందుకో
తన వారే పరులైన బ్రతుకెందుకో



తెలవారవచ్చే తెలియక నా స్వామి  మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళి పరుండేవు మసలుతూ వుండేవు మారాము చాలింక లేరా



ఎందాక ఎందాకా 

కాకపోతే ఈ పాట తమిళ్ వర్షన్ దొరికింది :)



ఏనాటికైనా నీ దాననే

మనసు నీదే మమత నాదే
నాదానవేనే నీవాడనే

Wednesday, January 4, 2012

శాంతినివాసం



1960 లో శ్రీ పిక్చర్స్ బానర్ లో , సుందర్ లాల్ నహతా ,ట్. అశ్వద్దనారాయణ ,సి. యస్ రావు దర్శకత్వంలో నిర్మించిన కుటుంబకథా చిత్రం " శాంతి నివాసం " . ఇంటి ఇల్లాలు గయ్యాళిదైతే , యజమాని నెమ్మదస్తుడైతే , ఇల్లు నరకం గా మారుతుంది . భర్త ఎంతసేపూ పైవాడి దయ అంటూ వుంటాడు . భార్యేమో కోడళ్ళ ను రాచి రంపాన పెడుతూవుంటుంది . ఆడపడుచు అత్తింటి కి వెళ్ళకుండా పుట్టింట్లో నే వుంటూ అందరి మద్యలో పుల్లలు పెడుతూవుంటుంది . భర్త చనిపోయిన పెద్ద కోడలు , ఇద్దరు కొడుకులతో అత్తింట చాకిరీ చేస్తూ వుంటుంది . రెండో కోడలు సాత్వికం గా వుంటూ అందరినీ కలుపుకుపోతూ వుంటుంది . అలాంటి అశాంతినిలయమైన ఇంటికి పెళ్ళి చేసుకొని భార్యను తీసుకు రాదలుచుకోడు మూడో కొడుకు గోపి . కాని రాధ ను భార్యగా తీసుకు రావలసి వస్తుంది . చివరికి ఆ అశాంతినిలయం , శాంతినిలయం గా ఎలా మారుతుందో సినిమా చూడాల్సిందే :)
గయ్యాళి అత్తగా ఇంకెవరు సూర్యకాంతమే వంకపెట్టలేకుండా నటించింది . నెమ్మదస్తుడైన తండ్రిగా నాగయ్య , రెండో కొడుకు కోడలు గా కాంతారావు , దేవిక , మూడో కొడుకు కోడలు గా నాగేశ్వర రావు , రాజసులోచన , పెద్ద కోడలు గా హేమలత , కాంతారావు స్నేహితురాలు రాణి గా కృష్ణకుమారి నటించారు .
ఈ సినిమాలో సూర్యకాంతం గయ్యళితనం లాగే రాజసులోచన జడ కూడా హైలైట్ ! బహుషా ఈ సినిమా వచ్చినప్పుడే అనుకుంటా రాజసులోచన డాన్స్ ప్రోగ్రాం ఇచ్చింది . మా స్కూల్ పిల్లలందరినీ పొలోమంటూ తీసుకెళ్ళి ముందు వరస లో కూర్చోబెట్టారు .

పాటలన్నీ సముద్రాల జూనియర్ రాశారు . ఘంటసాల సంగీతం సమకూర్చారు .

శ్రీరఘురాం , జయరఘురాం . ఈ పాట పాడినది , పి.బి శ్రీనివాస్ , పి. సుశీల , బృందం .



రాగాలా సరాగాలా .ఈ పాట చాలా బాగుంటుంది కాని ఇందులో దేవిక భర్తకు చేసే సేవలను చూస్తే కళ్ళు గిర్రున తిరిగిపోతాయి :) ఈ పాట పాడినది , పి. సుశీల , ఘంటసాల .

రావే రాధా రాణీ రావే .ఈ పాట పాడినది , ఘంటసాల , జిక్కి .



కం కం కంగారు నీకేలనే ఈ రెండు పాటలల్లో బృందావనం గార్డెన్ బాగా చూపిస్తారు . ఈ పాట పాడింది ఘంటసాల , జిక్కి .
ఈ తుషార శీతల సరోవరాన
అనంత నీరవ నిశీధిలోనా ఈ కలువ నిరీక్షణ ,
నీ కొరకే రాజా వెన్నెల రాజా . . .
నా కిష్టమైన పాటలలో ఇది కూడా వకటి :)



Monday, June 13, 2011

భలే రాముడు



నారాయణ మూర్తి కి కళలంటే మహా ప్రీతి . అందుకని తన కూతుళ్ళిద్దరు , రూప , తార కు భరతనాట్యము నేర్పిస్తుంటాడు . లలిత కళలను పోషించేందుకోసం థియేటర్ కూడా నిర్మించి , అందులో రూప , తార ల తో నృత్య ప్రదర్షన ఇప్పిస్తాడు . నారాయణ మూర్తి దగ్గర మేనేజర్ గా పని చేసే నాగభూషణానికి రాము , గోపి ఇద్దరు కొడుకులు .రాము కొంచము దుడుకు వాడు . రూప నాట్యప్రదర్షన రోజున చెరువు లోనుంచి తామర పూవులు తెచ్చి రూపకు ఇచ్చి , తండ్రి తో చివాట్లు తింటాడు . ఇంకోరోజు తన చేతిమీద " రాము " అని పచ్చ బొట్టు పొడిపించుకొని , అటుగా వస్తున్న రూపను కూడా పచ్చబొట్టు పొడిపించుకోమని చెపుతాడు . అందుకు రూప కోపగించి , ఇంటికి వెళ్ళి , నాగభూషణానికి రాము మీద కంప్లేయింట్ చేస్తుంది . నాగభూషణము రామూ ను కొడతాడు . అది చూసి రూప రామూ ను వెక్కిరిస్తే రాము , రూపను తోసేస్తాడు . రూప మెట్లమీద నుంచి పడిపోతుంది . రూప కాలు విరుగుతుంది . డాక్టర్ రూపకు కాలు రావటము కష్టము అని చెపుతాడు . దానితో నారాయణమూర్తి రామూ పై కోపము తెచ్చుకొని పిస్టోల్ తో కాలుస్తానని వెంట పడగా రామూ పరిగెత్తుతాడు . రామూను ఆగమని అర్స్తుండగా నారాయణ మూర్తి చేతిలోని పిస్తోలు పొరపాటున పేలుతుంది . రాము వంతెన మీది నుంచి నది లో పడిపోతాడు . నా కొడుకును చంపేసావు , నిన్ను పోలీసులకు పట్టిస్తాను అని నాగభూషణము కోపముగా వెళుతాడు .
నారాయణ మూర్తి ని పోలీసులు పట్టుకొని వెళ్ళారా ?
నది లో పడిపోయిన రాము ఏమైనాడు ?
రూప , తార ఏమయ్యారు ?
ఈ ప్రశ్నలన్నింటి కి జవాబు . . . .

ఆ ((((( భలే ఆశే !!!!! నేను చెప్పను . ఆ కథ వెండితెరపై చూడుడు :)))))
ఆవెండితెర పేరు " భలేరాముడు " .
దానిని నిర్మించినది ; వి. యల్ . నరసు .
దర్షకత్వము : వేదాంతము రాఘవయ్య .
కథా రచయిత ; వెంపటి సదాశివ బ్రహ్మం .
సంగీత దర్షకత్వం ; సాళూరి రాజేశ్వరరావు .
విడుదల తేదీ ; ఏప్రిల్ 6, 1956 .
నటీనటులు , గాయనీ గాయకులు ఎవరంటారా ???
అబ్బా * * * ఇంక నాకు చెప్పే వోపిక లేదు మీరే సినిమా చూసి తెలుసుకోండి . . .

స్చప్ . . . అదేమిటో ఈ రోజు చూసే సరికి యుట్యూబ్ వాడి విడిఓలు తీసెసాడు . ఈ మద్య వాళ్ళ టైం ఐపెయింది అని తీసెస్తున్నారు :) ఈ స్నిప్స్ వాడు కూడా తీసేసాడు . మళ్ళీ అన్నీ మార్చుకోవాలి .

ఈ సినిమా లోని ఈ పాట వక్కటే దొరికింది . అది " ఓహో మేఘమాలా "




Sunday, June 13, 2010

బాలానందం



మా చిన్నప్పుడు ప్రతి శని/ఆదివారం 2. 30 కు బాలానందం వినటము , అందులోని పాటలు నేర్చుకోవటం తప్పనిసరి . మానుకోటలో వున్నప్పుడు మా పక్కింటి అమ్మమ్మగారు , మెతులు , పసుపు ,కాగితాలు నానవేసి , మెత్తగా రుబ్బి , చిన్న చిన్న గిన్నెలకు బాగా మందంగా రాసి ఎండబెట్టేవారు . అవి బాగా ఎండాక చక్కగా చిన్న చిన్న గిన్నెల లా వూడి వచ్చేవి . ముద్దుగా ఎంత బాగుండేవో ! వాటిల్లో పుట్నాల పప్పు , అటుకులు , బెల్లం వేసి మాకందరికీ ఇచ్చేవారు . బాలానందం పాటలు , అటలు ఆడి , పాటలు పాడి అలసి వచ్చానే , బుజ బుజ రేకుల పిల్లుందా పాడిస్తూ బొమ్మలపెళ్ళి ఆటలు ఆడించేవారు . ఈ గిన్నెల సంగతి మరచి పోయాను కాని ఆ పాటలు రెండూ అలా అలా స్మృతిపధం లో పోయాయి . బుజ బుజ రేకుల పాట ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు .
మళ్ళీ ఇన్ని ఏళ్ళకు కల్పనా రెంటాల గారు , మరువం ఉషా గారు ,బాల్యస్మృతులను తట్టి లేపే ప్రయత్నం చేసారు . లలితజి గారు ఆ పాటలను ఇచ్చారు . వారికి చాలా చాలా ధన్యవాదాలు .

----------
బుజ బుజ రేకుల పిల్లుందా
బుజ్జా రేకుల పిల్లుందా
స్వామీ దండల పిల్లుందా
స్వరాజ్యమిచ్చిన పిల్లుందా

బుజ బుజ రేకుల పిల్లుందీ
బుజ్జా రేకుల పిల్లుందీ
స్వామీ దండల పిల్లుందీ
స్వరాజ్యమిచ్చిన పిల్లుందీ


పిల్ల పేరేంటి
మహలక్ష్మి

బుజ బుజ రేకుల కేం నగలు
బుజ్జా రేకుల కేం నగలు
స్వామీ దండల కేం నగలు
స్వరాజ్యమిచ్చిన వేం నగలు

..... నెలవంకా

బుజ బుజ రేకుల మాకొద్దు
బుజ్జా రేకుల మాకొద్దు
స్వామీ దండల మాకొద్దు
స్వరాజ్యమిచ్చిన మాకొద్దు

బుజ బుజ రేకుల జడగంటుంది
బుజ్జా రేకుల వడ్ఢాణముంది
స్వామీ దండల కాసులపేర్
స్వరాజ్యమిచ్చిన రత్నాలపేర్

బుజ బుజ రేకుల మాకొద్దు
బుజ్జా రేకుల మాకొద్దు
స్వామీ దండల మాకొద్దు
స్వరాజ్యమిచ్చిన మాకొద్దు

బుజ బుజ రేకుల కేం కావాలి
బుజ్జా రేకుల కేం కావాలి
స్వామీ దండల కేం కావాలి
స్వరాజ్యమిచ్చిన ఏం కావాలి

బుజ బుజ రేకుల విద్యా జ్ఞానం
విద్యకు తగిన వినయం శాంతం
సంగీత సాహిత్య జ్ఞానం
కలిగుందా మీ మహలక్ష్మి?

విద్యా జ్ఞానం కలిగుంది

వినయం శాంతం కలిగుంది
గానం గాత్రం కలిగుంది,
..... మహలక్ష్మి

మరి మీ పిల్లాడూ?
మీ పిల్లాడి పేరేంటి?

మాధవుడు

మరి మీ మాధవుడికి,

బుజ బుజ రేకుల చదువుందా
బుజ్జా రేకుల గుణముందా
చదువూ, గుణమూ, సంపదలూ
కలిగున్నాడా, మాధవుడు?

బుజ బుజ రేకుల చదువుంది
బుజ్జా రేకుల గుణముంది
చదువూ, గునమూ, సంపదలూ
కలిగున్నాడూ, మాధవుడు?

కట్నాలేంటి?

బుజ బుజ రేకుల కట్నాలొద్దు
బుజ్జా రేకుల కానుకలొద్దు
కట్నం కానుకలన్నిటికీ
సరి అవుతుందీ మహలక్ష్మి

ఆనంద మానంద మాయెనే
మా మహలక్ష్మి పెళ్ళి కూతురాయెనే
ఆనంద మానంద మాయెనే
మా మాధవుడు పెళ్ళి కొడుకాయెనే


ఆటలు ఆడీ పాటలు పాడి :

ఆటలు ఆడీ పాటలు పాడి అలసీ వచ్చానే
తియ్యా తియ్యని తాయిల మేదో తీసి పెట్టమ్మా

పిల్లీ పిల్లా కళ్ళూ మూసీ పీటా ఎక్కిందీ
కుక్కా పిల్లా తోకాడిస్తూ గుమ్మామెక్కీందీ
కడుపులోనీ కాకీ పిల్లా గంతులు వేస్తోందీ
తియ్యా తియ్యని తాయిల మేదో తీసీ పెట్టమ్మా
గూటీ లోనీ బెల్లం ముక్కా కొంచం పెట్టమ్మా
చేటాలోనీ కొబ్బరి కోరూ చారెడు తీయమ్మా
అటకా మీది అటుకుల కుండా అమ్మా దింపమ్మా
తియ్యా తియ్యని తాయిల మేదో తీసీ పెట్టమ్మా - - - -

Tuesday, June 8, 2010

మహామంత్రి తిమ్మరుసు



1962 సంవత్సరం లో . కమలాకర కామేశ్వర రావు డైరెక్ట్ చేసిన చిత్రం ' మహామంత్రి తిమ్మరుసు .' గుమ్మడి తిమ్మరుసు పాత్రను , ఎన్. టీ . ఆర్ శ్రీకృష్ణదేవరాయులుగా చాలా గొప్పగా నటించారు . కృష్ణ దేవరాయుడు కురూపి అన్నా నమ్మలేంత అందంగా ఉన్నాడు ఎన్. టి .ఆర్ . తిమ్మరుసు ఇలాగే మంత్రాంగం చేసి ,కృష్ణదేవరాయుని కాపాడే వాడేమో అనిపించేంతగా తిమ్మరుసుగా జీవించాడు గుమ్మడి . అప్పాజీ అని అభిమానంగా పిలుస్తూ , అన్ని విషయలాలో తిమ్మరుసు సలహాలను పాటించే కృష్ణదేవరాయుడు , చెప్పుడు మాటలు విని అప్పాజీ కన్నులు వూడబెరికించి , కారాగా శిక్ష విధించటము , తలుచుకుంటే ఇప్పటికీ గుండెను పిడేసినట్లుగా వుంటుంది . చాలా గొప్ప క్లాసికల్ మూవి . చూసి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడే చూసినట్లుగా వుంటుంది .

ఇందులోని పాటలు పింగళి నాగేశ్వరరావు రచించగా , పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు . ఘంటశాల , పి. సుశీల , పి . లీల , వరలక్ష్మి గానామృతాన్ని పంచారు .
ఆ పాటలు కొన్ని ,

మోహనరాగ మహా మూర్తి మంత మాయే




లీలా కృష్ణా , నీ లీలలు నే లీలగ నైనా తెలియనుగా



జయవాణీ చరణ కమల సన్నిధి మన సాధన



తిరుమల తిరుపతి వెంకటేశ్వరా కూరిమి వరముల కురుయుమయా




దేశ భాష లందు తెలుగు లెస్సా




చరిత్ర ఎరుగని మహా పాతకం మా దేశానికి పట్టినదా

Get this widget | Track details | eSnips Social DNA

Monday, March 8, 2010

కోయిల




కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది




కుహు కుహు అనే కోయిలా




మావిచిగురు తినగానే కోయిల పలికేనా





కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి .


అది మన వూరి కోకిలమ్మా , నిన్నడిగింది కుశలమమ్మా