Sunday, June 13, 2010
బాలానందం
మా చిన్నప్పుడు ప్రతి శని/ఆదివారం 2. 30 కు బాలానందం వినటము , అందులోని పాటలు నేర్చుకోవటం తప్పనిసరి . మానుకోటలో వున్నప్పుడు మా పక్కింటి అమ్మమ్మగారు , మెతులు , పసుపు ,కాగితాలు నానవేసి , మెత్తగా రుబ్బి , చిన్న చిన్న గిన్నెలకు బాగా మందంగా రాసి ఎండబెట్టేవారు . అవి బాగా ఎండాక చక్కగా చిన్న చిన్న గిన్నెల లా వూడి వచ్చేవి . ముద్దుగా ఎంత బాగుండేవో ! వాటిల్లో పుట్నాల పప్పు , అటుకులు , బెల్లం వేసి మాకందరికీ ఇచ్చేవారు . బాలానందం పాటలు , అటలు ఆడి , పాటలు పాడి అలసి వచ్చానే , బుజ బుజ రేకుల పిల్లుందా పాడిస్తూ బొమ్మలపెళ్ళి ఆటలు ఆడించేవారు . ఈ గిన్నెల సంగతి మరచి పోయాను కాని ఆ పాటలు రెండూ అలా అలా స్మృతిపధం లో పోయాయి . బుజ బుజ రేకుల పాట ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు .
మళ్ళీ ఇన్ని ఏళ్ళకు కల్పనా రెంటాల గారు , మరువం ఉషా గారు ,బాల్యస్మృతులను తట్టి లేపే ప్రయత్నం చేసారు . లలితజి గారు ఆ పాటలను ఇచ్చారు . వారికి చాలా చాలా ధన్యవాదాలు .
----------
బుజ బుజ రేకుల పిల్లుందా
బుజ్జా రేకుల పిల్లుందా
స్వామీ దండల పిల్లుందా
స్వరాజ్యమిచ్చిన పిల్లుందా
బుజ బుజ రేకుల పిల్లుందీ
బుజ్జా రేకుల పిల్లుందీ
స్వామీ దండల పిల్లుందీ
స్వరాజ్యమిచ్చిన పిల్లుందీ
పిల్ల పేరేంటి
మహలక్ష్మి
బుజ బుజ రేకుల కేం నగలు
బుజ్జా రేకుల కేం నగలు
స్వామీ దండల కేం నగలు
స్వరాజ్యమిచ్చిన వేం నగలు
..... నెలవంకా
బుజ బుజ రేకుల మాకొద్దు
బుజ్జా రేకుల మాకొద్దు
స్వామీ దండల మాకొద్దు
స్వరాజ్యమిచ్చిన మాకొద్దు
బుజ బుజ రేకుల జడగంటుంది
బుజ్జా రేకుల వడ్ఢాణముంది
స్వామీ దండల కాసులపేర్
స్వరాజ్యమిచ్చిన రత్నాలపేర్
బుజ బుజ రేకుల మాకొద్దు
బుజ్జా రేకుల మాకొద్దు
స్వామీ దండల మాకొద్దు
స్వరాజ్యమిచ్చిన మాకొద్దు
బుజ బుజ రేకుల కేం కావాలి
బుజ్జా రేకుల కేం కావాలి
స్వామీ దండల కేం కావాలి
స్వరాజ్యమిచ్చిన ఏం కావాలి
బుజ బుజ రేకుల విద్యా జ్ఞానం
విద్యకు తగిన వినయం శాంతం
సంగీత సాహిత్య జ్ఞానం
కలిగుందా మీ మహలక్ష్మి?
విద్యా జ్ఞానం కలిగుంది
వినయం శాంతం కలిగుంది
గానం గాత్రం కలిగుంది,
..... మహలక్ష్మి
మరి మీ పిల్లాడూ?
మీ పిల్లాడి పేరేంటి?
మాధవుడు
మరి మీ మాధవుడికి,
బుజ బుజ రేకుల చదువుందా
బుజ్జా రేకుల గుణముందా
చదువూ, గుణమూ, సంపదలూ
కలిగున్నాడా, మాధవుడు?
బుజ బుజ రేకుల చదువుంది
బుజ్జా రేకుల గుణముంది
చదువూ, గునమూ, సంపదలూ
కలిగున్నాడూ, మాధవుడు?
కట్నాలేంటి?
బుజ బుజ రేకుల కట్నాలొద్దు
బుజ్జా రేకుల కానుకలొద్దు
కట్నం కానుకలన్నిటికీ
సరి అవుతుందీ మహలక్ష్మి
ఆనంద మానంద మాయెనే
మా మహలక్ష్మి పెళ్ళి కూతురాయెనే
ఆనంద మానంద మాయెనే
మా మాధవుడు పెళ్ళి కొడుకాయెనే
ఆటలు ఆడీ పాటలు పాడి :
ఆటలు ఆడీ పాటలు పాడి అలసీ వచ్చానే
తియ్యా తియ్యని తాయిల మేదో తీసి పెట్టమ్మా
పిల్లీ పిల్లా కళ్ళూ మూసీ పీటా ఎక్కిందీ
కుక్కా పిల్లా తోకాడిస్తూ గుమ్మామెక్కీందీ
కడుపులోనీ కాకీ పిల్లా గంతులు వేస్తోందీ
తియ్యా తియ్యని తాయిల మేదో తీసీ పెట్టమ్మా
గూటీ లోనీ బెల్లం ముక్కా కొంచం పెట్టమ్మా
చేటాలోనీ కొబ్బరి కోరూ చారెడు తీయమ్మా
అటకా మీది అటుకుల కుండా అమ్మా దింపమ్మా
తియ్యా తియ్యని తాయిల మేదో తీసీ పెట్టమ్మా - - - -
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
తురగ జానకిరాని గారి అద్వర్యం లో ప్రతి ఆదివారం బాలనందాన్ని
అప్రతిహతం గా ఏలిన వాళ్ళలో నేను , ఫనిసుందర్ , సుబ్రమణ్ ఎస్వరి ,
అన్నపూర్ణ , లక్ష్మి నర్సు , రామాచారి ఎందరో .మేము సైతం బాలనందానికి
మా వంతు పాత్రల్ని పోషించాము .
మీ చిన్నప్పటి స్మృతులు కదపగలిగినందుకు సంతోషం. మరొక పాట వెదుకుతూ ఇటు వచ్చాను. నా పేరు చూసి కాస్త ఆశ్చర్యపడ్డాను.
రవి గారు ,
మీకు బాలానందం తో వున్న అనుభంధాన్ని తెలిపినందుకు సంతోషమండి .
ఉష గారు ,
మీరు పాటలు వెతుకుంటూ నా బ్లాగ్ కు రావటమా ఎంత అదృష్టమండి .
నేను ఇక్కడ చెప్పినది అష్టాచెమ్మా గురించండి .
థాంక్ యు.
Post a Comment