Monday, June 28, 2010
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
అడగక ఇచ్చిన ముద్దే ముద్దు
అందీ అందని అందమే ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు .
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
తీగల పై వూగుతూ , పూవుల పై తూగుతూ
తీగల పై వూగుతూ పూవులపై వూగుతూ
ప్రకృతి నెల్ల హాయిగా , తీయగా
మాయగా పరవసింప జేయుచూ
ఎవరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే
చెలుని కోసం చెలి మందహాసం ఏమని వివరించునో
గడుసరి ఏమని వివరించునో
ఐనదేమో ఐనది ప్రియ గాన మేదే ప్రేయసి
ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసి
ప్రేమ గానము సాగ గానే భూమి స్వర్గం ఐనది
ఐనదేమో ఐనది
పరుగులు తీసే నీ వయసునకు పగ్గము వేసెను నా మనసు
ఉరకలు వేసే నా మనసునకు ఉసి గొలిపెనులే నీ సొగసు
చిగురులు వేసిన కలలన్ని సిగలో పూలు గ మారినవి
మనసున పొంగిన అలలన్ని మమతల తీరం చేరినవి
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
మీ కమ్మటి కలలు బ్లాగు నాకు ఎప్పుడు కమ్మగ వుంటాయి. మీ బ్లాగుల్లో అన్నింటిలో కమ్మటి కలలు నాకు చాల ఇష్టం.
అశోక్ ,
థాంక్ యు .
Post a Comment