Showing posts with label నవల/సినిమా. Show all posts
Showing posts with label నవల/సినిమా. Show all posts

Friday, December 21, 2012

మిధునం

మిధునం సినిమా గురించి ఇక్కడ చదవండి .

Friday, June 17, 2011

చండీప్రియ




పోల్కంపల్లి శాంతాదేవి వ్రాసిన నవల " చండీ ప్రియ " ఆధారముగా " చండీప్రియ " సినిమాను అంజలీ పిక్చర్స్ వారు 1980 లో నిర్మించారు . పూర్తి రివ్యూ ను చిత్రమాలిక లో చదవండి .

సినిమాను ఇక్కడ చూడండి .

ఇంక కొన్ని పాటలిదిగోండి .











Tuesday, May 24, 2011

గుండమ్మ కథ



విజయా వారి చిత్ర్తాల గురించి వ్రాయాలని ఓ సంవత్సరం గా ప్రయత్నం . ఎక్కడా మహా బద్దకం :) అనుకోవటము లోనే అలా అలా గడిచిపోయింది :) ఇదో ఇన్నాళ్ళకు చిత్రమాలిక కోసం "గుండమ్మ కథ " రాశాను . ఇంకేం కథ అక్కడ చదవండి . సినిమా ఇక్కడ చూడండి . హాయిగా నవ్వుకోండి . అక్కడక్కడ కనువిందు చేసే విజయావారి చంద్రుని చూసి ఆనందించండి . అన్నట్లు కమ్మటి పాటలు , వాటి చిత్రీకరణ చూసి ఆనందించిండి . పదండి మరి . . . . .

































Tuesday, May 3, 2011

కన్యాశుల్కం



ఒక శతాబ్ధం కిందట సమాజం లో , ముఖ్యం గా బ్రాహ్మణ కుటుంబాలలో వున్న , 'కన్యాశుల్కం' అనే దురాచారం గురించి రాసిన నాటకం కన్యాశుల్కం . ఇది గురజాడ అప్పారావు గారు 1892 వ ప్రాంతం లో రచించారు . ఆనాటి స్తితిగతులను ఇందులో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు . ఆడపిల్లలను పసితనం లోనే డబ్బు కక్కుర్తికి ముసలివారికి ఇచ్చి వివాహం జరిపించేవారు . ఆ ముసలి వారికి చాకిరీ చేసేందుకోసం వీరు నియమించబడేవారు . ఆ అమ్మాయికి వూహతెలిసే సమయానికే విధవైపోయేది పాపం . అప్పటి నుంచి ఓపిక వున్నన్ని సంవత్సరాలు అత్తింటనో , పుట్టింటనో చాకిరీ చేయటమే సరిపోయేది . వారి జీవితం ధుర్భరం గా గడి చేది .
కన్యాశుల్కం రూపుమాసిపోయినా , ఆడపిల్లలకు చిన్నతనములోనే వివాహం జరిపించటము మటుకు తగ్గలేదు . ఆ తరువాతి కాలం లో తురష్కులు గ్రామాల మీద పడి దోచుకునేటప్పుడు , ఆడపిల్లలని కూడా ఎత్తుకుపోయే వారట . కాకపోతే పెళ్ళైన అమ్మాయిలను ఎత్తుకెళ్ళేవారు కారుట . అందుకని అమ్మాయిలకు 8 సంవత్సరములు నిండ కుండానే వివాహం చేసేవారట .( ఈ సంగతి నాకు మా తాతగారు చెప్పారు .) అప్పుడూ యుక్తవయస్సు వచ్చేసరికే విధవలై పోవటము తప్పలేదు ! కాల క్రమేణ ' శారదా ఆక్ట్ ' అంటే వ్యక్తురాలు కాని అమ్మాయి కి పెళ్ళి చేయకూడదు అనే రూల్ వచ్చినా అలాగే దొంగతనం గా చేసేవారు . ప్రస్తుతమైతే 18 సంవత్సరాలు నిడకుండా అమ్మాయి పెళ్ళి చేయకూడదు అని రూల్ వుందనుకోండి . ఐతే వరకట్న బాధ వచ్చిందిగా ! ఏరాయైతేనేమి పళ్ళూడ గొట్టు కోవటానికి ? అప్పుడూ , ఇప్పుడూ , ఎప్పుడూ అమ్మాయికి ఏదోవిధం గా కష్టాలు తప్పటం లేదు !!!

కన్యాశుల్కం నాటకం ఆధారం గా 1955 లో డి.యల్ గారు పి. పుల్లయ్య దర్శకత్వం లో సినిమా తీసారు ఆ విశేషాలని చిత్రమాలిక లో చదవండి . అది నేనే రాశాను లెండి . ఆ చిత్రం పాటలు కమ్మటి కలలు లో వినండి :)

అన్నట్లు ఈ కింద చిత్రం లో వున్న ఫొటోలు , కన్యాశుల్కం లో గురజాడ వారు వర్ణించిన , అప్పటి విజయనగర వీధులు :_




ఇంక పాటలలో యంటి ఆర్ నూ , సావిత్రి నీ , జానకీ వగైరాలను చూడండి .


















Tuesday, April 19, 2011

దొంగమొగుడు



యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన "నల్లంచు తెల్ల చీర " నవల ఆధారముగా , మహేశ్వరీ ఫిలంస్ వారు తీసిన సినిమా " దొంగ మొగుడు " . ఇందులో నాయకుడుగా చిరంజీవి ద్విపాత్రాభినయనంచేయగా , మాధవి , రాధిక , భానుప్రియ నాయికలుగా నటించారు .
నిర్మాత ; వెంకన్నబాబు ,
దర్శకత్వం ; కోదండరామి రెడ్డి .
పాటల రచయతలు : కోసరాజు ,
సీతారామ శాస్త్రి ,
రాజశ్రీ .
గాయనీ గాయకులు ; యస్.పి బాలసుబ్రమణ్యం ,
పి. సుశీల
యస్ . జానకి ,
యస్.పి శైలజ .
సంగీత దర్శకత్వం ; చక్రవర్తి ,
సహాయకులు ; కృష్ణ ,
చక్రి .
ఈ సినిమా గురించి అక్కడ చదవండి . కొన్ని పాటలు ఇక్కడ చూడండి :)