Thursday, April 9, 2009

శుక్లాంభర ధరం విష్ణుం.......

నాకు పాటలంటే చాలా ఇష్టం. పిచ్చివాళ్లు పాడుకునే అర్ధం కాని నేటి పాటలు కావు. అలనాటి మధురగీతాలు, అప్పుడప్పుడు వచ్చే ఈనాటి గీతాలు .. కాని ఎప్పుడంటే అప్పుడు అవి వినలేను, ఆస్వాదించలేనుగా..  రేడియొ ,టేప్ రికార్డర్ లేక పోతే పాటలు విన్లేనా!  ఎలా మరి ???

రింగులు తిప్పటము ఆపి సర్దుకు పొవాలి కదా!

ఐ పాడ్ పెట్టుకో అమ్మమ్మ అంటుంది అదితి. దానితో  పాట వినడమేమో కాని నాకైతే  చెవిలో రొద, గింగురులు , ఇంకా చెప్పాలంటే దురద కూడా... మరి ఎట్లా అనుకుంటూ వుంటే  జ్యోతి గారి గీతలహరి, మధురవాణి గారి బ్లాగ్ లోని పాటలు మార్గము చూపించాయి. జ్యోతి గారిలా ఒపిక గా లిరిక్స్ రాసి చెప్పలేను, మధురవాణిగారి లా మధురము గా పరిచయము చెయలేను. కాని వినగలను. అందుకే  ఈ బ్లాగ్. ... కమ్మటి కలలు.... కమ్మటి అనగానే వేడి అన్నము ,ముద్ద పప్పు, ఆవకాయ, నెయ్యి అంటుంది మా అమ్మాయి. అంత కమ్మటి కలలు కనాలి అంటే  మంచి పాటలు ఉండాలిగా ...


నాతో పాటు కావాలంటే  మీరూ  వినవచ్చు. షేరింగ్ ఈస్ ఏ గుడ్ రాబిట్ (సారీ మాకు హ పలకదు.)కదా

ఓం ప్రధమంగా వినాయక స్థుతితో  మొదలు పెడుదాము.

తరువాత బోలెడు పాటలు,  జానపదాలు. ఉషారైన పాటలు, వెన్నెల పాటలు, మల్లెల పాటలు ... అంతే కలల్లోకి వెళ్లిపోండి ...    

No comments: