Friday, April 20, 2012
సంక్రాంతి
ఈ మద్య వచ్చిన సినిమాలల్లో నాకు నచ్చింది "సంక్రాంతి". పాతకాలం సినిమాలలాంటి చక్కని కుటుంబ కథా చిత్రం సంక్రాంతి . నలుగురు అన్నదమ్ములు , తల్లీ తండ్రి కలిసి వున్న కుటుంబం మధ్య లో వుండే ఆప్యాయతలు , చిన్న చిన్న అపార్ధాలు , వాటిని తొలిగించుకొని , అర్ధం చేసుకున్న విధానము అన్నీ చక్కగా చూపించారు .
రాఘవేంద్ర ( వెంకటేష్), విష్ణు ( శ్రీకాంత్), చిన్న (శివబాలాజి), వంశి ( శర్వానంద్) నలుగురు అన్నదమ్ములు . వారి తల్లి ( శారద) , తండ్రి ( చంద్రమోహన్) అందరూ కలిసి వుంటారు . రాఘవేంద్ర పద్మ ( ఆర్తీ అగర్వాల్ ) ను ప్రేమిస్తాడు . పద్మ మేనమామ కూతురే కావటం తో పెద్దల అభీష్టం తో పెళ్ళి నిశ్చయం అవుతుంది . ఇంతలో రోడ్ వైడెనింగ్ లో రాఘవేంద్ర వాళ్ళ షాప్ పోయి ,నష్టపోతారు . అందరినీ వదిలి వస్తే ఈ పెళ్ళి చేస్తామని పద్మ తల్లి తండ్రులంటారు . కాని రాఘవేద్ర ఒప్పుకోడు . కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని ఒక దారికి తెస్తారు రాఘవేంద్ర , విష్ణు .అంజలి అనే మంచి మనసున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు . పద్మ తన తప్పు తెలుసుకొని బాధపడి , తన చెల్లెలిని విష్ణు కిచ్చి వివాహం జరిపిస్తుంది . విష్ణు భార్య (సంగీత) అసూయ వలన కుటుంబంలో కొన్ని కలతలు వచ్చి సద్దుకుంటాయి . చిన్న ప్రేమించిన అమ్మాయి తో పెళ్ళి చేసేందుకు ఆమె తండ్రి ( ప్రకాశ్ రాజు ) ముందు ఒప్పుకోకపోయినా ఆ తరువాత ఆ కుటుంబ లో వున్న ఆప్యాయతలను , కట్టుబాటు ను నచ్చి పెళ్ళికి వొప్పుకుంటాడు . సంక్షిప్తంగా కథ ఇది .
ఈ సినిమా నిర్మాత ; ఆర్. బి చౌదరి
డైరక్టర్;ముప్పలనేని శివ
రచయతలు ; లింగశ్వామి
పరచూరి బ్రదర్స్
సంగీతం; యస్.ఏ రాజకుమార్
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట . ..
మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ
చిలకా చిలకపట్టుల చీరే కట్టిందోయ్
ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment