ఈ రోజు బోర్ కొడుతుంటే "చోరి చోరి" సినిమా చూస్తూ కూర్చున్నాను . అదేమిటో ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా విసుగనిపించదు . పాటలు కూడా మళ్ళీ మళ్ళి వినేలా వుంటాయి .
కోటీశ్వరుడు గిరిధర్ లాల్ గారాల పట్టి, కమ్ము ( నర్గిస్) . సుమన్ కుమార్ (ప్రేం ) ను ప్రేమిస్తుంది . కాని తండ్రి వారి ప్రేమను అంగీకరించడు . తండ్రి మీద కోపం తో సుమన్ కుమార్ దగ్గర కు వెళ్ళేందుకు ఇంట్లో నుంచి పారిపోతుంది .గిరిధర్ లాల్ కమ్మును వెతికి తెచ్చిన వారికి 1.25 లక్షల రూపాయలు బహుమతి ప్రకటిస్తాడు . ఇంట్లో నుంచి పారిపోయిన కమ్ము విచిత్ర పరిస్థితులలో సాగర్ (రాజ్ కపూర్ ) ను కలుస్తుంది . నాలుగు రోజులు రకరకాల పరిస్తితులలో చిక్కుకొని , ఇంటి కి తిరిగి వస్తుంది . ఆ నాలుగు రోజులలో జరిగిన విశేషాలను , చివరి కి ఏమి జరిగింది అన్నది సినిమా చూస్తేనే బాగుంటుంది కదా :)
నిర్మాత :యల్. బి లక్ష్మణ్ ,
డైరెక్టర్ ; అనంత్ ఠాకుర్ ,
రచయత ; ఆగా జాని ,
సంగీతం; శంకర్ ఝై కిషన్ ,
గాయనీ గాయకులు ;మన్నాడే , మహ్మద్ రఫీ ,లతా మంగేష్కర్, ఆశాబోస్లే .
2 comments:
చోరీ చోఈ లో పాటలన్నీ సూపరే ! "ఆజా సనమ్" పాడటంలో సంచరీ కొట్టి ఉంటాను చదువుకునే రోజుల్లో :) ఇది కాక "రసిక్ బల్మా", "ఏ రాత్ భీగీ భీగీ " కూడా నాకు బాగా ఇష్టం. ఇదే సినిమాని మహేష్ భట్ "దిల్ హై కి మాన్తా నహీ" పేరుతో కూతురు పూజాభట్,అమీర్ ఖాన్ లతొ తీసారండి. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. పాటలు కూడా బాగుంటాయి.
తృష్ణ గారు ,
మీ కామెంట్ కు థాంక్స్ అండి . అవునండి దిల్ హై కి మాన్ తా నహీ ఇదే సినిమా . అసలు చొరీ చొరీ హాలీవుడ్ సినిమా 'ఇట్ హాపెండ్ వన్ నైట్ ' అట. వికిపీడియాలో వుంది .
Post a Comment