Sunday, August 1, 2010
బంగారుపంజరం
శోభన్ బాబు నాయకుడు , వేణు గా , వాణిశ్రీ , నాయిక నీల గా 1969 లో ' బంగారు పంజరం ' చిత్రం రిలీజ్ ఐయింది . నారాయణగూడా లోని , దీపక్ మహల్ లో ఈ సినిమా చూసాను . ఈ సినిమా , ఇందులోని పాటలు , ప్రకృతి అందాలు నాకెంత గానో నచ్చాయి . అందుకే మావారు శెలవలో వచ్చినఫ్ఫుడు , ఆయన తో కలిసి మళ్ళీ చూసాను . అప్పటి వరకు నేను సినిమాలు చూడటమే తక్కువ . అందులోనూ రెండో సారి చూసానంటే ఎంతగా నచ్చిందో మరి .
నల్లమల అడువులలో మేకలను కాసుకుంటూ తిరిగే అమాయకురాలు , పల్లెటూరి అమ్మాయి నీల . శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఇంజనీర్ గా వస్తాడు వేణు . నీల అమాయకత్వం , అందం అతనిని ఆకర్షిస్తాయి . పెళ్ళిచేసుకొని తన వూరికి తీసుకెళుతాడు . అక్కడ వారిద్దరి దాంపత్యం , నీల అక్కడ ఇమిడేందుకు పడే ఇబ్బందులతో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి .చిత్రం ఆద్యంతమూ చాలా చక్కగా చిత్రీకరించారు . పాటలు కూడా చాలా చాలా వినసొంపుగా వున్నాయి . కథ నాకంత గా గుర్తులేదు కాని , పాటలు మాత్రం తరుచుగా వింటూ వుంటాను.
సినిమా డైరెక్టర్ ; బి . యన్ . రెడ్డి ,
పాటల రచయత ; దేవులపల్లి కృష్ణ శాస్త్రి ,
సంగీతం సమకూర్చినది ; సాళ్ళూరి రాజేశ్వర రావు ,
గాయకులు ;
ఘంటశాల ,
యస్. జానకి ,
బహుషా ఒక పాట కోమల పాడినట్లు గుర్తు .
పగలైతే దొరవేరా , రాతిరి నా రాజువు రా
కొండల కోనల సూరీడు కురిసే బంగారు నీరు
గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో
మనిషే మారే రా రాజా , మనసే మారే రా
ఇంకా రెండు పాటలున్నాయి కాని వాటి లింక్ దొరకలేదు . ముఖ్యం గా పాపను జోకొడుతూ నీల , తన బాధ తెలియచేసే పాట ,' జో కొడుతూ కథ చెపుతా ఊ కొడుతూ వింటావా ' పాట లింక్ కోసం వెతికాను కాని దొరకలేదు .
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
nice post........
thank you ashok .
Post a Comment