Wednesday, May 4, 2011
దొంగరాముడు
"దొంగరాముడు " సినిమాను 1955 లో "అన్నపూర్ణ పిక్చర్స్ " బానర్ లో డి . మధుసూధనరావు నిర్మించారు . అన్నపూర్ణా పిక్చర్స్ వారి మొదటి సినిమా ఇది . దీని తరువాత వారు చాలా మంచి సినిమాలు తీసారు . ఈ సినిమా డైరెక్టర్ కదిరి వెంకట రెడ్డి . నాగేశ్వర రావు , జగ్గయ్య , సావిత్రి , జమున , రేలంగి , సూర్యకాంతం మొదలైన వారు నటించారు .
కథా రచయతలు ; డి. వి నరసరాజు , డి మధుసూధన రావు .
సంగీతం ;పెండ్యాల నాగేశ్వర రావు ,
సినిమటొగ్రఫీ ; అడి .. యం ఇరానీ .
గాయనీ గాయకులు ; ఘంటశాల , మల్లాది రామకృష్ణ శాస్త్రి , జిక్కి & పి. సుశీల .
రాము చాలా అల్లరి పిల్లవాడు . స్కూల్ కు వెళ్ళ కుండా అల్లరి చేస్తూ వుంటాడు . తల్లి కి జబ్బు చేస్తే మందు తెచ్చేందుకు టౌన్ కు వెళుతాడు . రాము తీసుకెళ్ళిన డబ్బులు మందుకు సరిపోవు . ఎవరిని బతిమిలాడినా తక్కువైన రెండురూపాయలు ఇవ్వరు . తల్లిని బతికించుకునేందుకు ఆ మందు సీసా దుకాణం నుంచి దొంగతనము చేసి పారిపోతుండగా పోలీసులు పట్టుకొని బాలనేరస్తుల స్కూల్ లో చేరుస్తారు . ఆ సంగతి తెలిసి తల్లి చనిపోతుంది . చెల్లెలు లక్ష్మిని మాస్టర్ గారు అనాధాశ్రమంలో చేరుస్తారు .
రాము పెద్దవాడైనాక జైల్ నుంచి విడుదలై చెల్లెలిని కలుసుకుంటాడా ?
లక్ష్మి అనాధాశ్రమం లో ఎలా పెరుగుతుంది ?
చివరకు ఏమవుతుంది ? వీటన్నిటి కీ సమాధానం గా ఇదో "దొంగరాముడు " సినిమా చూడండి . పాత సినిమా అని ముక్కు విరవకండి . చాలా బాగుంటుంది . ఎంచక్కా కొన్ని స్నాక్స్ , టీ తెచ్చుకొని ఆరాముగా కూర్చొని చూడండి . తప్పక నచ్చుతుంది .
ఊ ఇంకెందుకు ఆలీసం ? కానివ్వండి .
Donga Ramudu - Full Length Telugu Movie ; దొంగరాముడు , పూర్తి సినిమా ఇది . అక్కడక్కడ తప్ప అంతా క్లియర్ గా వుంది . హాయిగా చుడవచ్చు .
సినిమా చూసారా ? ఇక పాటలు అన్ని ఓసారి చూడండి .
చిగురాకులలో చిలకమ్మా
అనురాగమే విరిసేనా
అందచందాలా సొగసరివాడు
రావోయి మా ఇంటికి
బాల గోపాలా
తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబూ
భలే తాత మన బాపూజీ
లేవోయి చినవాడా
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
baga rasaru mala garu
mee opika ki mechukovali
chaduvutunte cinema choosinatlundi
Donga raamudu, tea, snaks anni ready namdi mee post chusaka malli a movie chudalani anipistondi.
అనొనమస్ గారు ,
థాంక్స్ అండి
శైలబాల గారు ,
సినిమా విడియో కూడా పెట్టానుగా మరి సినిమా చూసారా ?
యుట్యూబ్ లో పాటల కోసం చూస్తుంటే సినిమా కూడా కనిపించింది . అంతే వెరీ హాపీ :)
నాకైతే పాతసినిమాలు ఎన్ని సార్లు చుసినా విసుగు రాదు .
ప్రభలతో కోటప్పకొండ తిరణాలకి వెళ్తున్న రెండెడ్ల బండ్ల నుండి వరసాగ్గా ఈ పాటలు వచ్చేవి. పాటలు విన్నాను సినీమా తిరిగి చూడాలి. ఓపికగా పోస్ట్ పెట్టినందుకు థాంక్స్.
అన్నట్లు మీ రెసిపీ తో పప్పు పులుసు చేసాను. బాగా వచ్చింది. ఒక చిన్న కధ మీ పప్పు పులుసు చేయటం తో ప్రారంభించాను. ఇదిగో లింకు:
http://mytelugurachana.blogspot.com/2011/04/55-43.html#comments
లక్కరాజు గారు ,
మీకు మా పాతకాలం వంటకాలు , పాత సినిమా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలండి .
Post a Comment