Tuesday, June 7, 2011

తోడికోడళ్ళు



నా ముందు తరం తెలుగింటి ఆడపడుచులు శరత్ నవలల ను బాగా ఆదరించారు . ఆ రోజులలో శరట్ నవలలు చదవటము , ఆ బెంగాలీ పేర్లను పిల్లలకు పెట్టుకోవటము ఫాషన్ గా వుండేది . అందుకు కారణం , బహుషా శరత్ నాయికలందరూ మధ్యతరగతి వారే . స్త్రీని అన్ని కోణాలనుంచీ చిత్రిస్తూ , శక్తిస్వరూపిణి గానూ , దయార్ద హృదయిని గానూ , సేవాతత్పరురాలుగానూ , ప్రేమామృతవర్షిణిగానూ , ఉద్యమశీలిగా నిలిపిన ఘనత శరత్ ది . 19వ శతాబ్ధం మద్య నుండి 20 శతాబ్ధం మద్య వరకూ శరత్ వర్ణించిన స్త్రీ జీవించిన సాంసారిక , సామాజిక పరిస్తితులే కొంచం అటూ ఇటూగా తెలుగునాట కూడా వున్నాయి . స్త్రీలోని బహుముఖీన స్వభావాలు తెలుగు పాఠకులనూ , ప్రధానం గా స్త్రీలనూ ఆకర్షించాయి . అందుకే తెలుగు పాఠకులకు శరత్ అత్యంత ఆదరణీయ రచయత కాగలిగాడు .
ఆ రోజులలో శరత్ నవల ల ఆధారము గా సినిమాలు కూడా చాలా వచ్చాయి . అవి జనాదరణ కూడా పొందాయి . 1957 లో అన్నపూర్ణ వారు శరత్ నవల " నిష్కృతి " ఆధారము గా " తోడికోడళ్ళు " నిర్మించారు . అన్నపూర్ణ వారి ఆణిముత్యములలో తోడికోడళ్ళు కూడా ఒకటి . ఇందులోని పాటలు కూడా ప్రజాదరణ పొందాయి .
ఇది చక్కటి ఉమ్మడి కుటుంబ కథా చిత్రము .
ఇదిగో ఆ సినిమా :-



సినిమా తరువాత చూస్తారా ? ఇప్పుడు పాటలు చూస్తారా వాకే
గాలిపటం గాలిపటం


కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ దానా



ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ . . .
ఇది బాగా హిట్టైన పాట . నాకూ ఇష్టమైన పాట :)



టౌన్ పక్కకెళ్ళొద్దూరా డింగిరీ . . .



పొద్దైనా తిరగక ముందే చుక్కైనా పొడవక ముందే . . .



ఎన్నతెన్నత దూరం కోసెడు దూరం . . .

3 comments:

సుజాత వేల్పూరి said...

ఈ సినిమాలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ నాకు నచ్చేది...పెద్దల గొడవల మధ్య పిల్లలు నలిగిపోతారు అనేది. కలకాలమీ కలత నిలిచేది కాదు పాట అందుకే నాకు బాగా నచ్చుతుంది. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే కాన్ ఫ్లిక్ట్ ని అతి సున్నితంగా చూపిస్తారు ఆ సీన్లో!

కానీ పెద్దవాళ్ళకెప్పటికీ బుద్ధి రాదు, తమ కలతల మధ్య పసి హృదయాలు ఎలా వసివాడిపోతాయో అని గ్రహించరు,.

మంచి సినిమా!

నేస్తం said...

అబ్బా ఈ సినిమా చాలా ఇష్టమండి మాల గారు.ఇందులో సావిత్రి సూర్యాకాంతం పిల్లలు పెళుసుగా సమాధానం ఇచ్చినపుడు ఏం మీ అమ్మనుకున్నావా> నాలుగు వేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తుంది.. మాదీ ఉమ్మడికుటుంభమే..తరుచూ పిన్నులు,పెద్దమ్మ అల్లరి చేసినపుడు అలానే అనేవారు ...అలాగే ఎవరు సంపాదించినా సంపాదించకపోయినా ఉమ్మట్లో నడిచిపోతుంది..ఒక మాట అనుకున్నా మళ్ళీ కలిసిపోతారు..చాలా సహజం గా తీసారు ఈ సినిమా

మాలా కుమార్ said...

సుజాత గారు ,
మీ వాఖ్యకు చాలా థాంక్స్ అండి .

& నేస్తం గారు ,
మదీ ఉమ్మడికుటుంబమే . ఇదో ఇప్పుడే నాలుగైదు నెలల నుంచి ఇద్దరమే వున్నాము ఇంట్లో ! నిశబ్ధం గా వున్న ఇంటిని చూస్తుంటే పిచ్చెకుతోంది :)
థాంక్ యు .