Thursday, August 4, 2011
పూలరంగడు
కొడుకు ప్రేమించిన అమ్మాయి పేదదైనా , కొడుకు ఇష్టపడ్డాడని పెళ్ళి చేస్తుంది డాక్టర్ ప్రసాద్ తల్లి . హాయిగా చిలకా గొరింకలలా కొడుకు కోడలు వుంటే ముచ్చటపడిపోతుంది . రోజులు అలా అలా హాపీగా గడిచిపోతే కథేముంది ? అందుకే , ఆ అమ్మాయి తన భర్తను చంపిన హంతకుడి కూతురని తెలిసిపోతుంది . ఇంకేముంది కోడలిని పుట్టినిటికి వెళ్ళగొట్టేదాక వూరుకోదు ఆ తల్లి . తల్లి మాట జవదాటనివాడు కొడుకు . మరి ఆ అమ్మాయి అన్న , అతను వూరుకున్నాడా ? ఎందుకు వూరుకుంటాడు ? చిన్నప్పటి నుంచి ప్రాణ పదం గా పెంచుకున్న చెల్లెలి కాపురం సరిదిద్దకుండా వూరుకోవటమే ! అందులోనూ తండ్రి నిర్దోషి అని తెలిసాక ! ఎత్తులు వేసి దోషిని పట్టించి , చెల్లెలి కాపురం సరి దిద్దాడు అన్న . ఈ కథ , అన్నపూర్ణా వారి పూలరంగడుది . ఆ చిత్రాన్ని ఇక్కడ చూసి ఆనందించండి .
ఈ చిత్ర నిర్మాత డి . మధుసూధన రావు . దర్శకుడు ఆదుర్తి .సుబ్బారావు . అన్నా చెల్లెళ్ళుగా నాగేశ్వరరావు , విజయనిర్మల నటించారు . నాగేశ్వరరావు కు జోడీగా జమున నటించింది . అందాల నటుడు శోభన్ బాబు డాక్టర్ ప్రసాద్ గా ముచ్చటగా వున్నాడు . పాటల లో , చిగురులు వేసిన కలలన్ని , నీ అడుగులోన అడుగువేసి నడవనీ, నాకు నచ్చాయి .చిగురులు వేసిన కలలన్నీ పాట లో విజయనిర్మల పెట్టుకున్న ముడి పూవు అప్పుడు చాలా ఫాషనైంది . ఎక్జిబిషన్ లో కటక్ స్టాల్ లో అలాంటివి వెండిపువ్వులు అమ్మేవారు :)
ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకతలు కూడా వున్నయి . అవి ఏమిటో నేను చెప్పటమెందుకు మీరే వినండి ,చూడండి .
నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా
మిస మిస లాడే చినదానా
చిగురులు వేసిన కలలన్నీ
నీవు రావు నిదుర రాదు
చిల్లర రాళ్ళకు మొక్కుతు వుంటే చెడిపోదువురా
నీ జిలుగు పైట నీడలోన నన్ను నిలువనీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment