Saturday, September 17, 2011
అమాయకురాలు
" అమ్మో వాళ్ళా , , , వాళ్ళ ముందు మనమెంత ?మనము చాలా అమాయకులం , అంత తెలివి మనకెక్కడేడ్చింది ." ఇలా అప్పుడప్పుడు కొంత మంది నోట వింటూ వుంటాము . నేనైతే ఆ మాటలు విని నవ్వుకుంటాను . ఎవరికి వాళ్ళు తాము చాలా అమాయకులమని , ఎదుటి వాళ్ళు గుండెలు తీసిన బంట్లని అభిప్రాయ పడుతూ వుంటారు :) ఎవరూ అంత అమాయకులేమీ కాదు కదూ ! కాని 1971 లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు తీసిన సినిమాలో రాధ మటుకు చాలా అమాయకంగా మోహన్ చేతిలో రెండు సార్లు మోసపోతుంది . అమాయకురాలు సినిమా చూసినప్పుడు రాధ పాత్ర మీద జాలి వేసింది . జమీందారు భూషయ్య గారాల కూతురు రాధ . మేనళ్ళుడి కి ఇచ్చి పెళ్ళి చేయాలని వున్నా , భార్య మాట కాదనలేక వేరే సంబందం చూస్తాడు భూషయ్య. కోర్ట్ పని మీద హైదరాబాద్ వెళుతున్న భూషయ్య తో పాటు వెళుతుంది రాధ . అక్కడే వున్న మోహన్ ను కలుస్తుంది . కోర్ట్ కేస్ లో భూషయ్య ఓడిపోయాడని తెలిసి ఆ సంబంధం వదులు కుంటారు మోహన్ వాళ్ళు అప్పటికే గర్భవతి ఐన రాధ ను భూసయ్య మేనల్లుడు ప్రసాద్ పెళ్ళిచేసుకునేందుకు ముందుకు వస్తాడు కాని ప్రసాద్ ప్రేమ కథ తెలిసి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది . లారీ కింద పడిన ఆ రాధ ను ఆ లారీ డ్రైవర్ రక్షించి తన ఇంట్లో వుంచుకొని కన్నకూతురిలా చూసుకుంటూ వుంటాడు . రాధ కు పాప పుడుతుంది . తన మీద అత్యాచారము చేయబోయిన రౌడీ ని హత్య చేసి జైలు కు వెళుతుంది రాధ . రాధ జాడ తెలుసుకున్న ప్రసాద్ , రాధ పాపను తన స్నేహితురాలి కూతురని చెప్పి తీసుకొచ్చి పెంచుకుంటాడు . ఆ క్రమము లో ప్రసాద్ భార్య శోభ ప్రసాడ్ ను రాధ ను అనుమానించటము , లండన్ నుంచి తిరిగి వచ్చిన మోహన్ మళ్ళీ రాధ ను నమ్మించి చంపేయటమూ , సంగతి తెలిసి శోభ నిజం తెలుసుకొని పాపను పెంచి పెద్ద చేయటము జరుగుతుంది .
ఈ సినిమా నిర్మాత ; డి. మధుసూధనరావు
డైరక్టర్ ; వి. మధుసూధన రావు
కథ ; పిని శెట్టి శ్రీరామమూర్తి
సింపుల్ గా నడి చే చక్కని కుటుంబ కథా చిత్రం ఈ సినిమా .ఇందులోని పాటలు కూడా బాగున్నాయి . నాగేశ్వరరావు , కాంచన , శారద ఇందులోని ముఖ్య నటీ నటులు .
సంగీతం ; యస్. రాజేశ్వర రావు ,
నేపద్య గాయనీ గాయకులు ; పి. సుశీల ,
ఘంటసాల , బాలసుబ్రమణ్యం
ఎల్ ఆర్ ఈశ్వరి ,
పిఠాపురం .
పాడెద నీ నామమే గోపాలా ,
ఈ పాట రాధ పెళ్ళిచూపుల్లో పాడుతుంది . నాకు చాలా నచ్చింది .
సన్నజాజిపూవులు చందమామ కాంతులు చిన్నారి పాప నవ్వులు
ఈ పాట ను మా మనవరాళ్ళు , మనవళ్ళ చిన్నప్పుడు , ఎవరికి పాడుతే వాళ్ళ పేరు పెట్టి పాడే దానిని . పిల్లలు ఈ పాటను చాలా ఎంజాయ్ చేసేవారు .
నీ చూపులు గారడి చేసెను
చిరునవ్వుల కులికే రాజా , సిగ్గంతా ఒలికే రాణి
హలొ సారూ భలె వారు , చెలి వలుపుతెలుసుకోరు
పైకెంతో చల్లని వారు తమరెంతో అల్లరి వారు
నా మనసు దోచినారు .
చాలు చాలు సరసాలు
ఇక దూరంగా వుంటే నే మేలు .
కొంటె పిల్లా కోరుకున్న జంట దొరికింది
వంట ఇంటి కుందేలై చేత చిక్కింది .
బ్రహ్మచారీ వంట ఇంటి బాధ తప్పింది
కళ్ళలోనా పెళ్ళి సొగసు గంతులేసింది .
చిన్నారి పైడి బొమ్మా కన్నీరు ఎందుకమ్మా
నీ తల్లి బాధ మరిచి నిదురించవే .
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
మంచి సినిమాను గుర్తు చేసారండీ మాలాకుమార్ గారూ!
"సన్న జాజి పూల" వద్దే
"వెలుగునీడలు"లోని
"చల్లని వెన్నెల సోనలు" కూడా
జ్ఞాపకం చేస్తే బాగుంటుంది.
;
-konamanini
;
మంచి సినిమాను గుర్తు చేసారండీ
మాలాకుమార్ గారూ!
"సన్న జాజి పూల" వద్దే
"వెలుగునీడలు"లోని
"చల్లని వెన్నెల సోనలు" కూడా
జ్ఞాపకం చేస్తే బాగుంటుంది.
- kadanbari
;
కుసుమ గారు ,
ఈ పోస్ట్ లు సినిమా ల గురించి రాస్తున్నాండి . అందుకే ఆ రెండు పాటలను కలపలేదు . ఆ పాట వెలుగునీడలు సినిమా పరిచయం లో వ్రాసాను .
థాంక్ యు .
Post a Comment