Thursday, September 29, 2011

బంగారు కలలు



యద్దనపూడి నవల " బంగారు కలలు " అధారం గా అన్నపూర్ణావారు 1974 లో నిర్మించిన చిత్రం " బంగారు కలలు " . ఇందులో రవి ( ఏ. నాగేశ్వరరావు ) , సరోజ ( వహీదరెహ్మాన్ ) వీరిద్దరె ముఖ్య పాత్రదారులు . యవ్వనం లో వున్న ఓ అమ్మాయి , ఓ అబ్బాయిని నమ్మి , అతని గురించి పూర్తిగా తెలుసుకోక , అతని తో వెళ్ళిపోతే ఆమె కన్న బంగారుకలలు ఎలా నాశనమవు తాయో చూపటమే ఇందులోని ంఖ్యాంసం . ఎంత చదువుకున్నా , తెలివి కలదైనా అమ్మాయికి నా అనే వారి అండ చాలా ముఖ్యం !
సరోజ పురుషొత్తమ్రావు గారి అండలో పెరుగుతూ వుంటుంది . శేషు మాటలు నమ్మి అతనితో లేచిపోతుంది . కొన్ని రోజుల తరువాత అతని నిజ స్వరూపం తెలుసుకొని ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది . సేవాసదన్ లో చేరి నాట్యం నేర్చుకుంటుంది . హోటల్ లో ప్రదర్షనలు ఇస్తూవుంటుంది . అలా హోటల్ లోనే రవి ఆమెను చూస్తాడు . ఆమె కథ తెలుసుకొని ఆదరిస్తాడు . ఆమె కూతురి కి తండ్రిని అని చెప్పి స్కూల్ లో చేరుస్తాడు . సరోజ ప్రసాద్ దగ్గర నర్స్ గా చేరుతుంది . ఇదంతా రవి ప్రేమించిన జ్యోతి అపార్ధం చేసుకుంటుంది . దుర్వ్యసనాల తో జేల్ కు వెళ్ళిన శేషు , జే నుంచి తిరిగి వచ్చి , సరోజ గురించి తెలుసు కుంటాడు . సరోజను వేదిస్తూ వుండగా చూసిన పురుషోతం అతనిని చంపేస్తాడు . తండ్రి నేరం తన మీద వేసుకొని జేల్ కు వెళుతాడు రవి . కోర్ట్ కు వచ్చి , సరోజ తన కూతురని , ఆ సంగతి లోకం నుంచి దాచానని , రవి కి మాత్రం చెప్పానని , సరోజను శేషు చంప బోతుండగా తనే హత్య చేసానని చెప్పి చనిపోతాడు . రవి , జ్యోతి పెళ్ళి చేసుకుంటారు . సరోజ నర్స్ గానే కొనసాగాలని నిర్ణయించుకుంటుంది .
ఈ సినిమా నిర్మాత డి . మధుసూధన రావు .
దర్శ్కుడు ; ఆదుర్తి . సుబ్బారావు .

సంగీత దర్శ్కుడు ; యస్. వి రాజేస్వర రావు .
గాయనీ గాయకులు ; పి. సుశీల ,
ఘంటసాల,
రామకృష్ణ ,
పిఠాపురం ,
మాధవపెద్ది ,
రఘురాం .

చెక్కిలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా


పుట్టిన రోజు జేజేలు చిట్టిపాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి .
ఈ పాట చాలా పాపులర్ ఐంది . ఎవరి పుట్టిన రోజన్నా ఈ పాట ముందు గుర్తొస్తుంది .


సిగారం చిందులు వేసే అమ్మాయిల్లారా
బంగారు కలలే కంటున్నారా ,
ఇది టైటిల్ సాంగ్ . ఈ పాట్ కూడా బాగుంటుంది . వహీదా డాన్స్ కూడా బాగా చేసింది . కాని వహీదా డ్రెస్ , మేకపే అంత నచ్చలేదు నాకు ! అసలు ఈ సినిమా లో వహీదా కొంచ ఏజ్డ్ గా అనిపించింది .


నాలోనా వలపుంది నీ లోనా వయసుంది .
నవల చదివి , సినిమా చూస్తుంటే , సినిమా వూహించినట్లు వుండకుండా నిరాశ కలుగు తోంది . అందుకే ఈ సారి నవల చదవకుండా నే సినిమా చూసాను . రంగులు కొంచం డార్క్ గా వున్నాయి . నాగేశ్వరరావు , వహీదా కొంచం ఏజ్డ్ గా అనిపించారు . అన్నట్లు కాంతారావు ఇందులో నాగేశ్వర రావు మామగారు :) కాని సినిమా పరవాలేదు . ఓకే చూడవచ్చు :)

No comments: