Friday, August 28, 2009

కళ్యాణం కమనీయం

కళ్యాణం కమనీయం
జీవన తరంగాలు -6
వివాహ నిర్ణయం కాగానే ఇల్లంతా సందడి సందడి.బామ్మ ఆధ్వర్యం లో అప్పడాలు వత్తించటం,వడియాలు పెట్టించటం,పిండివంటలు చేయటం చకచకా జరిగిపోతుంటే,ఇంకో పక్క షాపింగ్ పనులు.అత్తయ్య వారం ముందు నుంచే మేనకోడలు నలుగుపెట్టి స్నానం చేయిస్తోంది.అవును మరి పెళ్ళికూతురు కళకళలాడాలిగా.అత్త స్నానం చేయించేలోపల పిన్ని అన్నం కంచంలో కలుపుకొచ్చి ముద్దలు చేసి తినిపిస్తోంది పెళ్ళికూతురు..ఆ పైన హాయిగా పాటలు వింటూ నేస్తాలతో కబుర్లు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది.మస్తాను కోసుకొచ్చి కాచువేసి రుబ్బిన గోరంటాకు చక్కని డిజైన్లతో చేతికి, కాళ్ళకు పారాణిలా పెట్టారు.అరచేతులు గోరంటాకు సువాసనతో ఎర్రగా పండి ఎంత ముద్దొస్తున్నాయో.
పెళ్ళిరోజు రానే వచ్చింది.ఆజాంబాహుడు అందాల రామయ్య బంధు మితృలతో తరలి వచ్చాడు.
ఆకాశమంత పందిరి వేసి ,భూదేవంత పీఠం వేసి రంగ రంగ వైభోగంగా జానకీ ,రామారావుల కళ్యాణం జరిపించారు నాన్న.
విందు భోజనం లో అప్పడాలు లేవు ఇదిఏమి విందు భొజనం అని పాటెత్తుకుంది, వరుడి మేనత్త.అయ్యో వేయటము మర్చిపోయినట్లున్నాము అంటూ హడావిడిగా అప్పడాలేసింది వధువు పిన్ని.అప్పడాలే మరిచారు, అమ్మాయినంపటమూ మరుస్తారేమో మరో పాట వచ్చేసింది.వధూవరులు బంతిభోజనం చేస్తుంటే తాతయ్య వచ్చి మురిపెంగా చూసుకున్నారు.పాటల సరదాల మధ్య విందు తరువాత, సిగ్గూ పూబంతీ విసిరే సీతా మాలక్ష్మీ అని పాటలు పాడుతూ బంతులాటలాడించారు.ఆటపాటల తో నునుసిగ్గుల జానకి కళ్యాణము కమనీయం గా జరిగింది.
సీతారాముల కళ్యాణము చూతము రారండీ.

https://www.youtube.com/watch?v=EO3JWdSL1mk

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_28.html

6 comments:

శ్రీలలిత said...

మాలాకుమార్ గారూ,

శివధనుర్భంగం, సీతా కల్యాణం చిత్రం చాలా బాగుంది. పెళ్ళిపాటలు ఇదివరకు ఇరువైపులవాళ్ళూ బాగా పాడేవాళ్ళు. ఇప్పుడంతగా వినిపించటంలేదు. అంతా వీడియోల యుగమైపోయింది. ఆ సరదాలు, వేళాకోళాలు, వెక్కిరింపులు, కలిసిపోడాలూ...ఇప్పుడేవీ.. పాత సంగతులన్నీ గుర్తుచేసారు. థాంక్స్.

మాలా కుమార్ said...

అవునండి శ్రీలలిత గారు మా పెళ్ళి రోజులలో ఆ సందడి, ఈరోజు లలో షాప్పింగ్ లూ , విడియో లూ ,ఖరీదైనా బఫేల సందడీ, ఏదైనా కళ్యాణం కమనీయం.

మరువం ఉష said...

ఈ పాటలతో పాటు "సీతకోకచిలుక" లో "మాటే మంత్రము, మనసే బంధమూ" కూడా వుండివుంటే అదిరేది సుమండీ..

మరువం ఉష said...

I found the song "ఓం శతమానం భవతి శతాయు పురుష
శతెంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్తటి

మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము" online at: http://aboutsubhash.com/?p=92

****
May be a request to the blog owner would help!

మాలా కుమార్ said...

ఈ పాట కోసం కూడా చాలా వెతికానండి ఊహు దొరకలె !

తృష్ణ said...

మాటే మంత్రము..ఆడయో కావాలంటే ఇవ్వగలనండి...