Saturday, August 29, 2009

పూలరధం

పూలరధం

జీవనతరంగాలు - 7

కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అమ్మ దొంగా నిను చూడకుంటే, నాకు బెంగా అనుకుంటూ జానకి చిన్నప్పటి ముచ్చటలు తలుచుకుంటూ జానకి కి వడిబియ్యం కడుతోంది అమ్మ.బామ్మ , అమ్మమ్మ,అత్త, పిన్ని అందరూ "జానకి కి అత్తవారింట్లో ఎలా మెలగాలో చెబుతున్నారు.ఇంతలో బాబాయ్ వడి వడి గా వచ్చేసి ,అమ్మాయ్ జానకి అత్తవారింట్లో జాగ్రత్తగా వుండమ్మా ,ఎవరేమన్ననూ ఎదురాడబోకు,మగడేమన్ననూ మారాడబోకూ" అని చెప్పటము మొదలు పెట్టగానే అందరూ పక్కున నవ్వి మీకూ తెలుసా ఇవన్నీ అంటూ వేళాకోళాలు మొదలు పెట్టారు. భారం గా వున్న వతావరణం కొంచం తేలికైంది.
వధూవరులను ఎదురెదుగా కూర్చోబెట్టి దంపత తాంబూలాలు ఇప్పించారు.ఆడపడుచు అన్న కండువాలో వసంతం వేసి,ఓ చెక్కబొమ్మను పెట్టి, అన్నవాదినల వడిలో వసంతం పడేట్టుగా కాసేపు ఉయ్యాలలా ఊపి సందడి చేసింది.ఆ తరువత అసలైన ఘట్టం మనసు భారంగా మొదలైంది.
పాలలో చేతులు ముంచి అల్లుడికి అత్త మామలకు ,ఆడపడుచులకూ పేరు పేరు నా అందరికీ అప్పగించారు అమ్మా నాన్న.
అమ్మ పెట్టిన పెరుగన్నం తిని బయిలుదేరుతున్న జానకి కి చాటుగా అమ్మమ్మ 10 రుపాయలిచ్చింది.ఎందుకమ్ముమ్మా అంటే "పిచ్చి తల్లీ వుండనీయమ్మా ,అమ్మ కి కార్డ్ ముక్క రాయాలన్న ,నువ్వు చటాకు పూలు కొనాలన్నా వుంటాయి"అంది ఆప్యాయం గా .అమ్మ్ముమ్మ సరదా అని తీసుకొని అమ్మకు అందరు పెద్దల కాళ్ళకు దండం పెట్టి,సెలవు తీసుకొని,భారమైన మనసుతో కళ్ళనీళ్ళ ను కనిపించనీయకుండా అమ్మా ,నాన్నా ,పుట్టింటి ఆత్మీయులను వదిలి పతి చేయి అందుకొని పూల రధం లా అలంకరించిన పడవంత కారు లో అత్తింటికి బయిలుదేరింది జానకి.

https://kammatikala.blogspot.com/2009/08/blog-post_29.html

https://www.youtube.com/watch?time_continue=2&v=qGRjGvW0AdM&feature=emb_title









9 comments:

Srujana Ramanujan said...

All comments at one place. Very nice idea. So, happy journey. :-)

భావన said...

బాగుంది మాల గారు. నిన్నే "అమ్మ దొంగ" పాట ఎందుకో గుర్తు చేసుకున్నా... :-)

మాలా కుమార్ said...

thank you srujana ,

మాలా కుమార్ said...

బహుషా బందర్ గుర్తొచ్చివుంటుంది.
థాంక్ యు.

మరువం ఉష said...

This is my third time listening the 1st and second time the 2nd one. You have good taste and equally good at setting up the listener's mood. Nice job.

జయ said...

నాకు ఎంతో ఇస్టమైన 'అమ్మదొంగా ' పాట ఇన్నాళ్ళకు వినగలిగాను. వేదవతి ప్రభాకర్ పాడిన పాట. జీవితాన్ని వడబోసి రాస్తున్న ఈ జీవనతరంగాలు చాలా బాగుంటోంది. ఆలుమగల పాటకోసం కూడ చాల కస్టపడి వెతికిఉండాలి. మై హార్టీ కంగ్రాట్స్.

మాలా కుమార్ said...

ఏమిటో ఉష మరీ మునగ చెట్టెక్కిస్తున్నారు .
మీకు అమ్మ దొంగా పాడుకోవటాని కి ఇంకా టైం వుందికదా !
థాంక్ యు.

మాలా కుమార్ said...

థాంక్ యు జయ .
కావలసిన పాటలు ఓ పట్టాన దొరకటము లేదు. వున్న వాటితో సర్దుకోవాల్సి వస్తోంది.

మరువం ఉష said...

కానీ, నా ఇంట జరిగిన అంపకాలు/అప్పగింతలు ఇంకా గుర్తేనండి, పాలల్లో ముంచిన మా అక్క చేతుల్లో మా కన్నీళ్ళే నిండాయి నిజానికి, నా చేతుల్లోనూ నా కలతో పాటు కన్నీళ్ళు కూడా కలిపి వారికి అందించాను. వాటి కలగలుపుగానే సాగుతున్నాను.