# జీవన తరంగాలు - 2 #
పాపాయి అందరికీ గారమే ! అత్త ,తాత, అమ్మమ్మ,బామ్మ అందరికీ ముద్దే . ముచ్చటైన పాపాయికి, సీతాదేవి అంత సౌజన్య మూర్తి ,వినయశీలి కావాలని నాన్న జానకి అని పిలుచుకున్నారు.
సన్నజాజీ పూవులూ చందమామ కాంతులు అందాలపాపా నవ్వులూ,
మా యింటి వెలుగు ,మా కంటి వెలుగు మా చిన్ని పాపా నవ్వులే !
తాతయ్య మీసాల ఉయ్యాల లూగేనూ,అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను.
అని అమ్మమ్మా ,తాతయ్య సంబరాలు పోతే,
బంగారు ప్రాయమిది పవళించవె తల్లి,
ఈ రోజు దాటితే నిదురేది మళ్ళీ అని పిన్ని సుద్దులు చెప్పింది.
అత్తవడి పూవువలే మెత్తనమ్మా అంటూ అత్త ముద్దు చేసింది.
పాపాయి కి అత్తమీద అంత ప్రేమే .ఈ బంధాలు అనుభంధాలే కదా మధురమైనవి
https://www.youtube.com/watch?v=GBwm8qEAZrs&list=RDGBwm8qEAZrs&start_radio=1&t=0
4 comments:
అవును. పసివయసు లో ఉన్న అంత సౌకుమార్యం జీవితం లో మళ్ళీ ఎప్పటికి దొరకాలి. 'ఎదగడాని కెందుకులే తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర '.
"ముద్దుల పాపకు తెలియునులే మురిపమిచ్చేది తల్లియని.." అని ఒక పాత లలితగీతం ఉందండి.అలాగ..ముద్దు మురిపాలు బిడ్డల హక్కులు...!!
ఎదగటానికెందుకు తొందర ? అంటే ఎలా ? ఎదర బ్రతుకు ఎంత చిందర వందర అయినా ఎదగాలి , కష్టాలు , సుఖాలు అన్నీ అనుభవించాలి .
తృష్ణ గారు ,
లలిత గీతము వుందని చెప్పకపోతే , ఆ చేత్తో లింక్ ఇవ్వవచ్చుకదండి !
Post a Comment