1967లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు నిర్మించిన సినిమా " సుడిగుండాలు " . ఇది పిల్లల మనస్తత్వం మీద తీసిన సినిమా . జడ్జీ చంద్రశేఖర్ రావు ( ఏ. నాగేశ్వర రావు ) భార్య పురిటిలో బాబును ప్రసవించి చనిపోతుంది . బాబును చాలా గారాబంగా క్రమశిక్షణ తో పెంచుతుంటాడు చంద్రశేఖర రావు . చంద్రశేఖర రావు చాలా దయార్ధహృదయుడు . తన వలన శిక్ష పడిన వారి కుటుంబాలను ఆదుకుంటూ వుంటాడు . రాజా స్కూల్ లో స్వాతంత్ర్యదినోత్సవం రోజున నృత్య నాటిక వేస్తారు . అందులో రాజా మహాత్మా గాంధీ వేషం వేసి మొదటి బహుమతి గెలుచుకుంటాడు .
రాజా పుట్టిన రోజున స్కూల్ పిల్లలందరినీ పార్టీ కి పిలుస్తారు . పిల్లలంతా వస్తారుకాని రాజా రాలేదు . రాత్రంతా వెతుకుతారు దొరకడు . పోలీస్ రిపోర్ట్ ఇస్తారు . ఐనా దొరకలేదు . మరి రాజా ఏమైనట్లు ? పొద్దున్నే హాస్పిటల్ లో వున్న ఆక్సిడెంట్ ఐన పిల్లవాడి ని చూడమని చంద్రశేఖర్ ను పిలుస్తారు . అతను వెళ్ళి , మా రాజా కాకూడదు అనుకుంటూ చూస్తాడు . కాని అది రాజానే ! పైగా రాజా ది ఆక్సిడెంట్ కాదని ఎవరో హత్య చేసారని చెపుతాడు ఇన్స్ పెక్టర్ . రాజా పసివాడు . అంత పసివాడిని ఎవరు హత్య చేసారు ? ఎందుకు చేసారు ?
ఏమో ఇదో సినిమా పెడుతున్నాను చూసి తెలుసుకోండి .
ఈ సినిమా నిర్మాత డి. మధుసూధనరావు ,
డైరెక్టర్స్ : ఆదుర్తి సుబ్బారావు , కె విశ్వనాథ్ ,
మ్యూజిక్ ; కె వి . మహదేవన్ ,
గాయనీ గాయకులు ; ఘంటసాల , పి. సుశీల
ఈ సినిమా నంది అవార్డ్ కూడా గెలుచుకుంది . ఇంకో విశేషం , దీనిలో అక్కినేని నాగార్జున కూడా నటించాడు . ఎక్కడో సినిమా చూసి కనిపెట్టండి :
6 comments:
చాలా మంఛి సినిమాను గుర్తు చేసారు మాలగారూ.
భలే చిక్కు పెట్టారండి !.. రేపు చిత్రం చూసి చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. మంచి చిత్రాలని చూపే ప్రయత్నం ప్రశంసనీయం.ధన్యవాదములు..మాల..గారు
మాలా కుమార్ గారు, చక్కని చిత్రం ఇది. ఎన్నో ఏళ్ళ క్రితం చూసాను. చూస్తున్నంత సేపు ఏదో ఉద్వేగం, బాధ, జాలి, కరుణ, కోపం అన్నీ కలుగుతాయి. ఏఎన్నార్ నటన అద్వితీయం. అటువంటి గుండెలు పిండే నటన మళ్ళీ "సీతారామయ్య గారి మనవరాలు లో చూసాను. అయితే "సుడిగుండాలు" వంటి మరో ప్రయోగాత్మక, ప్రబోధాత్మక చిత్రం "మరో ప్రపంచం". అది మీ వద్ద వుంటే ముందెప్పుడైనా పోస్టు చేయగలరు. మీ అభిరుచి ప్రశంసనీయం.
తృష్ణగారు ,
థాంక్స్ అండి .
*వనజామాలి గారు ,
మీరు మళ్ళీ ఇక్కడి కి రావాలంటే ఆ మాత్రం చిక్కు పెట్టకపోతే ఎలాగండి :)
సూర్యనారాయణ గారు ,
మీ కామెంట్ కు థాంక్స్ అండి .
మరో ప్రపంచం సినిమా ఇక్కడ చూడవచ్చు అండి .
http://www.youtube.com/watch?v=-hA45TQHQEE&feature=relmfu
మంచి సినిమా గురించి రాసారు. నే
ను చూసిన సినిమాల్లో ఇది ఎప్పుడు గుర్తుండే సినిమా అని చెప్పచ్చు. మీరు రాసే విధానం నాకు బాగా నచ్చుతుంది. క్లుప్తంగా, ఆసక్తి కలిగే విధంగా ఉంటుంది. ప్రశంసనీయం...అభినందనలు.
Post a Comment